
అన్నానగర్ (చెన్నై): చెన్నైలోని వలసరవాక్కంలో ఇంట్లోకి చొరబడి ఓ సహాయ నటిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ నటుడి కారు డ్రైవర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల యువతి టీవీ సీరియల్స్‌లో సహాయ నటిగా నటిస్తోంది. భర్తతో మనస్పర్థలు రావడంతో ఆమె చెన్నై వలసరవాక్కంలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె బంధువు పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు.
దీంతో సహాయనటి మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంది. గురువారం రాత్రి తన ఇంట్లోకి ఆరుగురు వ్యక్తులు ప్రవేశించారు. వీరిలో మురుగేశన్ అనే వ్యక్తి ఇద్దరిని ఇంటి బయట కాపలా పెట్టి ఇంట్లోకి చొరబడి సహాయ నటిపై లైంగిక దాడికి పాల్పడి, పరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై సహాయ నటి వలసరవాక్కం పోలీస్‌స్టేష¯న్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి మురుగేషన్, కల్యాణకుమార్, అరుణ్‌పాండి, మారియప్ప, పెరియనంబిరాజ్, ముప్పిడాదిని అరెస్టు చేసి విచారణ జరపుతున్నారు. అరెస్టయిన మురుగేశన్ ఓ సినీ నటుడి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment