ఏ1గా నైజీరియన్ మహిళ
ఏ6గా అమన్‌ప్రీత్‌సింగ్
మణికొండ: నైజీరియా నుంచి గోవా, ముంబై, ఢిల్లీల మీదుగా డ్రగ్స్ తరలించి హైదరాబాద్‌లో విక్రయిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న 18 మంది సభ్యుల ముఠాను నార్సింగి, రాజేంద్రనగర్ డివిజన్ ఎస్‌ఓటీ, మాదకద్రవ్యాల నిరోధక శాఖల పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. సోమవారం వారిని నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్‌షాకోట్, విశాల్‌నగర్ కాలనీలోని జెనాబ్ ఫోర్ట్ వ్యూ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నెంబర్ 202లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితుల నుంచి రూ.2 కోట్ల విలువ చేసే 199.10 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా, మంగళవారం గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన 13 మందిలో ఆరుగురికి పాజిటివ్ అని వచి్చంది. అనంతరం నిందితులను రాజేంద్రనగర్‌లోని కోర్టులో హాజరుపరిచారు.
డ్రగ్స్ సరఫరా దారులు వీరే...
డ్రగ్స్ కేసులో ఏ1గా అనౌహ బ్లెస్సింగ్ అనే మహిళ, ఏ2గా నిజాం కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతున్న అజీజ్ నోహీమ్ అడేషోలా, ఏ3గా బెంగుళూరుకు చెందిన అల్లం సత్యవెంకట గౌతమ్, ఏ4గా బోరబండకు చెందిన సానబోయిన వరుణ్‌కుమార్, ఏ5గా ఈవెంట్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్ ఉన్నారని, వీరంతా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కాగా, సినీహీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్‌సింగ్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన కిషన్ రాఠీ, బంజారాహిల్స్‌కు చెందిన అని, గచి్చబౌలికి చెందిన యశ్వంత్ గాడె, జూబ్లీహిల్స్‌కు చెందిన ఆలుగడ్డల రోహిత్, గండిపేటకు చెందిన శ్రీచరణ్, బంజారాహిల్స్‌కు చెందిన ప్రసాద్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన హృతిక్‌కుమార్, పంజగుట్టకు చెందిన నిఖిల్ ధావన్, గచి్చ»ౌలికి చెందిన మధురాజు, రఘు, కనుమూరి కృష్ణంరాజు, వెంకట సత్యనారాయణ డ్రగ్స్ వినియోగిస్తున్నవారిలో ఉన్నారని తెలిపారు. వీరి పేర్లను ఏ6 నుంచి ఏ18 వరకు కేసులో పొందుపరిచారు. వీరి నుంచి 10 సెల్ ఫోన్‌లు, రెండు ద్విచక్రవాహనాలు, ఓ పాస్‌పోర్టును సీజ్ చేసినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment