సెలబ్రిటీల ఇళ్లలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఐశ్వర్య రజనీకాంత్, శోభన, సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట చోరీ జరిగిన సంఘటనలు మరువకముందే మరో సీనియర్ హీరోయిన్ నిరోషా ఇంట దొంగతనం జరిగిన వార్త వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని తన ఇంట్లో బంగారు ఆభరణాలు కాజేశారంటూ నిరోషా.. తేనాంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నగలతో పాటు కొన్ని ఆస్తి పత్రాలు సైతం కనిపించకుండా పోయాయని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. కొన్ని నెలల క్రితం ఐశ్వర్య రజనీకాంత్ ఇంట దొంగతనం జరగ్గా ఇంటిదొంగను పోలీసులు పసిగట్టేశారు. ఇంట్లో పనిచేసే మహిళ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. తర్వాత శోభన ఇంట్లో దొంగతనం జరగ్గా.. అక్కడ కూడా తన పనిమనిషే చోరీకి పాల్పడినట్లు తేలింది. సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట నగలు కనిపించకుండా పోగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
కాగా ఘర్షణ(1988) సినిమాలో హీరోయిన్‌గా కనిపించిన నిరోషా ఈ చిత్రంతో యూత్‌కు బాగా దగ్గరైంది. ఈ చిత్రంలో ఆమె ఒక బృందావనం.. సోయగం.. అంటూ ఈత కొలనులో హొయలొలికించింది. ఇప్పటికీ ఈ పాట మార్మోగిపోతూ ఉంటుంది. సింధూరపువ్వు సినిమా సైతం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. కానీ తర్వాత పెద్దగా సినిమాలేవీ చేయని నిరోషా ఆ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె లాల్ సలాంలో రజనీకాంత్ భార్యగా నటిస్తున్నట్లు టాక్!
చదవండి: తలపొగరుతో బిగ్‌బాస్‌నే తిట్టిన శివాజీ.. ఈ క్షణమే హౌస్‌లో నుంచి వెళ్లిపోతానంటూ..
Comments
Please login to add a commentAdd a comment