మీ దగ్గరికే వస్తా టెస్టులు చేయించండి.. హేమ కొత్త వీడియో | Actress Hema Latest Video On Bangalore Drugs Case | Sakshi
Sakshi News home page

Hema: నేను రెడీ.. నాకు టెస్టులు చేయించండి సర్!

Published Mon, Sep 16 2024 1:14 PM | Last Updated on Mon, Sep 16 2024 1:48 PM

Actress Hema Latest Video On Bangalore Drugs Case

నటి హేమ మరో వీడియో రిలీజ్ చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తన వైపు ఎలాంటి తప్పు లేదని, కావాలంటే టెస్టులు కూడా చేయించుకోవడానికి సిద్ధమని మీడియాకి రిక్వెస్ట్ చేసింది. దాదాపు ఆరు నిమిషాల వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆవేదన అంతా బయటపెట్టింది.

హేమ కొత్త వీడియో
కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని రేవ్ పార్టీలో హేమ దొరికింది. కానీ ఆ టైంలో తాను వేరే చోట ఉన్నానని బుకాయించడానికి ప్రయత్నించింది. అయితే హేమ అప్పుడు పార్టీలో పాల్గొందని, డ్రగ్స్ కూడా తీసుకుందని పోలీసులు తేల్చారు. కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత హేమని అరెస్ట్ చేసి కొన్నాళ్లు జైల్లో ఉంచారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఈమెపై ఈ మధ్య మరోసారి డ్రగ్స్ పాజిటివ్ వార్తలొచ్చాయి. ఇప్పుడు వాటిపై స్పందిస్తూ హేమ కొత్త వీడియో రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్‍.. ఆ మూడు కాస్త స్పెషల్)

హేమ ఏం చెప్పింది?
'గతంలో నాకు పాజిటివ్ వచ్చిందని మీడియా వాళ్లు ఏదైతే ప్రచారం చేశారో.. అదే పాత న్యూస్‌ని తీసుకొచ్చి మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు. ఛార్జ‍ీషీట్ ఇంకా నేనే చూడలేదు. నా చేతికే రాలేదు. అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది? మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నేను మీ దగ్గరికే వస్తాను. టెస్టులు చేయించండి. ఒకవేళ పాజిటివ్ వస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను. ఆ శిక్షని అనుభవిస్తాను. నెగిటివ్ వస్తే మీ పెద్దలందరూ కలిసి ఏం చేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి'

'ఈ న్యూస్ వల్ల మా అమ్మకి యాంగ్జైటీ వచ్చింది. నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాం. అలానే పరువు కోసం నేను చచ్చిపోతా. నా కుటుంబం తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు. ఇండస్ట్రీ నా వల్ల తలదించుకునే పని ఏ రోజు చేయలేదు. ఏ రోజు కూడా చేయను. గతంలో చేయలేదు. భవిష్యత్తులో చేయను కూడా. ఎక్కడికి రమ్మన్నా వస్తాను నేను రెడీ. నాకు టెస్టులు చేయించండి' అని హేమ దాదాపు 6 నిమిషాల వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. 

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితీ రావ్ హైదరీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement