Nirosha
-
మెకానిక్ రెడీ
మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. నాగ మునెయ్య (మున్నా) నిర్మించారు. ఈ సినిమాని తెలుగు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన పోస్టర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసి, సినిమా హిట్టవ్వాలన్నారు. -
సీనియర్ నటి నిరోషా ఇంట చోరీ.. విలువైన నగలు సహా..
సెలబ్రిటీల ఇళ్లలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఐశ్వర్య రజనీకాంత్, శోభన, సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట చోరీ జరిగిన సంఘటనలు మరువకముందే మరో సీనియర్ హీరోయిన్ నిరోషా ఇంట దొంగతనం జరిగిన వార్త వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని తన ఇంట్లో బంగారు ఆభరణాలు కాజేశారంటూ నిరోషా.. తేనాంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగలతో పాటు కొన్ని ఆస్తి పత్రాలు సైతం కనిపించకుండా పోయాయని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. కొన్ని నెలల క్రితం ఐశ్వర్య రజనీకాంత్ ఇంట దొంగతనం జరగ్గా ఇంటిదొంగను పోలీసులు పసిగట్టేశారు. ఇంట్లో పనిచేసే మహిళ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. తర్వాత శోభన ఇంట్లో దొంగతనం జరగ్గా.. అక్కడ కూడా తన పనిమనిషే చోరీకి పాల్పడినట్లు తేలింది. సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట నగలు కనిపించకుండా పోగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఘర్షణ(1988) సినిమాలో హీరోయిన్గా కనిపించిన నిరోషా ఈ చిత్రంతో యూత్‌కు బాగా దగ్గరైంది. ఈ చిత్రంలో ఆమె ఒక బృందావనం.. సోయగం.. అంటూ ఈత కొలనులో హొయలొలికించింది. ఇప్పటికీ ఈ పాట మార్మోగిపోతూ ఉంటుంది. సింధూరపువ్వు సినిమా సైతం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. కానీ తర్వాత పెద్దగా సినిమాలేవీ చేయని నిరోషా ఆ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె లాల్ సలాంలో రజనీకాంత్ భార్యగా నటిస్తున్నట్లు టాక్! చదవండి: తలపొగరుతో బిగ్‌బాస్‌నే తిట్టిన శివాజీ.. ఈ క్షణమే హౌస్‌లో నుంచి వెళ్లిపోతానంటూ.. -
రజనీకి జోడీ?
‘ఒక బృందావనం సోయగం..’ అంటూ ఈత కొలనులో హొయలొలికించి, కుర్రకారు మనసుల్లోకి చొచ్చుకుపోయారు నిరోషా. ‘ఘర్షణ’ (1988) చిత్రంలోని ఈ పాటతో పాటు ఈ చిత్రంలో నాయికగా నిరోషాకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ‘సింధూరపువ్వు’లోనూ ఆమె కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయని నిరోషా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆ మధ్య ఎంట్రీ ఇచ్చారు. కాగా రజనీకాంత్ కీ రోల్ చేసిన ‘లాల్ సలామ్’లో ఆయనకు జోడీగా నిరోషా కనిపిస్తారన్నది కోలీవుడ్ టాక్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో మొయుద్దీన్ భాయ్ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్. ఆయనకు చెల్లెలి పాత్రను జీవిత చేస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. భార్య పాత్రను నిరోషా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
కోలీవుడ్‌లో నటి రీఎంట్రీ, రజనీకాంత్‌కు భార్యగా..
లాల్‌సలాం చిత్రంలో రేర్ కాంబినేషన్న్స్ సెట్ చేస్తున్నారని చెప్పవచ్చు. రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న చిత్రం లాల్‌సలాం. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రజనీకాంత్ మొయ్దీన్భాయ్ అనే ముస్లిం పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నటి జీవిత చాలాకాలం తర్వాత తమిళంలోకి రీఎంట్రీ అవుతున్నారు. ఈమె ఈ చిత్రంలో రజనీకాంత్ చెల్లెలిగా నటిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్‌ది అతిథి పాత్ర కావడంతో ఆయనకు జోడీ ఉంటుందా? లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటూ వచ్చింది. దీనికి సంబంధించిన హాట్ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. 1980 ప్రాంతంలో యువ కథానాయకిగా వెలిగిన నిరోషా దివంగత ప్రఖ్యాత నటుడు ఎమ్మార్ రాధా కూతురు, నటి రాధిక సోదరి అయిన ఈమె అప్పట్లో నటుడు కమల్ హాసన్, విజయ్‌కాంత్, ప్రభు, కార్తీక్ వంటి కథానాయకుల సరసన నటించారు. అదేవిధంగా తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. అలాంటిది చాలాకాలం తర్వాత లాల్ సలాం చిత్రంలో రజనీకాంత్‌కు భార్యగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తిచేసుకుంది. కాగా త్వరలో రజనీకాంత్, నిరోషాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. చదవండి: రేంజ్ రోవర్ కారు కొన్న సూపర్ స్టార్.. ఐదున్నర కోట్లపైమాటే -
ఈ నెల 30న తారల క్రికెట్ సందడి..
చెన్నై సినిమా: కోలీవుడ్ వెండితెర, బుల్లితెర తారల క్రికెట్ పోటీలు ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నారు. సినిమాలు, టీవీ సీరియళ్లలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న నటి నిరోషాలో ఓ క్రికెట్ వీరాభిమాని కూడా ఉన్నారు. దీంతో ఆమె తొలిసారిగా స్టార్స్ క్రికెట్ పోటీలను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. మీడియా క్రికెట్ ఛాంపియన్ షిప్ పేరుతో ఈ నెల 30వ తేదీన స్థానిక పోరూరు టెన్నిస్ మైదానంలో ఈ పోటీలను ఏర్పాటు చేయనున్నారు. టోర్నీ వివరాలను సోమవారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన క్రీడాకారుల జెర్సీ, ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె వెల్లడించారు. ఈ పోటీలో ఆరు జట్లతో కూడిన 90 మంది నటులు పాల్గొననున్నారని నిరోషా తెలిపారు. గెలిచిన జట్టుకు రూ. లక్షన్నర నగదు బహుమతి, పలు కానుకలు అందిస్తామని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని, టోర్నీని నిర్వహిస్తున్న మార్క్ సంస్థ నిర్వాహకులతో కలిసి గెలిచిన జట్టుకు ట్రోఫీని ప్రదానం చేస్తారని వెల్లడించారు. -
నువ్వు మాస్‌రా...
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన చిత్రం ‘నువ్వు తోపురా’. హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో బేబి జాహ్నవి సమర్పణలో యునైటెడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఎస్.జె.కె.ప్రొడక్షన్స్ (యు.ఎస్.ఎ) వారి సహకారంతో డి.శ్రీకాంత్ నిర్మించారు. గీతా ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది. బి.హరినాథ్ మాట్లాడుతూ– ‘‘మాస్, థ్రిల్లర్ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రం గీతా ఆర్ట్స్, జి3 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా విడుదలవుతుండం ఆనందంగా ఉంది. ఇందుకు అల్లు అరవింద్‌గారికి, ‘బన్ని’ వాసుగారికి థ్యాంక్స్’’ అన్నారు శ్రీకాంత్. ‘‘అమెరికాలోని అత్యంత అందమైన ప్రదేశాలైన సాల్ట్ లేక్ సిటీ, ప్రొవో తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. మంచి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం’’ అని చిత్ర సహ నిర్మాత డా.జేమ్స్ వాట్ కొమ్ము(యు.ఎస్.ఎ) అన్నారు. నిత్యాశెట్టి, నిరోషా, రవివర్మ, శ్రీధరన్, దివ్యా రెడ్డి, ‘జెమిని’ సురేష్, దువ్వాసి మోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్: రితేష్ కుమార్, కెమెరా: ప్రశాష్ వేళాయుధన్, వెంకట్ సి.దిలీప్, సంగీతం: సురేష్ బొబ్బలి, ఆమెరికా లైన్ ప్రొడ్యూసర్: స్టెపెనీ ఒల్లర్టన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవివర్మ దంతులూరి. -
బుల్లితెర నడిగర్ సంఘానికి చతుర్ముఖ పోటీ
పెరంబూరు: ఎన్నడూ లేనంతగా చతుర్మఖ పోటీగా సాగిన తమిళనాడు బుల్లితెర నడిగర్ సంఘం ఎన్నికలు ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. ఈ సంఘానికి ఎన్నికల మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి. కాగా ప్రస్తుత నిర్వాహకం పదవీకాలం పూర్తి కావడంతో శనివారం సంఘం ఎన్నికలు జరిగాయి. పోటీలో జట్లు విరుగంబాక్కమ్‌లోని ఏకేఆర్ మహాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రస్తుత కార్యవర్గ అధ్యక్షుడు శివన్ శ్రీనివాసన్ జట్టు మళ్లీ పోటీ చేస్తుండగా, నటి నిరోషా జట్టు, రవివర్మ జట్టు, బోస్‌వెంకట్ జట్టు అంటూ నాలుగు జట్లు పోటీ పడ్డాయి. నటి నిరోషా జట్టులో భరత్ కార్యదర్శి పదవికి, ఎస్.శ్రీధర్ కోశాధికారి పదవికి, వీటీ.దినకరన్, కన్యాభారతీ ఉపాధ్యక్ష పదవికి, విజయ్, ఆనంద్, రవీంద్రన్, మోనిక ఉపకార్యదర్శి పదవులకు పోటీ చేశారు. అదే విధంగా శివన్ శ్రీనివాసన్ జట్టులో కార్యదర్శి పదవికి భరత్కల్యాణ్, ఉపాధ్యక్షపదవికి రాజశేఖర్, మనోబాలా, కోశాధికారి పదవికి శ్రీవిద్య, ఉపకార్యదర్శి పదవులకు దళపతిదినేశ్, ఎంటీ.మోహన్ కర్పగవల్లి, సవాల్రావ్ పోటీలో ఉన్నారు. ఇక బోస్‌వెంకట్ జట్టులో కార్యదర్శి పదవికి పీకే.గణేశ్, ఉపాధ్యక్ష పదవికి సోనియా, ఎల్.రాజా, కోశాధికారి పదవికి రవీందర్, ఉప కార్యదర్శి పదవులకు కే.దేవానంద్, దాడి బాలాజి, శ్రద్ధిక, కే.కమలహాసన్ పోటీ చేశారు. సంఘంలో మొత్తం 1,551 సభ్యులు ఉన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలీంగ్ సాయంత్రం 5 గంటల వరకూ జరిగింది. సినీ దర్శకుడు లియాఖత్అలీఖాన్ ఎన్నికల అధికారిగా నిర్వహించిన ఈ ఎన్నికలు గట్టి పోలీస్‌బందోబస్తు మధ్య జరిగాయి. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల లెక్కింపు మొదలైంది. అయితే ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. -
రాంచరణ్,తారక్‌లతో నటించాలని ఉంది
-
ఆ ఫొటోషూట్ వల్ల చాన్స్ వచ్చింది
‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాకి నేను ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు సుధాకర్ నన్ను బాగా రిసీవ్ చేసుకొని సపోర్ట్ చేసాడు. అతను చేసిన ఫొటోషూట్ స్టిల్స్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాకి నాకు ఛాన్స్ రావడానికి కారణం. ‘నువ్వు తోపురా’ మూవీ లైన్ విన్నప్పుడే పెద్ద హిట్ అనే ఫీలింగ్ కలిగింది. ట్రైలర్ చాలా బాగుంది. టికెట్స్ కొని మా ఫ్యామిలీతో ఈ సినిమా చూస్తా’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. సుధాకర్ కోమాకుల, నిత్యా శెట్టి జంటగా నిరోషా ముఖ్య పాత్రలో హరినాథ్ బాబు బి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నువ్వు తోపురా’. బేబీ జాహ్నవి సమర్పణలో డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని విజయ్ దేవరకొండ విడుదల చేశారు. హీరో సుధాకర్ మాట్లాడుతూ– ‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా తర్వాత చాలా అవకాశాలొచ్చినా కొన్ని కారణాల వల్ల చేయలేదు. యారొగెంట్‌గా ఉండే ఓ కుర్రాడు అమెరికా వెళ్లి జీవితంలో ఎలా ఎదిగాడు అన్నది మెయిన్ స్టోరీ’’ అన్నారు. ‘‘కృష్ణవంశీ, వైవీఎస్ చౌదరిగార్ల వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసాను. నా తొలి సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు’’ అన్నారు హరినాథ్ బాబు. ‘‘ప్రతి మనిషి జీవితంలో జరిగిన స్టోరీ ఇది’’ అన్నారు నిర్మాత డి.శ్రీకాంత్. ‘‘12 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో నటిస్తున్నాను. పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలిగింది’’ అన్నారు నటి నిరోషా. చిత్ర కథానాయిక నిత్యా శెట్టి పాల్గొన్నారు. -
ప్రేమ, సాహసం చిందించిన సింధూర పువ్వు
అప్పటికి తమిళంలో మణిరత్నం వచ్చేశాడు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అని హీరోల మీద దృష్టి పెట్టి ఉన్న తెలుగు ప్రేక్షకులలో కొందరు ఇది గమనించి ‘కెమెరా’, ‘టేకింగ్’ వంటి మాటలు మొదలుపెట్టారు. కథను వేరే రకంగా చెప్పవచ్చు, సన్నివేశాన్ని వేరే రకంగా మొదలెట్టవచ్చు, కెమెరాను వేరే చోట ఉంచవచ్చు అని తెలుసుకుంటూ ఉన్నారు.అలాంటి సమయంలో సగటు తెలుగు ప్రేక్షకుడు ఈ టేకింగ్ చాలా కొత్తగా ఉంది అని మాట్లాడుకున్న సినిమా ఒకటి ఉంది – అది ‘సింధూర పువ్వు’.ఈ సినిమా తెలుగువాళ్లను చాలా కాలం వదల్లేదు.వదలించుకుందామనుకున్నా దూరదర్శన్‌లో దీని పాటలు పదే పదే వెంటాడటానికి వచ్చేవి.ఆ పచ్చని మైదానాలు... ఛాతీకి పుస్తకం అంటించుకుని వడివడిగా నడుస్తున్న నిరోషా... ఆమెను వెంబడిస్తూ తప్పెట పట్టుకుని పాడుతున్న రాంకీ... ఆ పాట... సింధూర పువ్వా తేనె చిందించ రావా.... సూర్యకాంతం గయ్యాళే తప్ప విలన్ కాదు. ఆమెకు వేధించడం, పీడించడమే తెలుసు తప్ప మందిని పోగేసి ప్రాణాలు తోడేసేంత విలనిజం లేదు. ఈ సినిమాలో విజయలలిత లేడీ విలన్. జమిందారు భార్య. నిజంగానే భార్యేనా? కాదు. దివాణంలో పని మనిషిగా చేరింది. జమిందారును వలలో వేసుకుంది. భార్య అయి కూర్చుంది. ఇది గమనించిన జమిందారు తండ్రి ఆస్తి మొత్తం మనవరాలి పేరు మీద రాసి వెళ్లాడు. జమిందారు మొదటి భార్య పిల్లను కని చనిపోయింది. ఆ పిల్ల బాగు కోసం అతడు ఆ పని చేశాడు. కాని రెండో భార్య అయిన విజయలలిత కొడుకును కంది. ఆస్తిని అనుభవిస్తే తన కొడుకు అనుభవించాలి. ఈ సవతి కూతురు ఎవరు?నిరోషాకు పెళ్లి చేస్తే ఆ వచ్చినవాడు ఆస్తిని తన్నుకుపోతాడని ఊహ తెలియని వయసులో బాల్య వివాహం చేసింది. ఆ తర్వాత తాళిని కట్టిన బాలుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపించింది. నిరోషాను శాశ్వతంగా విధవరాలిగా చేసి మహల్లో కూచోబెట్టింది. ఎంత కష్టంలో కూడా కొద్దో గొప్పో గాలాడుతుంది. నిరోషాకు కాలేజీకి వెళ్లి చదువుకునే వీలు ఎలాగో దక్కింది. అంతే కాదు... విజయలలితకు పుట్టిన కుర్రాడు చాలా మంచివాడు. సోదరి పక్షం వహిస్తూ తల్లి ఆరళ్ల నుంచి ఆమెను కాపాడుకుంటూ ఉంటాడు. ఈ రెండు విషయాలే నిరోషాను ప్రాణాలతో ఉంచాయి.అయితే ఈడు ఊరికే ఉంచుతుందా?నిరోషా ఆ ఊరికి ఉద్యోగం కోసం వచ్చిన హార్టికల్చరిస్ట్ రాంకీని ప్రేమిస్తుంది.నిరోషా ప్రేమ విజయలలితకు ప్రమాదం. ఆమె ఆధిపత్యానికి ప్రమాదం. ఆస్తికి ప్రమాదం. విజయలలిత వాదనలు, పంచాయితీలు పెట్టే టైప్ కాదు. ఆమె దగ్గర కుత్తుకలు కోసే గుంపు చాలా ఉంది. ఆ గుంపుకు పని చెప్తే ఊరి శివార్లలో తాటిచెట్టుకు కావలసినవాళ్ల తలను వేళాడగడ్తారు.ఇప్పుడు విజయలలితకు రాంకీ తల కావాలి.అతణ్ణి కాపాడేవాడు ఆ ఊరిలో లేడు. రావాలి. అదిగో వచ్చాడు. విజయకాంత్ విజయకాంత్ పేరు కెప్టెన్ విజయకాంత్. మిలట్రీలో కెప్టెన్. సొంతూళ్లో చక్కటి అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళాడాడు. ఉద్యోగం కోసం మిలట్రీకి వెళ్లాడు. కాని దీనికి ముందు ఆ ఊళ్లోని ఒక దుర్మార్గుణ్ణి పోలీసులకు పట్టి ఇచ్చాడు. అంతే కాదు తల్లి వ్యవహారం నచ్చక ఇల్లు వదిలి వచ్చేసిన విజయలలిత కొడుకును తమ్ముడిలా ఆదరించాడు. భార్యతో, కొడుకుతో, దేవుడిచ్చిన తమ్ముడితో జీవితం ఆనందంగా ఉంది అనుకుంటూ ఉన్నప్పుడు జైలు నుంచి తిరిగి వచ్చిన దుర్మార్గుడు ఆ కుటుంబంపై దాడి చేశాడు. విజయకాంత్ భార్యను, చిన్నపిల్లాడైన కొడుకును చంపాడు. విజయకాంత్ మీద కూడా తుపాకీ పేల్చితే దానికి విజయలలిత కొడుకు అడ్డం పడి ప్రాణం కాపాడతాడు. చచ్చిపోయే ముందు అతడు కోరే ఒకే ఒక్క కోరిక– సోదరిని ఆ దివాణం నుంచి బయటపడేయమని. ఆమె కోరుకున్నవాడికి ఇచ్చి పెళ్లి చేయమని. మాట ఇచ్చిన విజయకాంత్.. విజయలలిత ఉన్న ఊరికి వస్తాడు.కాని అప్పటికే అతడు పేషెంట్.దుర్మార్గుడితో జరిగిన పెనుగులాటలో తలకు దారుణమైన గాయమయ్యి చావు బతుకుల మధ్య ఉన్నాడు. అతడికి వైద్యం చేసే డాక్టర్‌కి విజయకాంత్ గొప్పదనం తెలుసు. అతడి ప్రాణం విలువ తెలుసు. అందుకే తోడు అతడూ నిలుస్తాడు.ఒక పువ్వు.దాని చుట్టూ మారుతల్లి అనే ప్రాణాంతకమైన ముల్లు. ఆ ముల్లును ఏరి వేయడానికి ముగ్గురు వీరులు.రాంకీ. విజయకాంత్. డాక్టర్ చంద్రశేఖర్. నిరోషాను మహల్ నుంచి బయట పడేయడానికి వీరు చేసిన సాహసమే ‘సింధూర పువ్వు’. ఆ ఊరికి రోజుకు ఒక్కసారి ఒకే ఒక రైలు వస్తుంది. ఆ రైలు ఎక్కేసి పొలిమేర దాటేశారా.. ప్రమాదం తప్పినట్టే. అడుగడుగున విజయలలిత మనుషులు కాపు కాచి ఉన్న ఆ స్థలంలో విజయకాంత్, డాక్టర్ కలిసి రాంకీని, నిరోషాని ఎలా ఆ రైలు ఎక్కించారనేది క్లయిమాక్స్.కొన్ని ప్రేమలు ప్రకృతిని కూడా సతమతం చేస్తాయి.ఏదో ఒక ప్రాణాన్ని బలిగోరితే తప్ప అది శాంతించదు.రాంకీ, నిరోషాల ప్రేమ విజయకాంత్ ప్రాణాన్ని బలి కోరుతుంది.తన ప్రాణాన్ని పణంగా పెట్టి అతను రాంకీ, నిరోషాలను ఒకటి చేస్తాడు.కథ ముగుస్తుంది.కాని ఇలా చెప్పిన కథ ఇలా ఉండదు.చూపు తిప్పుకోని విధంగా ఉంటుంది. రోమాంచితంగా ఉంటుంది. ఉద్వేగంగా ఉంటుంది. లీనమయ్యేలా ఉంటుంది.అందుకే తెలుగు ప్రేక్షకులు ఇది భిన్నంగా ఉంది అని భావించారు. సూపర్‌హిట్ చేశారు.ఇప్పటికీ వినిపించే పాటే ఈ ప్రేమ కథకు మరపురాని గుర్తు... సింధూర పువ్వా తేనె చిందించ రావా... సింధూర పూవె పి.ఆర్. దేవరాజ్ దర్శకత్వంలో 1988లో తమిళంలో ఘన విజయం సాధించిన సినిమా ‘సింధూర పూవె’. తెలుగులో ‘సింధూర పువ్వు’గా విడుదలై అంతే పెద్ద హిట్ అయ్యింది. కాని ఇది నిర్మాత అయిన ఆబావానన్ సృష్టి అని చెప్పాలి. ఆబావానన్ తమిళంలో భిన్నమైన కథలను రూపొందించి గుర్తింపు పొందాడు. అతడు విలక్షణంగా రాసి దగ్గరుండి తీయించిన సినిమాగా సింధూర పువ్వును గుర్తించాలి. రాంకీ, నిరోషాలకు ఈ సినిమా చాలా పేరు తెచ్చింది. దాంతో వీళ్లు నిజ జీవితంలో భార్యాభర్తలు అయ్యారు. ఈ సినిమాలోని ‘సింధూర పువ్వా తేనె చిందించ రావా’ పాట చిత్రలహరిలో రాని ఎపిసోడ్ ఉండేది కాదు. సంగీతం అందించిన మనోజ్–గ్యాన్ జంట కొన్ని సినిమాలకు మాత్రమే పని చేసి విడిపోయి తన చెడు తానే తెచ్చుకుంది. సింధూర పువ్వుకు ఈ జంట ఇచ్చిన పాటలు, నేప«థ్య సంగీతం చాలా హిట్. అసలు ఫొటోగ్రఫీ, లొకేషన్స్, ఎడిటింగ్, ఎమోషన్‌ను రైజ్ చేసే ఎడిటింగ్, స్టంట్స్... అన్నీ చాలా బాగుంటాయి. విజయకాంత్‌కు మొదటిసారి ఈ సినిమా ఉత్తమ నటుడుగా స్టేట్ అవార్డ్ తెచ్చి పెట్టింది. తెలుగులో విజయకాంత్‌కు సాయి కుమార్ చాలా బాగా డబ్బింగ్ చెప్పాడు. అన్నట్టు ఆబావానన్ 2016లో జైలుకు వెళ్లాడు. బ్యాంకులను రెండున్నర కోట్లకు ముంచినందుకుగాను అతనికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. సినిమా కథల్లోలానే నిజజీవితంలోనూ ట్విస్ట్‌లు ఉంటాయనడానికి ఇదొక ఉదాహరణ. – కె -
సవతి సోదరుల మధ్య ఘర్షణ.
పూర్వం ధర్మం ప్రకారం, అంటే అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి, సంఘం అంగీకారంతో చేసుకునే భార్యను ‘ధర్మపత్ని’ అనేవారట. ధర్మపత్ని అంటే మొదటి భార్య అని అర్థం. భర్త శారీరక, మానసిక అవస్థలపై ఆస్తులపై అధికారాలపై ఈమెకే సగభాగం దక్కుతుంది. ఈమె పిల్లలే వారసులు అవుతారు. అధికారిక హక్కుదారులు అవుతారు. రెండవ భార్యకు ఈ హక్కు ఉండదు. ఆమె సంతానానికీ ఉండదు. దశరథుడి ధర్మపత్ని కౌసల్యకు పుట్టిన రాముడే అయోధ్యకు వారసుడు. కాదని కారడవులకు పంపడం వల్లే రామాయణం జరిగింది. తండ్రి మీద హక్కు కోసం లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నడు పోరాడలేదు. కాని ‘ఘర్షణ’లో కార్తిక్ పోరాడాడు. రెండవ భార్య సంతానం కావడం వల్ల తండ్రి పేరును తన పక్కన పెట్టుకోవడానికి పోరాడాడు. తండ్రిని అతనే నా తండ్రి అని చెప్పుకోవడానికి పోరాడాడు. నీకే కాదు నాకూ హక్కు ఉంది అని మొదటి భార్య కుమారుడితో చెప్పడానికి పోరాడాడు. ఘర్షణ కథ ఇద్దరు సవతి సోదరుల మధ్య నడిచిన కథ. ఇలాంటి కథ భారతీయ సినిమాలలో ఇదే మొదటిది. చాలా ఇబ్బందిగా ఉంటుంది– రెండవ భార్య కుమారుడితో ‘నువ్వు పెద్ద భార్య కుమారుడివా?’ అని అడిగితే. చాలా ఇరకాటంగా ఉంటుంది– మొదటి భార్య కుమారుడితో ‘మీ నాన్నకు ఇంకో భార్య ఉందట కదా’ అని అడిగితే. సంఘం ఒక భార్య–ఒక భర్తనే అంగీకరిస్తుంది. చట్టాన్ని ఒప్పించి రెండో పెళ్లి చేసుకున్నా, రెండో ఇల్లు పెట్టినా వ్యక్తిగతంగా బాగానే ఉండొచ్చు కానీ సంఘప్రకారం అది తప్పు అవుతుంది. మీ నాన్న తప్పు చేశాడు... మీకు దక్కవలసిన ప్రేమను మరొకరి ద్వారా కలిగిన సంతానానికి పంచాడు అనే భావన ఏదో ఈ సినిమాలో విజయకుమార్ కుమారుడిగా వేసిన ప్రభు మనసులో ఉంది. అలాగే మా నాన్న మా అమ్మను పెళ్లి చేసుకుని ఆమెకు సంఘపరమైన మర్యాద ఇవ్వలేకపోయాడు. ఆమె కూడా నా భార్యే అని లోకానికి ధైర్యంగా చెప్పలేకపోయాడు. మమ్మల్ని తన పిల్లలుగా చేయి పట్టుకుని నలుగురి మధ్యలో నడిపించలేకపోయాడు. మాకు ఉంపుడుగత్తె పిల్లలు అనే హోదాను ఇచ్చాడు అనే భావన విజయకుమార్ రెండో భార్య జయచిత్రకు పుట్టిన కార్తిక్ మనసులో ఉంది. ప్రభు, కార్తిక్ ఇద్దరూ మంచి వయసులో ఉన్న కుర్రవాళ్లు. ఆ వయసులో ఉండే ఉత్సాహం, హుషారు వారిలో ఉండవు. ఇద్దరూ అశాంతితో రగలిపోతుంటారు. ప్రభు కార్తిక్‌ను యాక్సెప్ట్ చేయడు. ప్రభును కార్తిక్ తన సోదరుడిగా గౌరవించడు. ఇద్దరి మధ్యా ఘర్షణ. చాలా పెద్ద ఘర్షణ. మనిషి ఇన్స్టింక్స్ చాలా బలంగా ఉంటాయి. నాది అనే భావన సకల జీవరాశుల్లో ఉంటుంది. ప్రభు, కార్తిక్‌ల మధ్య ఘర్షణకు కారణం వారికి తండ్రి మీద ఉన్న గొప్ప ప్రేమకు ప్రచ్ఛన్నరూపం అనిపిస్తుంది. ఆ తండ్రి పెద్ద ప్రభుత్వ అధికారి. చాలా మంచివాడు. ఈ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో ఉన్నా భార్యతో, కుమారుడితో చాలా బాగా ఉంటాడు. అలాంటి తండ్రి మాకు మాత్రమే ఉండాలని పిల్లలు అనుకుంటారు. ప్రభు, కార్తిక్‌లు కూడా అనుకొని ఉండొచ్చు. కాని ప్రతి రోజూ ఆ తండ్రి ఏకకాలంలో రెండు ఇళ్లలోనూ ఉండలేడు కదా. ఇక్కడ కొన్నిరోజులు ఉంటే అక్కడివాళ్లకు కోపం. అక్కడ కొన్నిరోజులు ఉంటే ఇక్కడి వాళ్లకు చిన్నతనం. దీని మధ్య అతడు నలుగుతుంటాడు. ఒకటి మాత్రం వాస్తవం. పెద్ద భార్య ఇంట్లో అతడికి పూర్తి స్వేచ్ఛ లేదు. కిటికీలు మూతబడి గాలాడని భావన. అందుకే అతడు కాసింత ఓదార్పు కోసం, రెండో భార్య ఇంటి నడవలో, తులసి కోటకు కాసింత దూరంలో చేరగిలపడి, ఒక వైపు వాన కురుస్తుంటే మరో వైపు భార్య ఆమ్లెట్ తెచ్చి పెడుతుంటే సకల మర్యాదలు వదిలి హాయిగా కాసింత మందు బిగించే స్వేచ్ఛ కోసం అక్కడికి వస్తుంటాడు. నిజానికి అతడి స్వార్థం అతడు చూసుకున్నాడు కాని ఆ భార్యకు పుట్టిన, ఈ భార్యకు పుట్టిన పిల్లల మధ్య సఖ్యత ఉందా లేదా చూసుకోలేకపోయాడు. ఆ సఖ్యత కోసం అతడు ఆ తర్వాత ధైర్యంగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఒకవేళ ప్రయత్నించే సమయం వచ్చేసరికి ఇరు పక్షాల్లో ఘర్షణ చోటు చేసుకుని ఉంది. ప్రభు పోలీస్ కమిషనర్ అయ్యి కార్తిక్‌ను సిల్లీ కారణాల్లో అరెస్ట్ చేసేవరకు వెళతాడు. కార్తిక్ తన ఫ్రెండ్స్‌తో పెద్ద భార్య ఇంటికి వెళ్లి రాళ్లు విసిరి అద్దాలు పగలగొడతాడు. రోడ్డున పడి కొట్టుకునే ఈ అన్నదమ్ములు ఒకే తండ్రికి పుట్టారు. తల్లులు వేరైనందుకు శతృవులయ్యారు. మేమూ మేమూ ఉన్నప్పుడు మేము పాండవులం. వారు కౌరవులు. కాని బయటి నుంచి శతృవు వస్తే మేము నూటైదు మంది అన్నదమ్ములం అన్నాడు ధర్మరాజు. బయటి శతృవు వచ్చినప్పుడు రక్తం చేసే చాలనం చిత్రంగా ఉంటుంది. తన రక్తాన్ని తాను గుర్తించి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే రక్తబంధం అంటారు. ఈ సినిమాలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న విలన్ మీద ఒన్ మేన్ కమిషన్‌గా విజయకుమార్ బాధ్యతలు తీసుకుంటాడు. ఫలానా తేదీ లోపల కమిషన్ రిపోర్ట్ అప్పగించాలి. ఆ విలన్ దోషి అని కమిషన్ తేల్చితే వెంటనే అతడు జైలుకు వెళతాడు. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి విజయకుమార్‌ను విలన్ బుజ్జగించే ప్రయత్నం చేస్తుంటాడు. కాని విజయకుమార్ స్ట్రిక్ట్ కనుక మాట వినడు. దాంతో విజయకుమార్నే చంపించే పనికి విలన్ దిగుతాడు. ఈ సంగతి అన్నదమ్ములకు తెలుస్తుంది. బయటి నుంచి ఎవరూ రానంత వరకే వారు సవతి సోదరులు. వచ్చాక సొంత అన్నదమ్ములు. తండ్రిని కాపాడటానికి ఇద్దరూ రంగంలో దిగుతారు. విలన్‌ను ఎదుర్కొని తండ్రిని కాపాడుకుంటారు. ఘర్షణలో శాశ్వతత్వం లేదు. శాంతిలోనే ఉంది. విడి చేతులలో బలం లేదు. చేతులు కలిపితేనే బలం. ఆ అన్నదమ్ములు ఇప్పుడు ఒక్కటయ్యారు. తండ్రి ఒకడే. తల్లులు వేరు. కాని అమ్మా అని పిలిస్తే ఏ తల్లి అయినా ఒకటే కదా. ఈ కుటుంబం ఇప్పుడు సమష్టిగా మారడం మనకు ఆనందాన్ని ఇస్తుంది. అనుబంధాలు విరిసేను.. పన్నీరు చిలికేను... వెరీగుడ్ మణి. అగ్నినక్షత్రం ‘నాయకుడు’ వంటి ఎపిక్ తీశాక మణిరత్నం 1988లో నెరేషన్‌ను, ఎమోషన్‌ను మిళితం చేసుకుంటూ తేలిక పద్ధతిలో చెప్పిన కథ ‘అగ్నినక్షత్రం’. తెలుగులో ‘ఘర్షణ’గా డబ్ అయ్యి పెద్ద విజయం సాధించింది. సవతి సోదరుల మధ్య ఘర్షణ ఉంటుంది అనే చిన్న పాయింట్ తప్ప కథంటూ ఏమీ లేని ఈ సినిమా కేవలం సంఘటనల వరుస ద్వారా సమ్మోహితం చేస్తుంది. ప్రభు జీవితంలో కొన్ని సంఘటనలు, ప్రేమ, కార్తిక్ జీవితంలోని కొన్ని సంఘటనలు, ప్రేమ వీటి మధ్యలో అక్కడక్కడా ఘర్షణ చూపిస్తూ మంచి పాటలతో సినిమాను ముగిస్తాడు దర్శకుడు. ఈ సినిమా వచ్చిన కొత్తల్లో ఇందులోని ఇళయరాజా పాటలకు, పి.సి.శ్రీరామ్ ఫొటోగ్రఫీకి ప్రేక్షకులు మోహాశ్చర్యాలకు లోనయ్యారు. పి.సి.శ్రీరామ్ చేసిన మెరుపు లైటింగ్ ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలను వెంటాడింది. ఇందులోని ‘రాజా రాజాధి రాజా’ పాటలో ప్రభుదేవా గ్రూప్డాన్సర్గా కనిపిస్తాడు. ‘ఒక బృందావనం సోయగం’ పాట చిత్రలహరిలో కొన్ని వందలసార్లు ప్లే అయ్యింది. ఈ సినిమా నిరోషాకు తొలి సినిమా. అరుపులు, కేకలు, విగ్గుల విలన్ హయామ్లో చాలా మామూలు పెద్ద మనిషిగా ‘ఏం రాజా’ అని ఆత్మీయంగా పిలిచే విలన్ (మద్రాసులో ఆనంద్ థియేటర్ ఓనర్ జి.ఉమాపతి) కనిపించడం చాలా కొత్త. ఈ విలనీని ‘కర్తవ్యం’లో పుండరీ కాక్షయ్యకు వాడారు. ఈ సినిమాలో భార్య నాగమణి ఊరెళితే ఎగిరి గంతేసి పండగ చేసుకునే జనకరాజ్ క్యారెక్టర్ ఎంత హిట్టయ్యిందంటే ఇప్పటికీ జన సామాన్యంలో భార్య ఊరెళ్లిందని చెప్పడానికి ‘నాగమణి లేదు’ అనడం కద్దు. స్లో మోషన్లో ప్రభు, కార్తీక్ కోపంగా క్లోజప్‌లో ఒకరినొకరు చూసుకునే షాట్స్‌ను ఆ తర్వాత చాలా సినిమాల్లో అనుసరించారు. ఘర్షణ చాలావాటికి ట్రెండ్ క్రియేట్ చేసింది. అది నిజమైన ట్రెండ్ సెట్టర్. – కె నిరోషా, పి.సి. శ్రీరామ్, జనకరాజ్, మణిరత్నం -
‘నువ్వు...’తో నిరోషా
ఒక్క సినిమాతో కుర్రకారుకి డ్రీమ్ గర్ల్ అయిన కథానాయికల్లో నిరోషా ఒకరు. ‘ఘర్షణ’ సినిమాలో ‘బృందావనం..ఒక సోయగం..’ అంటూ ఆమె ఈత కొలనులో వయ్యారాలు పోయిన విషయాన్ని అంత సులువుగా మరచిపోలేం. అంత హాట్‌గా కనిపించి, ‘సింధూరపువ్వు’లో ఫుల్ ట్రెడిషనల్‌గానూ మనసు దోచుకున్నారు. నిరోషా ఏ పాత్రలో అయినా దిగిపోగలుగుతారనడానికి ఈ రెండు చిత్రాలే నిదర్శనం. కొంత గ్యాప్ తర్వాత ఆమె ‘నువ్వు తోపురా’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి రీ–ఎంట్రీ ఇస్తున్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల, నిత్యా శెట్టి జంటగా బి.హరనాథ్ బాబు దర్శకత్వంలో యూనైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘సీనియర్ హీరోయిన్ నిరోషా మా సినిమాలో ‘సావిత్రి’ అనే కీలక పాత్ర ద్వారా రీ–ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఆమె మా చిత్రంలో నటించడం వల్ల మాలో కొత్త ఉత్సాహం వచ్చింది. హరినాథ్ బాబు చక్కగా డైరెక్ట్ చేస్తున్నారు’’ అన్నారు నిర్మాత. -
నిరోషా రీ ఎంట్రీ
ఒకప్పుడు ఓహో అని ప్రకాశించిన హీరోయిన్లు కొంత గ్యాప్ తరువాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించడం అన్నది సర్వసాధారణమే. అలా మళ్లీ ముఖానికి రంగు వేసుకుంటున్న నటి నిరోషా. 20 ఏళ్ల క్రితం చిన్న పూవే మెల్లపేసు, సింధూరపూవే తదితర చిత్రాల్లో హీరోయిన్గా నటించి పేరు గాంచారు. నటుడు రాంకీని వివాహం చేసుకున్న నిరోషా, కుట్ర పత్రికై చిత్రం 2000 సంవత్సరంలో తెరపైకి వచ్చింది. ఆ తరువాత ఆమె నటనకు దూరం అయ్యారు. ఆమె కాదు భర్త రాంకీ కూడా నటించడం మానేశారు. అలాంటిది రాంకీ మళ్లీ నటించడం మొదలెట్టారు. ఆ మధ్య విడుదలైన బిరియాని చిత్రంలో రాంకీ ముఖ్యభూమికను పోషించారు. నటి నిరోషా కూడా మళ్లీ నటించడానికి సిద్ధం అవ్వడం విశేషం. ప్రస్తుతం హాస్య కథా చిత్రంగా తెరకెక్కుతున్న పప్పాలిలో నిరోషా అతిథిగా మెరవనున్నారు. ఇందులో సెంథిల్, ఇషార్ హీరో హీరోయిన్లుగా నటించారు. రీ ఎంట్రీలో మంచి పాత్రలు పోషించాలని ఆశిస్తున్నట్లు నిరోషా తెలిపారు.