‘నువ్వు...’తో నిరోషా | Nirosha act in Nuvvu Topura movie | Sakshi
Sakshi News home page

‘నువ్వు...’తో నిరోషా

Published Sun, Jun 25 2017 1:08 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

‘నువ్వు...’తో నిరోషా - Sakshi

‘నువ్వు...’తో నిరోషా

ఒక్క సినిమాతో కుర్రకారుకి డ్రీమ్‌ గర్ల్‌ అయిన కథానాయికల్లో నిరోషా ఒకరు. ‘ఘర్షణ’ సినిమాలో ‘బృందావనం..ఒక సోయగం..’ అంటూ ఆమె ఈత కొలనులో వయ్యారాలు పోయిన విషయాన్ని అంత సులువుగా మరచిపోలేం. అంత హాట్‌గా కనిపించి, ‘సింధూరపువ్వు’లో ఫుల్‌ ట్రెడిషనల్‌గానూ మనసు దోచుకున్నారు. నిరోషా ఏ పాత్రలో అయినా దిగిపోగలుగుతారనడానికి ఈ రెండు చిత్రాలే నిదర్శనం.

కొంత గ్యాప్‌ తర్వాత ఆమె ‘నువ్వు తోపురా’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి రీ–ఎంట్రీ ఇస్తున్నారు.  ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఫేమ్‌ సుధాకర్‌ కోమాకుల, నిత్యా శెట్టి జంటగా బి.హరనాథ్‌ బాబు దర్శకత్వంలో యూనైటెడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై డి.శ్రీకాంత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘సీనియర్‌ హీరోయిన్‌ నిరోషా మా సినిమాలో ‘సావిత్రి’ అనే కీలక పాత్ర ద్వారా రీ–ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఆమె మా చిత్రంలో నటించడం వల్ల మాలో కొత్త ఉత్సాహం వచ్చింది. హరినాథ్‌ బాబు చక్కగా డైరెక్ట్‌ చేస్తున్నారు’’ అన్నారు నిర్మాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement