గంజాయి కేసులో సహాయ నటుడి అరెస్ట్ | Supporting Actor and his friend arrested for selling ganja in Tamilnadu | Sakshi
Sakshi News home page

గంజాయి కేసులో సహాయ నటుడి అరెస్ట్

Published Wed, Jul 9 2014 8:27 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

గంజాయి కేసులో సహాయ నటుడి అరెస్ట్ - Sakshi

గంజాయి కేసులో సహాయ నటుడి అరెస్ట్

పాఠశాల, కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న సినీ సహాయ నటుడిని స్నేహితునితోపాటు పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో సెంట్రల్ క్రైం బ్రాంచి డెప్యూటీ కమిషనర్ జయకుమార్ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ శివరాంకుమార్, ఎస్‌ఐలు మునిరాజ్, ఆంతోని, ఏళుమలై ఆధ్వర్యంలో ప్రత్యేక దళం ఏర్పాటయింది.
 
 వీరు ఐస్ హౌస్ ప్రాంతంలో తనిఖీలు జరిపి, ట్రిప్లికేన్ శివరాజపురానికి చెందిన కృష్ణమూర్తి (29)ని, స్నేహితుడు యూసఫ్ (29) అదుపులోకి తీసుకున్నారు. వీరు పాఠశాల, కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు అంగీ కరించారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి పుళల్ జైలుకు తరలించారు. విచారణలో మూర్తి వడకరి అనే చిత్రం  సహా పదికి పైగా చిత్రాల్లో నటించినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement