సహాయ నటి భావన ఉంటున్న ఇల్లు
పెరంబూరు(తమిళనాడు): స్థానిక కొత్తవాల్ చావడిలో నివశిస్తున్న సహాయ నటి ఇంట్లో30 సవర్ల బంగారు నగలు, 20 కిలోల వెండి వస్తువులు, రూ. 2 లక్షల విలువైన నెక్లెస్ చోరీకి గురైయ్యాయి. ఈ వ్యవహారంలో సహాయ నటి ఇంటి పనిమనుషులను పోలీసులు విచారిస్తున్నారు. వివరాల్లోకెళ్లితే చెన్నై, కొత్తవాల్ చావడి, నాట్టు పిళ్లైయార్ వీధిలో సుమన్ (51) అనే మహిళ నివశిస్తోంది. ఈమె భర్త గత ఏడాది మరణించాడు, వీరికి నిఖిల్(24) అనే కొడుకు, భావన(22) అనే కూతురు ఉన్నారు. వీరిలో భావన సినిమాల్లో సహాయనటిగా నటిస్తోంది.
నిఖిల్ పెరియనాయగన్ వీధిలో జౌళి దుకాణం నడుపుతున్నాడు. గత నెల 20న బంధువుల పెళ్లి కోసం సుమన్ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి రెండు రోజుల క్రితమే చెన్నైకి తిరిగి వచ్చారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో బట్టలు చిందరవందరగా కింద పడిఉండడం చూసి ధిగ్బ్రాంతికి గురయ్యారు. ఇంటి వెనుక భాగం కిటికీని బద్దలు కొట్టి దుండగులు చోరికి పాల్పడ్డారని గ్రహించారు. దీంతో సుమన్ కొత్తవాల్ చావడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సహాయ నటి భావన ఇంటి పక్కన ఉన్న జైన్ దేవాలయం, చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇంటి పనిమనుషులను విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment