supporting actor
-
సహాయ నటిపై లైంగికదాడి
అన్నానగర్ (చెన్నై): చెన్నైలోని వలసరవాక్కంలో ఇంట్లోకి చొరబడి ఓ సహాయ నటిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ నటుడి కారు డ్రైవర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల యువతి టీవీ సీరియల్స్‌లో సహాయ నటిగా నటిస్తోంది. భర్తతో మనస్పర్థలు రావడంతో ఆమె చెన్నై వలసరవాక్కంలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె బంధువు పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు.దీంతో సహాయనటి మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంది. గురువారం రాత్రి తన ఇంట్లోకి ఆరుగురు వ్యక్తులు ప్రవేశించారు. వీరిలో మురుగేశన్ అనే వ్యక్తి ఇద్దరిని ఇంటి బయట కాపలా పెట్టి ఇంట్లోకి చొరబడి సహాయ నటిపై లైంగిక దాడికి పాల్పడి, పరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై సహాయ నటి వలసరవాక్కం పోలీస్‌స్టేష¯న్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి మురుగేషన్, కల్యాణకుమార్, అరుణ్‌పాండి, మారియప్ప, పెరియనంబిరాజ్, ముప్పిడాదిని అరెస్టు చేసి విచారణ జరపుతున్నారు. అరెస్టయిన మురుగేశన్ ఓ సినీ నటుడి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హీరోల్.. ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా
హస్య నటులు, ప్రతినాయకులు, సహాయ నటులుగా కనిపించి, ఆకట్టుకునే నటులు ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా కనిపిస్తే ఆ సినిమాకి కావాల్సినంత క్రేజ్ ఏర్పడుతుంది. ఆ నటులకు కూడా రొటీన్ క్యారెక్టర్స్ నుంచి కాస్త మార్పు దక్కుతుంది. ఎక్కువగా కమెడియన్లు, విలన్లు, క్యారెక్టర్లు ఆర్టిస్టులుగా చేసే ఆ నటులు ఇప్పుడు హీ‘రోల్’లో కనిపించనున్నారు. ఆ ‘హీరో’ల్ చేస్తున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నేపాలీ భాషలో... తెలుగు పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. దాదాపు నలభై ఏళ్లుగా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన అడపాదడపా హీరోగానూ చేశారు. ‘బాబాయ్ హోటల్’ (1992), ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ (1992) వంటి చిత్రాల్లో సోలో హీరోగా చేసిన బ్రహ్మానందం ‘సూపర్ హీరోస్’ (1997), ‘హ్యాండ్సప్’ (2020) వంటి మరికొన్ని చిత్రాల్లో ఓ హీరోగా నటించారు. తాజాగా ‘హ్రశ్వ దీర్ఘ’ చిత్రంలో ఆయన ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. చంద్ర పంత్ దర్శకత్వంలో తెలుగు, నేపాలీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బ్రహ్మానందం నటిస్తున్న ఈ తొలి నేపాలీ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఆరు పదులలో ప్రేమ ఆరు పదుల వయసులో ప్రేమలో పడ్డారు రాజేంద్రప్రసాద్, జయప్రద. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘లవ్ః65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆ మధ్య విడుదలైంది. ‘ఈ ప్రపంచాన్నే బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం రిలీజ్ రానుంది. వినోదాల సుబ్రమణ్యం కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా రావు రమేశ్ ఏ రేంజ్లో విజృంభిస్తారో వెండితెరపై చూస్తుంటాం. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రంలో తొలిసారి ఆయన హీరోగా కనిపించనున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేశ్ సరసన ఇంద్రజ నటించారు. పూర్తి స్థాయి వినోదంతో, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. మధ్యవయస్కుడి కథ తెలుగులో దాదాపు 36 ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు రాజా రవీంద్ర. పలు చిత్రాల్లో లీడ్ రోల్స్‌లోనూ నటించిన ఆయన తాజాగా ‘సారంగదరియా’ సినిమాలో లీడ్ రోల్ చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి పరువుగా బతికితే చాలనుకుంటాడు. అయితే అతనికి తన కొడుకులు, కూతురు వల్ల సమాజం నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు అతను ఏం చేశాడు? అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందింది. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తండ్రి విలువ తెలిపేలా... తెలుగులో శివాజీ రాజాది మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఇటీవల సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన శివాజీ రాజా ‘నాన్నా మళ్లీ రావా..!’లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రభావతి నటిస్తున్నారు. నిర్దేష్ దర్శకుడు. మనసుని హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాల నేపథ్యంలో తండ్రి విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతోంది. మ్యూజిక్ షాప్‌లో... ‘ప్రస్థానం’ (2010) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు అజయ్ ఘోష్. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించి, మెప్పించారాయన. తాజాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో హీరోగా చేశారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మన జీవితాల్లో మనం ఏం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చూపించేలా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
నటుడి భార్య, తనయుడు కిడ్నాప్.. రెండు నెలలుగా చిత్రహింసలు!
ఈ రోజుల్లో మనుషుల కన్నా పైసాకే ఎక్కువ విలువిస్తున్నారు. డబ్బు కోసం మనుషులను చిత్రహింసలు పెడుతున్నారు. అవసరమైతే చంపడానికి కూడా వెనుకాడట్లేదు. ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వలేదని ఓ నటుడి కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టిందో మహిళ. ఈ అమానుష ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అవసరానికి ఆరు లక్షల అప్పు క్యారెక్టర్ ఆర్టిస్టు మథియలగన్(55) అరియమంగళం ఊరిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఉమారాణి అనే మహిళ వద్ద ఆరు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇచ్చిన గడువు పూర్తైనా ఆ అప్పు తీర్చలేకపోయాడు. తన డబ్బు తిరిగిచ్చేయమని ఆమె ఒత్తిడి తెస్తుండగా తనకు మరింత గడువు కావాలని కోరుకున్నాడు. గదిలో పెట్టి తాళం ఇలాగైతే పని జరగదనుకుందో ఏమోకానీ రెండు నెలల క్రితం నటుడి భార్య మాలతి, తనయుడు నటరాజన్‌ను కిడ్నాప్ చేసింది ఉమారాణి. మాలతిని తన ఇంట్లోనే బంధించి చిత్రహింసలు పెట్టింది. విచక్షణారహితంగా కొడుతూ ఇంటి పనంతా చేయించుకుంది. పనైపోగానే ఓ గదిలో పెట్టి తాళం వేసేది. ఆమె కొడుకును మరోచోట బంధించింది. మరోవైపు నటుడు తన భార్యాకొడుకు కోసం వెతకని చోటంటూ లేదు. ఈ క్రమంలో ఉమారాణే తనవాళ్లను కిడ్నాప్ చేసిందన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్నాడు. రెండు నెలల తర్వాత విముక్తి తన తమ్ముడి సాయంతో లాయర్లను తీసుకుని నేరుగా ఉమారాణి ఇంటికి వెళ్లాడు. కానీ ఆమె వారిని లోనికి రానివ్వలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా వారు ఇంట్లోకి ప్రవేశించి గదిలో బంధించిన మాలతికి విముక్తి కల్పించారు. ఇన్నాళ్లు నరకం అనుభవించిన ఆమె పోలీసులపై కాళ్లపై పడి తన కొడుకును కాపాడమని కన్నీటితో వేడుకుంది. ఇంతలోనే ఉమారాణి అక్కడి నుంచి జారుకోవడంతో పోలీసులు ఆమెను వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నటరాజ్ ఆచూకీని కనుగొనేందుకు యత్నిస్తున్నారు. చదవండి: Anchor Suma Kanakala: 25వ పెళ్లి రోజు.. వారితో కలిసి సెలబ్రేషన్స్.. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గొడవలు.. -
నిర్మాత అని చెప్పి పెళ్లి చేసుకుని వ్యభిచారం చేయమంటున్నాడు: సహాయనటి
తమిళసినిమా: సినీ నిర్మాత అని చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకుని ఆపై వ్యభిచారం చేయాలంటూ బలవంతం చేస్తున్నాడని సహాయ నటి పరమేశ్వరి అలియాస్ భైరవి శుక్రవారం చెన్నైలో డీజీపీకి ఫిర్యాదు చేసింది. భర్త లేని తాను ఇద్దరు పిల్లలతో చెన్నైలో ఉంటూ టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నానని.. వేలూరుకు చెందిన రాజా దేసింగ్ అలియాస్ సుబ్రమణి నిర్మాతగా పరిచయం చేసుకుని, తనను కూడా నిర్మాతను చేస్తానని మాయమాటలు చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ఆ తరువాత తనను వ్యభిచార వృత్తిలోకి దింపడానికి ఒత్తిడి చేయడంతో పాటు తన ప్లిలలను కూడా ఆ వృత్తిని చేయాలని బలవంతం చేస్తున్నాడని పేర్కొంది. దీంతో తాను అతని నుంచి విడిపోయి పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పింది. అయినా రాజాదేసింగ్ తాను చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. పలువురు అమ్మాయిలను మోసం చేశాడని, బాలికపై అత్యాచారానికి పాల్పడి పోక్సో చట్టం కింద అరెస్టు కూడా అయ్యాడని తెలిపింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. చదవండి: (వదినతో వివాహేతర సంబంధం.. అన్నకు తెలిసి..) -
టాలీవుడ్‌కి పరిచయం అవుతున్న పరభాషా హీరోలు
టాలీవుడ్‌ది పెద్ద మనస్సు... ఎంతమంది వచ్చినా ఎస్సు అంటుంది. మామూలుగా పరభాషా నాయికలు, విలన్లు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు పరభాషా హీరోలు ఇక్కడ హీరోలుగా పరిచయం కానున్నారు. అంతేనా... పరభాషలో హీరోలుగా దూసుకెళుతున్నవాళ్లు ఇక్కడ సహాయనటులుగా, విలన్లుగా పరిచయం కానున్నారు. ‘రారండోయ్ పరిచయం చేస్తాం’ అంటూ అందరికీ అవకాశం ఇస్తోంది టాలీవుడ్. ఈ పరిచయాలు పెరగడానికి ఓ కారణం పాన్ ఇండియన్ సినిమాలు. ఏది ఏమైనా ఇతర భాషల్లో లేనంతగా తెలుగులో పరభాషలవారికి అవకాశాలు దక్కుతున్నాయి. ఆ స్టార్స్ గురించి తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరో విజయ్ చేసిన ‘మాస్టర్’, ‘బిగిల్’, ‘సర్కారు’, ‘మెర్సెల్’ వంటి చిత్రాలు తెలుగులో అనువాదమై, మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. మరో తమిళ స్టార్ ధనుష్ అయితే ఒకేసారి రెండు తెలుగు సినిమాలు కమిట్ కావడం విశేషం. శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి దర్శకత్వాల్లో ఆయన సినిమాలు చేయనున్నారు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న ‘సర్’ (తమిళంలో ‘వాతి’) సినిమా షూటింగ్ ఈ నెల 5న ప్రారంభం కానుంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్ మార్చిలో ఆరంభమవుతుందట. ఇక తమిళంలో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుని, హీరోగా మారిన శివకార్తికేయన్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రానికి ఇటీవలే సైన్ చేశారు. ‘జాతిరత్నాలు’ వంటి మంచి హిట్ ఇచ్చిన కేవీ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు. అలాగే సంగీతదర్శకుడిగా, ఎడిటర్‌గా నిరూపించుకుని, హీరోగా చేస్తున్న విజయ్ ఆంటోని ఇప్పటివరకూ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు తెరపై కనిపించారు. ఇప్పుడు తెలుగులో స్ట్రయిట్ సినిమా ఒప్పుకున్నారు. అయితే సోలో హీరోగా కాదు.. మరో హీరోతో కలిసి ‘జ్వాల’లో నటిస్తున్నారు. ఆ మరో నటుడు ఎవరంటే.. ‘బ్రూస్లీ’, ‘సాహో’ చిత్రాల్లో ఓ రోల్ చేసిన అరుణ్ విజయ్ అన్నమాట. ఈ ఇద్దరూ హీరోలుగా ‘జ్వాల’ (తమిళంలో ‘అగ్ని సిరగుగళ్’ టైటిల్) చేస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ దర్శకుడు. అటు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌కి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే. కీర్తీ సురేష్ చేసిన ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో ఆకట్టుకున్నారు దుల్కర్. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దుల్కర్‌కు హీరోగా తెలుగులో తొలి చిత్రం. ఇక టాలీవుడ్‌కు హాయ్ చెబుతున్నారు మరో మలయాళ నటుడు దేవ్ మోహన్. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్లో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’లో దేవ్ మోహన్ మెయిన్ లీడ్‌గా చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు తెలుగుకి పరిచయం కావడానికి రెడీ అవుతున్నారు. అక్కడ హీరోలు... ఇక్కడ క్యారెక్టర్లు! మాతృభాషలో హీరోలుగా చేస్తూ హీరోలుగానే తెలుగులో పరిచయమవుతున్న వారు కొందరైతే... పరభాష హీరోలు కొందరు ఇక్కడ కీలక పాత్రలు చేస్తుండడం విశేషం. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న చిత్రంలో నవాజుద్దిన్ సిద్ధిఖీ ఓ పాత్ర చేయనున్నారనే ప్రచారం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ప్రభాస్ హీరోగా చేసిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా, రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రధానంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. సో.. ‘ఆదిపురుష్’ సినిమాయే సైఫ్‌కి తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రంలోని లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఓ రోల్ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించారు. ఇక జూనియర్ ఆర్టిస్టు నుంచి మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు దునియా విజయ్ టాలీవుడ్‌కు వస్తున్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో దునియా విజయ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. మరో కన్నడ యాక్టర్ ధనుంజయ ‘పుష్ప’ చిత్రంతో, వశిష్ట సింహా ‘నయీం డైరీస్’తో వచ్చారు. మరోవైపు ఇటీవల విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో విలన్‌గా చేసి, తెలుగు ప్రేక్షకులకు స్ట్రయిట్‌గా హాయ్ చెప్పారు మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్. వీరితోపాటు మరికొందరు పరభాషా నటులు స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగు సినిమాల్లో కనిపించిన అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, వరుణ్ తేజ్ ‘గని’లో సునీల్ శెట్టి, రవితేజ ‘ఖిలాడి’లో ఉన్ని ముకుందన్ తదితరులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నారు. -
ఆస్కార్స్‌కు ప్రియాంక?
ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయిలో పాపులర్ చేస్తున్న నటీనటుల్లో ప్రియాంకా చోప్రా ఒకరు. గతంలో ఓసారి ఆస్కార్ అవార్డులకు అతిథిగా వెళ్లారామె. తాజాగా ఆస్కార్‌ను ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నారని సమాచారం. ప్రియాంకా చోప్రా నటిస్తున్న తాజా చిత్రం ‘ది వైట్ టైగర్’. ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ఈ సినిమా చేస్తున్నారామె. వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్ వేడుకలో ఈ చిత్రం తరఫున ఉత్తమ సహాయ నటి విభాగంలో ప్రియాంక చోటు దక్కించుకునే అవకాశం ఉందని టాక్. ఈ లిస్ట్‌లో ఆల్రెడీ హాలీవుడ్ స్టార్స్ మెరిల్ స్ట్రీప్స్, క్రిస్టిన్ స్కాట్ థామస్, ఒలీవియా కోల్మన్ ఉండొచ్చని తెలిసింది. మరి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను ప్రియాంక గెలుచుకుంటారా? వేచి చూడాలి. ఇండో–ఆస్ట్రేలియన్ రచయిత అరవింద్ అడిగి రచించిన ‘ది వైట్ టైగర్స్’ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందిస్తున్నారు. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం విడుదలవుతుంది. -
రెండో భర్తపై నటి ఫిర్యాదు
చెన్నై,పెరంబూరు: సినీ నటి తన రెండో భర్త లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. చెన్నై, తూర్పు ముగప్పేర్‌కు చెందిన ఆమె (39) తన భర్తకు విడాకులిచ్చి విడిగా జీవిస్తోంది. ఆమెకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కాగా షెనాయ్ నగర్లో ఆ నటి సొంతంగా యోగా శిక్షణశాలను నిర్వహిస్తోంది. సినీ, టీవీ సీరియళ్లలోనూ చిన్నచిన్న పాత్రల్లో నటిస్తోంది. నటుడు శివకార్తికేయన్ హీరోగా నటించిన మాన్ కరాటే చిత్రంలో ఆమె నటించింది. అలా సాంకేతిక నిపుణుడు శరవణన్ సుబ్రమణి(42)తో పరిచయం కలిగింది. దీంతో అతనితో రెండో పెళ్లికి దారి తీసింది. కాగా సహాయ నటి బుధవారం స్థానిక తిరుమంగళం మహిళా పోలీస్‌స్టేషన్‌లో శరవణన్ సుబ్రమణిపై ఫిర్యాదు చేసింది. రెండో భర్త శరవణన్ సుబ్రమణి తన నగలను, నగదును దోచుకున్నాడని పేర్కొంది. అంతే కాకుండా లైంగిక వేధిపులకు గురి చేస్తున్నాడని తెలిపింది. అతని స్నేహితులను ఇంటికి తీసుకొచ్చి వారి ముందు డాన్స్ చేయమని ఒత్తిడి చేస్తున్నాడని చెప్పింది. తన పిల్లలను చితక బాదుతున్నట్లు తెలిపింది. శరవణన్ సుబ్రమణికి ఇంతకు ముందే ఆర్తి అనే మహిళతో పెళ్లి అయ్యిందని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు, ఆమెకు ఒక బిడ్డ ఉన్నట్టు తెలిసిందని చెప్పింది. కాగా సుబ్రమణి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి తనను మరో పెళ్లి చేసుకుని మోసం చేశాడని చెప్పింది. అంతే కాకుండా ఇప్పుడు తన మొదటి భార్యతో కలిసి కిరాయి మనుషులతో హతమార్చుతానంటూ బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. భర్త, అతడి మొదటి భార్యతో పాటు దిండిగల్ శరవణన్, కిరాయి మనుషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరింది. కేసును సీఐ విజయలక్ష్మి విచారణ జరుపుతున్నారు. -
‘అప్పుడు చాలా బాధనిపించింది’
సిని పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలా స్టార్ అవుతారో చెప్పలేం. ఒక్క సినిమా రాత్రికి రాత్రే ఆకాశానికి ఎక్కించవచ్చు.. లేదంటే పాతాళానికి పడేయవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సక్సెస్ లేకపోతే కష్టం. స్టార్ కుటుంబాల నుంచి వచ్చిన వారికి కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పవంటున్నారు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. చాలా కాలం తర్వాత ‘మన్మర్జియా’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అభిషేక్. అయితే ఈ చిత్రంలో ఆయన సహాయ నటుడిగా కనిపించారు. ఒకప్పుడు హీరోగా నటించి.. ఇప్పుడు సహాయ నటుడిగా చేయడం తనను చాలా బాధించింది అంటున్నారు అభిషేక్. తాజాగా అభిషేక్ ‘కాఫీ విత్ కరణ్’ షోకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరణ్ ‘ఇన్నాళ్లు హీరోగా నటించి.. ఇప్పుడు సినిమాలో మరో కథానాయకుడి వెనక ఉండటం ఎలా అనిపించింది?’ అని ప్రశ్నించారు. అందుకు అభిషేక్ సమాధనమిస్తూ.. ‘నిజంగా అది గుండెల్ని పిండేసే విషయం. ఇన్నాళ్లు హీరోగా చేసి.. ఇప్పుడు సహాయ నటుడి పాత్రను పోషించడం కష్టం, బాధాకరం. ఇండస్ట్రీ అనేది చాలా దారుణమైన ప్రదేశం. ఇక్కడ ఏ వ్యక్తి కూడా ఇది నా సొంత.. ఇది పొందడానికి పూర్తిగా నాకే అర్హత ఉంది అని అనుకోడానికి లేద’ని తెలిపారు. అంతేకాక ‘రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మారుతుంటాయి. విజయాలు ఉంటే సెంటర్(కథానాయకుడిగా)లోనే ఉంటావు. లేదంటే పక్కకు జరిపేస్తారు. ఇన్నాళ్లు సెంటర్లో ఉన్న నన్ను పక్కకు జరపడం చాలా బాధించింది. కానీ బాధలో నుంచే స్ఫూర్తి కల్గుతుందని గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ సెంటర్లోకి రావడానికి కృషి చేయాలి’ అని తెలిపారు. -
సహాయ నటి ఇంట్లో భారీ చోరీ
పెరంబూరు(తమిళనాడు): స్థానిక కొత్తవాల్ చావడిలో నివశిస్తున్న సహాయ నటి ఇంట్లో30 సవర్ల బంగారు నగలు, 20 కిలోల వెండి వస్తువులు, రూ. 2 లక్షల విలువైన నెక్లెస్ చోరీకి గురైయ్యాయి. ఈ వ్యవహారంలో సహాయ నటి ఇంటి పనిమనుషులను పోలీసులు విచారిస్తున్నారు. వివరాల్లోకెళ్లితే చెన్నై, కొత్తవాల్ చావడి, నాట్టు పిళ్లైయార్ వీధిలో సుమన్ (51) అనే మహిళ నివశిస్తోంది. ఈమె భర్త గత ఏడాది మరణించాడు, వీరికి నిఖిల్(24) అనే కొడుకు, భావన(22) అనే కూతురు ఉన్నారు. వీరిలో భావన సినిమాల్లో సహాయనటిగా నటిస్తోంది. నిఖిల్ పెరియనాయగన్ వీధిలో జౌళి దుకాణం నడుపుతున్నాడు. గత నెల 20న బంధువుల పెళ్లి కోసం సుమన్ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి రెండు రోజుల క్రితమే చెన్నైకి తిరిగి వచ్చారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో బట్టలు చిందరవందరగా కింద పడిఉండడం చూసి ధిగ్బ్రాంతికి గురయ్యారు. ఇంటి వెనుక భాగం కిటికీని బద్దలు కొట్టి దుండగులు చోరికి పాల్పడ్డారని గ్రహించారు. దీంతో సుమన్ కొత్తవాల్ చావడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సహాయ నటి భావన ఇంటి పక్కన ఉన్న జైన్ దేవాలయం, చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇంటి పనిమనుషులను విచారిస్తున్నారు. -
గంజాయి కేసులో సహాయ నటుడి అరెస్ట్
పాఠశాల, కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న సినీ సహాయ నటుడిని స్నేహితునితోపాటు పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో సెంట్రల్ క్రైం బ్రాంచి డెప్యూటీ కమిషనర్ జయకుమార్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ శివరాంకుమార్, ఎస్ఐలు మునిరాజ్, ఆంతోని, ఏళుమలై ఆధ్వర్యంలో ప్రత్యేక దళం ఏర్పాటయింది. వీరు ఐస్ హౌస్ ప్రాంతంలో తనిఖీలు జరిపి, ట్రిప్లికేన్ శివరాజపురానికి చెందిన కృష్ణమూర్తి (29)ని, స్నేహితుడు యూసఫ్ (29) అదుపులోకి తీసుకున్నారు. వీరు పాఠశాల, కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు అంగీ కరించారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి పుళల్ జైలుకు తరలించారు. విచారణలో మూర్తి వడకరి అనే చిత్రం సహా పదికి పైగా చిత్రాల్లో నటించినట్లు తెలిసింది. -
రభసలో నటిస్తున్నా..
జూనియర్ ఆర్టిస్ట్ సుందర్ తాడేపల్లిగూడెం రూరల్ : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న రభస చిత్రంలో సహాయ నటుడిగా నటిస్తున్నానని జూనియర్ ఆర్టిస్ట్ సమయమంతుల హేమసుందర్ (సుందర్) అన్నారు. తాడేపల్లిగూడెం బలుసులమ్మ జాతర సందర్భంగా ఆదివారం ఇక్కడకు వచ్చిన సుందర్ విలేకరులతో మాట్లాడారు. ? : మీ స్వగ్రామం తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం ? : ఎంతవరకు చదువుకున్నారు సుందర్ : బీఎస్సీ, బీఫార్మసీ, డిప్లొమా ఇన్ మల్టీమీడియా ? : సినీ రంగాన్ని ఎంచుకోవడంలో ఉద్దేశం నాన్న స్టేజ్ నటుడు కావడంతో చిన్నతనం నుంచి నటనపై నాకు ఆసక్తి ఉంది. స్కూళ్లలో నాటకాలు కూడా వేశాను. వృత్తిరీత్యా వ్యాపార కుటుంబమైనా నాకు మాత్రం నటుడు కావాలనే కోరిక ఉండేది. దీంతో ఈ రంగంలోకి అడుగుపెట్టాను. ? : సినిమా రంగంలో ఎప్పుడు ప్రవేశించారు 2005లో ‘దొంగ దొంగది’ ద్వారా పరిచయమయ్యాను. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాను. 2008లో ‘ఆకాశమే హద్దు’తో మరలా నటన మొదలుపెట్టా. ? : ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు చమక్ చల్లో, అది నువ్వేనువ్వే, జాదూ సినిమాల్లో నటించాను. ?: ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఏవి జూనియర్ ఎన్టీఆర్ రభస, నేను నేనుగా లేను చిత్రాల్లో నటిస్తున్నా, కల్యాణ్‌రామ్ హీరోగా నిర్మించనున్న సినిమాలో నటించనున్నా. ?: సీరియల్స్‌లో నటించారా సుందర్ : భార్యామణిలో (తేజ్), పెళ్లినాటి ప్రమాణాలలో (శ్రీమంత్), ముత్యమంత పసుపులో (మౌర్య), ముద్దుబిడ్డలో (చిన్నా), కళ్యాణయోగంలో (వివేక్) పాత్రలు పోషించాను. పెళ్లినాటి ప్రమాణాల్లో శ్రీమంత్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ? : నటుడు కావాలనుకునే యువతకు మీరిచ్చే సలహా సుందర్ : ఈ రంగంలో నిరంతరం కష్టపడాలి. ఏ పాత్ర వచ్చినా చిత్తశుద్ధితో నటించాలి. అంకితభావం చాలా అవసరం. పనిచేస్తేనే ఫలితాలు వస్తాయి. నిరుత్సాహాన్ని దరిచేరనీయవద్దు.