
ప్రతీకాత్మకచిత్రం
తమిళసినిమా: సినీ నిర్మాత అని చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకుని ఆపై వ్యభిచారం చేయాలంటూ బలవంతం చేస్తున్నాడని సహాయ నటి పరమేశ్వరి అలియాస్ భైరవి శుక్రవారం చెన్నైలో డీజీపీకి ఫిర్యాదు చేసింది. భర్త లేని తాను ఇద్దరు పిల్లలతో చెన్నైలో ఉంటూ టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నానని.. వేలూరుకు చెందిన రాజా దేసింగ్ అలియాస్ సుబ్రమణి నిర్మాతగా పరిచయం చేసుకుని, తనను కూడా నిర్మాతను చేస్తానని మాయమాటలు చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తెలిపింది.
ఆ తరువాత తనను వ్యభిచార వృత్తిలోకి దింపడానికి ఒత్తిడి చేయడంతో పాటు తన ప్లిలలను కూడా ఆ వృత్తిని చేయాలని బలవంతం చేస్తున్నాడని పేర్కొంది. దీంతో తాను అతని నుంచి విడిపోయి పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పింది. అయినా రాజాదేసింగ్ తాను చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. పలువురు అమ్మాయిలను మోసం చేశాడని, బాలికపై అత్యాచారానికి పాల్పడి పోక్సో చట్టం కింద అరెస్టు కూడా అయ్యాడని తెలిపింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment