
MAA Elections 2021: నటి హేమ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు, నటుడు నరేశ్ స్పందించాడు. హేమపై చర్యలు తీసుకుంటామని సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో నరేశ్, జీవితలతో పాటు పాటు హీరో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేశ్, జీవితలు మాట్లాడుతూ.. హేమ ఆరోపణలపై వివరణ ఇచ్చారు. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని, తను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అన్నారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని, కమిటీ నిర్ణయం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాము కూర్చుని డబ్బు ఖర్చు పెట్టడం లేదని, మాకున్న ఇమేజ్‌తో ఫండ్ తెచ్చుకున్నామని నరేశ్ స్పష్టం చేశారు. ఈ టర్మ్‌లో కోటి రూపాయల ఫండ్ సమకుర్చామని తెలిపారు. కరోనా దృష్యా ఎన్నికలు ఎపుడు నిర్వహించాలనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. కాగా, మా ఎన్నికల నేపథ్యలో హేమ మాట్లాడుతూ.. నరేశ్ అసలు ఎన్నికలు జరకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని పావులు కదుపుతున్నారన్నారు. ప్రస్తుత ప్యానల్ ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా, ఉన్నదంతా ఖర్చు పెడుతున్నారని, తాము ఫండ్ రైజ్ చేసి ఇస్తే.. నరేశ్ ఖర్చు పెడుతున్నారంటూ ఆమె ఆరోపించిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment