రజనీకి జోడీ? | Nirosha Pair With Rajinikanth In Lalsalam Movie | Sakshi
Sakshi News home page

రజనీకి జోడీ?

Published Mon, Jun 26 2023 3:22 AM | Last Updated on Mon, Jun 26 2023 3:22 AM

Nirosha Pair With Rajinikanth In Lalsalam Movie - Sakshi

‘ఒక బృందావనం సోయగం..’ అంటూ ఈత కొలనులో హొయలొలికించి, కుర్రకారు మనసుల్లోకి చొచ్చుకుపోయారు నిరోషా. ‘ఘర్షణ’ (1988) చిత్రంలోని ఈ పాటతో పాటు ఈ చిత్రంలో నాయికగా నిరోషాకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ‘సింధూరపువ్వు’లోనూ ఆమె కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయని నిరోషా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆ మధ్య ఎంట్రీ ఇచ్చారు.

కాగా రజనీకాంత్‌ కీ రోల్‌ చేసిన ‘లాల్‌ సలామ్‌’లో ఆయనకు జోడీగా నిరోషా కనిపిస్తారన్నది కోలీవుడ్‌ టాక్‌.  విష్ణు విశాల్, విక్రాంత్‌ హీరోలుగా రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో మొయుద్దీన్‌ భాయ్‌ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్‌. ఆయనకు చెల్లెలి పాత్రను జీవిత చేస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. భార్య పాత్రను నిరోషా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement