విశాఖ డ్రగ్స్‌.. చంద్రబాబు ఇంగితం లేని మాటలు: సజ్జల | Sajjala Ramakrishna Reddy Slams CBN Over Vizag Drugs Case, Details Inside - Sakshi
Sakshi News home page

Vizag Drugs Case: చంద్రబాబు ఇంగితం లేని మాటలు: సజ్జల

Published Fri, Mar 22 2024 1:46 PM | Last Updated on Fri, Mar 22 2024 4:48 PM

Sajjala Ramakrishna Reddy Slams CBN Over Vizag Drugs Case - Sakshi

డ్రగ్స్ కంటైనర్ చంద్రబాబు బంధువులదే...!

విశాఖ డ్రగ్స్ కేసులో దొంగే దొంగ అన్నట్లుగా చంద్రబాబు అండ్ కో అరుపులు.

సాక్షాత్తు పురందేశ్వరి కొడుకు కూడా ఆ కంపెనీలో భాగస్వామే..!

పట్టుబడిన డ్రగ్స్ వెనుక చంద్రబాబు, పురందేశ్వరి గ్యాంగ్ లు

ఈ వ్యవహారంపై సీబీఐతో పాటు సంబంధిత సంస్థలకూ ఫిర్యాదు

వాస్తవాలు తెలుసుకోకుండా బాబు అండ్ కో థర్డ్ గ్రేడ్ ఆరోపణలు

తప్పుడు రాతలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతిపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు

సాక్షి, గుంటూరు: విశాఖ డ్రగ్స్‌ విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. డ్రగ్స్‌ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన సజ్జల.. తప్పించుకోవడానికే  ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. 

శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విశాఖ పోర్టులో సీబీఐ డ్రగ్స్‌ను సీజ్‌ చేసింది. పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు.  చంద్రబాబు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు. వీధి స్తాయి మనస్తతత్వం చంద్రబాబుది. తప్పుడు చేయడం టీడీపీకి అలవాటుగా మారింది.  గత ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్‌పై తూతు మంత్రంగా దాడుల చేశారు. డ్రగ్స్‌ నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి. తప్పు చేసి రివర్స్‌లో మాపైనే ఆరోపణలు చేస్తున్నారు. తప్పించుకోవడానికే మాపై నిందలు వేస్తున్నారు. 

.. మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు కలలు కంటున్నారు. వైఎస్సార్‌సీపీకి జనాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. అది తట్టుకోలేకపోతున్నారు. వాళ్లకు చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్‌ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలని సీబీఐకి లేఖ రాస్తాం. ఎన్నికల మిషన్‌ కూడా డ్రగ్స్‌పై దృష్టి పెట్టాలని కోరతాం. ప్రజలను కన్ఫ్యూజ్‌ చేసి పబ్బం గడుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది’’ అని సజ్జల మండిపడ్డారు.

సజ్జల ప్రెస్‌మీట్‌లో ముఖ్యాంశాలు

  • డ్రగ్స్‌ కేసులో దొంగే దొంగా దొంగా అన్నట్టుగా టీడీపీ ఆరోపణలు చేస్తోంది
  • ఏ మాట్లాడుతున్నాం అనే ఇంగితం ఉండాలి కదా చంద్రబాబూ?:
  • టీడీపీ వారి అరుపులే నిజాలైపోతే..ఆ పార్టీ చెప్పే అబద్ధాలన్నీ కూడా నిజాలైపోతాయి.
  • గాల్లోంచి తీసి కల్పితాలను కూడా నిజాలుగా వారు చిత్రీకరించగలరు.
  • గుమ్మడికాయ దొంగెవరూ భుజాలు తడుముకుంటున్న చందాన దొంగే దొంగ దొంగ అని అరుచుకుంటూ వెళ్తున్నారు.
  • వైజాగ్‌ డ్రగ్స్‌ కేసు సినీ ఫక్కీలో పట్టుబడింది. సీబీఐ దాన్ని పట్టికుంది. ఓ వైపు విచారణ జరుగుతోంది.
  • ఈ నేపథ్యంలో టీడీపీ వారి పైత్యం విపరీతంగా మారిపోతోంది.
  • నేరుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకునే లోకేశ్‌లు కూడా ట్వీట్‌లు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది.
  • అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతున్నాడు.
  • మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనే ఇంగితం ఉండాలి కదా?
  • జరిగిన విషయంలో వాస్తవాలు ఏంటి? అనేది అంత అనుభవం ఉన్న వ్యక్తి ఆలోచించుకోవాలి కదా?
  • భారీ ఎత్తున డ్రగ్స్‌ పట్టుకున్నారు. అది దేశంలోకి వచ్చి ఉంటే భయంకరంగా ఉండేది. పట్టుకోవడం ఓ పెద్ద రిలీఫ్‌.
  • వీళ్లు అరిచే అరుపులు చూస్తుంటే వీళ్లే దాని వెనుక ఉన్నారేమో అనే అనుమానం కలుగుతోంది.
  • పోనీ ఆ కంపెనీ చరిత్ర తీస్తే అంతా వారి కుటుంబాలకు దగ్గరగా ఉండే బంధువులు.
  • సాక్షాత్తు పురందేశ్వరి కొడుకు కూడా వారి కంపెనీల్లో భాగస్వామిగా ఉన్నారు.
  • ఆమె వియ్యంకుడు కూడా ఆ కంపెనీలో పార్టనర్‌గా ఉన్నారు. వాళ్లు ప్రమోట్‌ చేసిన కంపెనీ నుంచి తర్వాత డివైడ్‌ అయ్యారు.
  • ఇలాంటి నేపథ్యంలో మేం ఆరోపణ చేస్తే వాళ్లు సంజాయిషీ ఇచ్చుకోవాల్సింది పోయి ఉల్టా మాపై ఆరోపణలు చేస్తున్నారు.
  • కచ్చితంగా టీడీపీ వారి ప్రమేయం ఉందని మా అనుమానం:
  • ఎన్నికలకు వెళ్తున్న సమయంలో మాపై బండ వేసి లబ్ధిపొందాలని చూస్తున్నారు. మేం దానికి సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తోంది.
  • ఒక్క ఈ విషయమే కాదు..ప్రతి ఒక్క దాంట్లో ఇలానే అర్ధం లేని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
  • దీనిలో కచ్చితంగా టీడీపీకి సంబందించిన వారి ప్రమోయం ఉందని మేం బలంగా అనుమానిస్తున్నాం.
  • వాళ్ల ఉలికిపాటు చూస్తుంటే, దాన్ని తెచ్చి ప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై నింద వేయాలని చూస్తుంటే వీళ్లు తప్పించుకోడానికే నింద వేస్తున్నారని అనిపిస్తోంది.
  • కచ్చితంగా దీని వెనుక చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన వదిన పురందేశ్వరి, వారి గ్యాంగ్‌ ఉన్నాయని మేం అనుమానిస్తున్నాం.
  • విచారణలో ఈ కోణం కూడా చూడాలని మేం సీబీఐకి పిటిషన్‌ పెడుతున్నాం. ఈ దిశలో కూడా విచారణ జరగాలని కోరుతున్నాం.
  • గంజాయి, డ్రగ్స్‌ క్యాపిటల్‌ అంటూ వీళ్లు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారు.
  • గతంలో గంజాయి పండించి..టీడీపీ నాయకులే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని వందల కోట్లు సంపాదిస్తున్నారన్నారు.
  • మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి సాగును ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా చూపించాం.
  • దానిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్‌ పరివర్తన కార్యక్రమాన్ని మెచ్చుకుంది.
  • ఎస్‌ఈబీ పెట్టిన తర్వాత 12వేల ఎకరాల్లో సాగును ధ్వసం చేశారు.
  • ఇప్పుడు డ్రగ్‌ ఇంపోర్ట్‌ చేసుకున్న కంపెనీ తప్పుడు పనులు చేస్తే చర్యలు తీసుకుంది కూడా జగన్‌ గారి ప్రభుత్వమే.
  • డ్రగ్స్‌ వాడకాన్ని తగ్గించడానికి, సాగు లేకుండా చేయడానికి మేం కన్‌స్ట్రక్టివ్‌గా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
  • మేం చేపట్టిన చర్యలను మెచ్చుకోకపోగా..చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు మాపై ఆరోపణలు చేస్తున్నారు.
  • ఎన్నికల్లో చెప్పుకోడానికి ఏమీ లేదు కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
  • థర్డ్‌ గ్రేడ్‌ కంటే హీనమైన వ్యక్తి లోకేశ్‌:
  • ఈ డ్రగ్స్‌ కేసులో ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలపై కూడా ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఫిర్యాదు చేస్తున్నాం.
  • థర్డ్‌ గ్రేడ్‌ కంటే హీనమైన స్థాయిలో లోకేశ్‌ ఉన్నాడు. ఎందుకు ట్వీట్‌ చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా అతనికి అర్ధం కావడం లేదు.
  • మోకాలికి బట్టతలకు సంబంధం కట్టి ఎక్కడో బ్రెజిల్‌ దేశంతో సంబంధం కడుతున్నాడు.
  • ఎప్పుడో బ్రెజిల్‌ అధ్యక్షుడు గెలిచాడని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేస్తే దాన్ని పట్టుకొచ్చి ఈ కేసుకు అంటగడుతున్నారు.
  • ఈ డ్రగ్స్‌ కేసులో ఎవరెవరూ ఉండే అవకాశం ఉంది అని చూస్తే సహజంగానే దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులే కనిపిస్తున్నారు.
  • వీళ్లతో కలిసి ఎప్పుడూ తిరిగే వ్యక్తులు, ఆ కంపెనీ వారితో ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
  • ఇది సహజంగానే వారిపైనే పడుతుంది. అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబుకు ఉంది కాబట్టి వారిపైనే అనుమానం.
  • అందుకే ఉల్టా మాపైనే ఆరోపణలు చేస్తున్నారు.
  • ఈ జన్మలో చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రజలు అవకాశం ఇవ్వరని తెలిసి, ఆ ప్రస్టేషన్‌లో ఇలాంటి తప్పుడు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు.
  • జగన్‌ గారు ఎప్పుడూ ఇలాంటి వాస్తవ విరుద్ధ కామెంట్స్‌ చేయలేదు:
  • మేము పాజిటివ్‌ ఎజెండాతో వెళ్తున్నారు. జగన్‌ గారు ఇలాంటి వాస్తవ విరుద్ధ మాటలు మాట్లాడటం ఏనాడైనా చూశారా?
  • ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, ఇంతకు ముందు ప్రతిపక్ష నాయకుడిగానైనా ఇలాంటి ఆధారాలు లేని కామెంట్స్‌ చేశారా?
  • ఆయనైనా, సాక్షి పత్రికైనా ఎప్పుడూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయలేదు.
  • కానీ తండ్రీ కొడుకులు ముందుండి అబద్ధాలను వండి సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేస్తారు.
  • ఇలాంటివి వేల కొద్దీ కనిపిస్తాయి. అవే అబద్ధాలను ఆ పత్రికలు వార్తలుగా వండి వారుస్తున్నాయి.
  • అదే కోణంలో గంజాయి, ఇసుక లాంటి ఆరోపణలన్నీ చేస్తున్నారు.
  • వాళ్లకు చెప్పుకోడానికి ఏమీ లేదు. మేం చెప్పుకోడానికి చాలా ఉన్నాయి.
  • సిద్ధం సభలు చూసినా, ఇంకే సభలు చూసినా మేం చేసినవి చెప్పుకుంటున్నాం.
  • రాజకీయ పార్టీగా మేం చేసిన పనులు చెప్పాలి. కానీ థర్డ్‌ గ్రేడ్‌గా వ్యక్తిత్వ హననం చేసే అవాస్తవాలను ప్రచారం చేయడం రాజకీయం కాదు.
  • అది రాజకీయం కాదని ప్రజలు 2019లో వారిని రిజెక్ట్‌ చేశారు.
  • ఇచ్చిన హామీలను కూడా రెండో సారి చెప్పుకోవడం లేదు. అలా చెప్తే గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని జనం అడుగుతారని భయం.
  • ఈ మధ్య పొద్దున లేవగానే ఎన్నికల కమిషన్‌ వద్దకు వెళ్లి లేని పోని ఫిర్యాదులు చేయడం రివాజుగా మారింది.
  • ఆ అబద్ధపు ఫిర్యాదులను ఆ పత్రికలు బ్యానర్‌ స్టోరీలు రాస్తూ ప్రచారం చేస్తున్నారు.
  • ఆ కూటమి సింగిల్‌ డిజిట్‌కు పరిమితం కాబోతోంది:
  • ఈ ఎన్నికలో చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌లు సింగిల్‌ డిజిట్‌కి పరిమితం కాబోతున్నారు.
  • ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ఓటమి తర్వాత ఇలాంటి అబద్ధపు ఆరోపణలు చూపి మేం ఓడిపోయాం అని చెప్పుకోడానికి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారు.
  • డ్రగ్స్‌ కేసుకు సబంధించి ప్రెస్‌కౌన్సిల్, సీబీఐతో పాటు అన్ని సంస్థలకూ మా పిటిషన్లు వెళ్తాయి.
  • ముందు ఇది తేలాలి. దీని వెనుక బలమైన ఆధారాలతో చంద్రబాబు, ఆయన వదిన కుటుంబం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ చేయాలి.
  • ఎన్నికల కమిషన్‌ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరతాం.
  • ఇదే సమయంలో మా పాజిటివ్‌ ఎజెండాతో మేం ముందుకు వెళ్తాం. వాళ్లలా అడ్డదారుల్లో బయట పడాలని ప్రయత్నం చేయడం మాకు ఏనాడూ అలవాటు లేదు.  
  • ప్రజలను కన్ఫ్యూజ్‌ చేసి పబ్బం గడుపుకోవాలని చూసే వారి ఆటలు సాగనివ్వం.
  • ఒక సెంట్రల్‌ ఎజెన్సీ వచ్చిన తర్వాత లోకల్‌ పోలీసులకు ఇన్‌ఫాం చేస్తారు.
  • దానికి సంబంధించి ఈ రోజు విశాఖ సీపీ కూడా వివరణ ఇచ్చారు.
  • ఈనాడు రాతలకు తలాతోక ఉందా?:
  • ఈ రోజు ఈనాడు పత్రికలో రాసిన రాతలకు తలా తోక ఉందా?
  • రామోజీరావు ప్రజల సొమ్ముతో మార్గదర్శితో అవినీతి రాజ్యం నడిపి దందా చేస్తున్నాడు.
  • అలాంటి వ్యక్తి గంగవెర్రులెత్తిపోయి ఏ రాస్తున్నారో తెలియకుండా రాస్తున్నాడు.
  • చంద్రబాబు స్కిల్‌ స్కాం కూడా జగన్‌ గారే చేశారనే అంటాడేమో?
  • వైజాగ్‌లో వైఎస్సార్సీపీ నేత అడ్డుకోవాలని చూశారు అంటాడు. ఎవరో పేరు రాయవచ్చుగా. ఆధారాలు చూపించవచ్చుగా?
  • ఆధారాలు లేకుండా ఎలా నోటికొచ్చినట్లు రాస్తాడు?
  • పోలీసులు అడ్డుపడ్డారని రాశాడు. అది ఎక్కడో రాయవచ్చుగా?
  • ఒక పత్రికగా వార్త రాసేటప్పుడు ఇలాంటి రాతలు రాయడం విడ్డూరం.
  • సాక్షాత్తు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అలాంటి కామెంట్స్‌ చేస్తారా?
  • వ్యవస్థలపైనే గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు. తాను ప్రతిపక్షంలో ఉంటే లోకమంతా చండాలంగా ఉందంటాడు.
  • తను రూలింగ్‌లో ఉంటే అంతా బాగుంది అంటాడు.
  • ఇతని మాదిరిగా పంచాయితీలు చేసే లక్షణం జగన్‌ గారికి లేదు.
  • వీధి స్థాయి మనస్థత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు. అదే అందరికీ ఉందన్నట్లు చూపాలని చూస్తాడు.
  • జగన్‌ గారు అలాంటి వ్యక్తి కాదు. ప్రభుత్వంలో ఉన్నా వ్యవస్థలు వాటి అవి చేసుకుని పోవాలని కోరుకుంటారు.
  • ఒక వేళ ఎవరన్నా ఇలా చేశారని అంటున్నప్పుడు ఆధారాలు చూపాలి.
  • నోరుంది కదా, పేపర్‌ ఉంది కదా..జనంలోకి అబద్ధాలు పంపితే నమ్మే కాలం కాదిది.
  • మీరు ఏది రాస్తే అది జనం నమ్ముతారనుకుంటే పొరపాటే.
  • ఆ ఇంగితం రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబులకు ఉండాలని కోరుకుంటున్నా

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement