
యశవంతపుర: మత్తు పదార్థాలను సేవించిన కేసులో నటి సంజనా గల్రానితో పాటు వ్యాపారవేత్తలు శివప్రకాశ్, ఆదిత్య మోహన్ అగర్వాల్‌పై దాఖలైన కేసును హైకోర్టు కొట్టేసింది. దీంతో నటికి పెద్ద ఊరట కలిగింది. తమపై దాఖలైన డ్రగ్స్ కేసును రద్దు చేయాలని కోరుతూ వీరు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు.
న్యాయమూర్తి హేమంత్ చందన గౌడర్ ధర్మాసనం కేసును విచారించింది. సంజనపై బెంగళూరు పోలీసులు 2020 ఏప్రిల్, సెప్టెంబర్‌లో కేసులు నమోదు చేశారు. 2015, 2018, 2019లోను వీరు డ్రగ్స్ సేవించారంటూ అక్రమంగా కేసులు నమోదు చేశారని వారి తరఫున వకీలు వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి వారిపై కేసులను రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment