నటుడి భార్య, తనయుడు కిడ్నాప్‌.. రెండు నెలలుగా చిత్రహింసలు! | Supporting Actor Wife, Son were Kidnapped and Locked in a Separate Room for 2 Months | Sakshi
Sakshi News home page

అమానుషం.. నటుడి భార్య కిడ్నాప్‌.. రెండు నెలలుగా గదిలో బంధించి!

Published Thu, Feb 15 2024 6:42 PM | Last Updated on Thu, Feb 15 2024 8:55 PM

Supporting Actor Wife, Son were Kidnapped and Locked in a Separate Room for 2 Months - Sakshi

ఈ రోజుల్లో మనుషుల కన్నా పైసాకే ఎక్కువ విలువిస్తున్నారు. డబ్బు కోసం మనుషులను చిత్రహింసలు పెడుతున్నారు. అవసరమైతే చంపడానికి కూడా వెనుకాడట్లేదు. ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వలేదని ఓ నటుడి కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టిందో మహిళ. ఈ అమానుష ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అవసరానికి ఆరు లక్షల అప్పు
క్యారెక్టర్‌ ఆర్టిస్టు మథియలగన్‌(55) అరియమంగళం ఊరిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఉమారాణి అనే మహిళ వద్ద ఆరు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇచ్చిన గడువు పూర్తైనా ఆ అప్పు తీర్చలేకపోయాడు. తన డబ్బు తిరిగిచ్చేయమని ఆమె ఒత్తిడి తెస్తుండగా తనకు మరింత గడువు కావాలని కోరుకున్నాడు.

గదిలో పెట్టి తాళం
ఇలాగైతే పని జరగదనుకుందో ఏమోకానీ రెండు నెలల క్రితం నటుడి భార్య మాలతి, తనయుడు నటరాజన్‌ను కిడ్నాప్‌ చేసింది ఉమారాణి. మాలతిని తన ఇంట్లోనే బంధించి చిత్రహింసలు పెట్టింది. విచక్షణారహితంగా కొడుతూ ఇంటి పనంతా చేయించుకుంది. పనైపోగానే ఓ గదిలో పెట్టి తాళం వేసేది. ఆమె కొడుకును మరోచోట బంధించింది. మరోవైపు నటుడు తన భార్యాకొడుకు కోసం వెతకని చోటంటూ లేదు. ఈ క్రమంలో ఉమారాణే తనవాళ్లను కిడ్నాప్‌ చేసిందన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్నాడు.

రెండు నెలల తర్వాత విముక్తి
తన తమ్ముడి సాయంతో లాయర్లను తీసుకుని నేరుగా ఉమారాణి ఇంటికి వెళ్లాడు. కానీ ఆమె వారిని లోనికి రానివ్వలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా వారు ఇంట్లోకి ప్రవేశించి గదిలో బంధించిన మాలతికి విముక్తి కల్పించారు. ఇన్నాళ్లు నరకం అనుభవించిన ఆమె పోలీసులపై కాళ్లపై పడి తన కొడుకును కాపాడమని కన్నీటితో వేడుకుంది. ఇంతలోనే ఉమారాణి అక్కడి నుంచి జారుకోవడంతో పోలీసులు ఆమెను వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నటరాజ్‌ ఆచూకీని కనుగొనేందుకు యత్నిస్తున్నారు.

చదవండి: Anchor Suma Kanakala: 25వ పెళ్లి రోజు.. వారితో కలిసి సెలబ్రేషన్స్‌.. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గొడవలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement