key roll
-
చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ గ్రిడ్ అక్రమాలు
-
రజనీకి జోడీ?
‘ఒక బృందావనం సోయగం..’ అంటూ ఈత కొలనులో హొయలొలికించి, కుర్రకారు మనసుల్లోకి చొచ్చుకుపోయారు నిరోషా. ‘ఘర్షణ’ (1988) చిత్రంలోని ఈ పాటతో పాటు ఈ చిత్రంలో నాయికగా నిరోషాకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ‘సింధూరపువ్వు’లోనూ ఆమె కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయని నిరోషా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆ మధ్య ఎంట్రీ ఇచ్చారు. కాగా రజనీకాంత్ కీ రోల్ చేసిన ‘లాల్ సలామ్’లో ఆయనకు జోడీగా నిరోషా కనిపిస్తారన్నది కోలీవుడ్ టాక్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో మొయుద్దీన్ భాయ్ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్. ఆయనకు చెల్లెలి పాత్రను జీవిత చేస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. భార్య పాత్రను నిరోషా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
కరీంనగరా మజాకా! ఇక్కడ పార్టీలతో పనిలేదు.. కాపు వర్సెస్ వెలమ, తగ్గేదేలే
రాజకీయాలు సహజంగా పార్టీల వారీగా నడుస్తుంటాయి. కాని తెలంగాణలో ఒక జిల్లాలో పార్టీల కంటే సామాజిక వర్గాలకే ప్రాధాన్యత కనిపిస్తుంది. అక్కడ పార్టీలు ఒక భాగమైతే.. సామాజికవర్గాలు మరో భాగంగా ఉన్నాయి. పార్టీ ఏదైనా ఒక ప్రధాన సామాజికవర్గం నేతలు అన్ని పార్టీల్లోని తమవారు గెలవాలని కోరుకుంటారు. ఎవరిని ఎలా గెలిపించాలా? ప్రత్యర్థి సామాజికవర్గాన్ని ఎలా దెబ్బ తీయాలా అని ప్లాన్స్ వేస్తుంటారు. ఇంతకీ ఆ జిల్లా ఎక్కడుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఆది నుంచీ వెలమ సామాజికవర్గం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఓటింగ్ పరంగా అధికంగా ఉన్న మున్నూరు కాపు వర్గం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ మరోసారి కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీగా ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి హాజరవుతూ తన బలాన్ని పెంచుకుంటున్నారు. రాబోయే ఎన్నికల కోసం అందరి కంటే ముందుగానే సిద్దమవుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఏఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే వినోద్‌కు దెబ్బ పడిందో ఈసారి కూడా అవే నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుందనే ప్రచారం మొదలైంది. ఇందుకోసం సామాజిక వర్గ లెక్కలు వేస్తున్నారు స్థానిక నాయకులు. బోయినపల్లి వినోద్‌కు దక్కుతున్న ప్రాధాన్యాన్ని భరించలేకే మున్నూరు కాపు వర్గానికి చెందిన కొందరు నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా మున్నూరు కాపు వర్సెస్ వెలమ సామాజికవర్గం మధ్య గ్యాప్ కొనసాగుతోంది. గతంలో వెలమ సామాజికవర్గం వారే కరీంనగర్ అసెంబ్లీ సీటుకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ హ్యాట్రిక్ సాధించడంతో.. వెలమ సామాజికవర్గానికి స్కోప్ లేకుండా పోయింది. ఈ క్రమంలో.. పార్లమెంట్ సెగ్మెంట్ లో వినోద్ తో పాటు.. కరీంనగర్ అసెంబ్లీలోనూ ఆ సామాజికవర్గాలకు సందు ఇవ్వొద్దనే రీతిలో మరి కొన్ని సామాజికవర్గాలు.. ఏకంగా పార్టీలకతీతంగా కంకణం కట్టుకోవడం.. కరీంనగర్ లో కనిపించే విభిన్న రాజకీయ తంత్రం. రాజకీయాలంటేనే వ్యూహ, ప్రతివ్యూహాలుగా భావించే రోజుల్లో.. నేతల స్వయంకృతాపరాధాలు కూడా ప్రత్యర్థి పార్టీలకు..అలాగే సొంత పార్టీలోని ప్రత్యర్థులకూ అడ్వాంటేజ్ గా మారుతాయి. గత పార్లమెంట్ ఎన్నికలే అందుకు నిదర్శనం. కరీంనగర్‌కు ఎన్నో పనులు చేసినా తనను ఓడించారని మాజీ ఎంపీ వినోద్ భావిస్తుండగా... ఎన్ని చేశామన్నది కాదు..ప్రజలేం కోరుకుంటున్నారో తెలుసుకుని వాటిని చేశారా అని పార్టీలోని ఆయన ప్రత్యర్థులు కామెంట్ చేశారు. చదవండి: మాటిస్తున్నా మహేంద్రా!.. వచ్చేది మనమే.. అటుఇటు వెళ్లి ఆగం కావొద్దు పైగా ప్రస్తుతం అధికారంలో లేనప్పుడే వినోద్ శైలి డామినేటింగ్ గా ఉందని ఫీలవుతున్న కొందరు కీలక ప్రజాప్రతినిధులు.. మరోసారి ఎంపీగా గెలిస్తే.. ఇక తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తమకు ప్రాధాన్యత లేకుండా పోతుందనే భావన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. కరీంనగర్ రాజకీయాల్లో ఒక పార్టీవారంతా ఒకే తాటిపైన ఉన్నారనుకుంటే పొరపాటే. ఒక సామాజికవర్గం వారైతే మాత్రం కచ్చితంగా ఒక్క తాటిపైనే ఉన్నట్టు సామాజిక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీది పై చేయి అనేకంటే.. ఏ సామాజికవర్గానిది పైచేయి అవుతుందని మాట్లాడుకోవాల్సిన భిన్నమైన పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తోంది. -
అమెరికా ఎగుమతుల మండలిలో ఇద్దరు భారతీయులు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ విభాగంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి ప్రధాన జాతీయ సలహా మండలి ఎక్స్పోర్ట్ కౌన్సిల్‌కు కార్పోరేట్ రంగానికి చెందిన పునీత్ రంజన్, రాజేశ్ సుబ్రమణియమ్‌లను ఎన్నుకున్నట్లు వైట్‌హౌస్ బుధవారం ప్రకటించింది. రంజన్ గతంలో డెలాయిట్ కన్సల్టింగ్‌కు సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం డెలాయిట్ గ్లోబల్ సీఈఓ ఎమిరిటస్‌గా ఉన్నారు. ఫెడ్ఎక్స్కు సీఈవో, అధ్యక్షునిగా సుబ్రమణియమ్ కొనసాగుతున్నారు. సుబ్రమణియమ్‌ను ఈ ఏడాది భారతప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్‌తో సత్కరించింది. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యం పనితీరు, ఎగుమతులను ప్రోత్సహించడం, వ్యాపార, పరిశ్రమల, వ్యవసాయ, కార్మిక, ప్రభుత్వ విభాగాల మధ్య తలెత్తే సమస్యలపై చర్చించి ఈ ఎగుమతుల మండలి పరిష్కారానికి కృషిచేస్తుంది. ఈ అంశాలపై అధ్యక్షుడు బైడెన్‌కు సలహాలు, సూచనలు చేస్తోంది. -
నా వయసున్నోళ్లు లవ్‌స్టోరీస్ కూడా చేస్తున్నారు
‘‘చోర్ బజార్’ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్, కలర్‌ఫుల్ ఫిల్మ్. ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్ర చేశాను. ఇదొక మాస్ ఫిలిం. నా జానర్ దాటి బయటికొచ్చి ఈ సినిమా చేశాను’’ అని నటి అర్చన (‘నిరీక్షణ’ ఫేమ్) అన్నారు. ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన అర్చన మాట్లాడుతూ– ‘‘నా గురువులు, దర్శకులు నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. 300 సినిమాల్లో చేసిన హీరోయిన్‌కి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలో అలాంటి గుర్తింపును భారతీయ సినిమా, నా దర్శకులు నాకు ఇచ్చారు.. ఆ గౌరవాన్ని పాడు చేసుకునే హక్కు నాకు లేదు. నేను చెన్నైలో ఉంటున్నాను. షూటింగ్ కోసం హైదరాబాద్ రాలేకపోయేదాన్ని. అందుకే తెలుగులో గ్యాప్ వచ్చింది. ఒకప్పుడు హీరో సరసన నటించిన హీరోయిన్ కొంత కాలానికి అదే హీరోకి సోదరి, వదిన, తల్లి, అత్త అవుతోంది. మన సినిమాల్లో మహిళా పాత్రలకు 80 శాతం ప్రాధాన్యత ఉండటం లేదు. మరాఠీలో మహిళలకు ఎక్కువ వైవిధ్యమైన పాత్రలు దక్కుతున్నాయి. నా వయసువాళ్లు అక్కడ లవ్ స్టోరీస్‌లో నటిస్తున్నారు.. బోల్డ్ సీన్స్ చేస్తున్నారు. ‘చోర్ బజార్లో’ నాది అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ పాత్ర. ఆయన్ను ప్రేమించి, ఆయన కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయే పాత్ర నాది. ఈ మూవీలో హీరో పేరు బచ్చన్ సాబ్. మా ఇద్దరికీ అమితాబ్ అంటే ఇష్టం. అర్చన అంటే నెక్ట్స్ డోర్ ఉమెన్ అనే ఇమేజ్ ఉంది.. ఆ గుర్తింపును ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతం తమిళంలో ఒకటి, కన్నడలో ఒక ఆర్ట్ ఫిలిం చేస్తున్నాను. అలాగే ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించనున్నాను’’ అన్నారు. -
పథకాలకు ప్రాచుర్యంలో... మీడియాది కీలకపాత్ర
కోజికోడ్: రాజకీయాలకు అతీతంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంలో మీడియాది కీలకపాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరంలో ఇప్పటిదాకా పెద్దగా వెలుగులోకి రాని ఘట్టాలను, స్ఫూర్తిదాయకమైన స్వాతంత్య్ర యోధుల జీవిత విశేషాలను ప్రచురించాలని మీడియాకు సూచించారు. ప్రముఖ మలయాళ పత్రిక మాతృభూమి శతాబ్ది ఉత్సవాలను మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మంచి పథకాల రూపకల్పనతో పాటు వాటి గురించి సమాజంలోని అన్ని వర్గాలకు తెలిసేలా చేయడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా అన్నారు. ఈ పాత్రను మీడియా అత్యంత సమర్థంగా పోషించిందన్నారు. ‘‘స్వాతంత్య్ర సమరంలో చిన్న గ్రామాలు, పట్టణాలూ పాల్గొన్నాయి. వాటి గురించి అందరికీ తెలిసేలా కథనాలు ప్రచురించి దేశ ప్రజలంతా ఆ గ్రామాలకు వెళ్లేలా చేయాలి’’ అని మీడియా సంస్థలకు ప్రధాని సూచించారు. హోలీ శుభాకాంక్షలు న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాల్ని నింపాలని ఆకాంక్షిస్తున్నానని ట్విట్టర్లో మోదీ అన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. -
కాంగ్రెస్ ఆపద్బాంధవుడు శివకుమార్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ దగ్గర్నుంచి.. శనివారం బలపరీక్ష జరిగేంతవరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. శివకుమార్ ఒక్కళిగ సామాజికవర్గానికి చెందినవారు. కననపుర ఎమ్మెల్యే అయిన శివకుమార్ గతంలో ఇంధనశాఖ మంత్రిగా చేశారు. విలాస్‌రావ్ ప్రభుత్వానికి అండ మహారాష్ట్రలో 2002లో అప్పటి కాంగ్రెస్ సీఎం విలాశ్రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ కొలువుదీరి ఉంది. దీంతో ఎస్ఎం కృష్ణ కేబినెట్లో మంత్రిగా ఉన్న శివ మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్‌కు తరలించి కాపాడారు. శివ తొలిసారిగా 1989లో సాతనూరు నియోజకవర్గంలో దేవెగౌడను ఓడించి సంచలనం సృష్టించారు. దీంతో 1990లో అప్పటి సీఎం బంగారప్ప ఆయన్ను జైళ్లు, హోంగార్డుల శాఖమంత్రిగా నియమించారు. 2002 లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడ మీద పోటీచేసి ఓడిపోయిన శివకుమార్.. రెండేళ్ల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేవెగౌడపై తేజస్వినీ అనే జర్నలిస్టును గెలిపించి ప్రతీకారం తీర్చుకున్నారు. గుజరాత్ ఎమ్మెల్యేల క్యాంప్‌కు నేతృత్వం 2017 చివర్లో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌ను ఓడించాలని బీజేపీ ప్రయత్నించిన నేపథ్యంలో శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్ట్‌లో దాచిఉంచారు. ఈ సమయంలో శివతో పాటు ఆయన సన్నిహితులపై ఐటీ శాఖ భారీఎత్తున దాడులు నిర్వహించింది. తాజాగా కర్ణాటక సంక్షోభం నేపథ్యంలోనూ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం శివకే అప్పగించింది. -
పాలక వర్గాలదే కీలక బాధ్యత
జిల్లా సహకార అధికారిణి ప్రవీణ పెదపూడి : సహకార సంఘాల అభివృద్ధిలో పాలకవర్గాలదే కీలక బాధ్యతని జిల్లా సహకార అధికారి టి.ప్రవీణ అన్నారు. స్థానిక పీఏసీఎస్‌లో బుధవారం సొసైటీ అ««దl్యక్షుడు పుట్టా గంగాధర్ చౌదరి ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ మాట్లాడు తూ స్వచ్ఛ భారత్ చేపట్టాలని సూచించారు.జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు ఇచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. అనంతరం ముగ్గురు సీనియర్ రైతులను సత్కరించారు. డివిజ¯ŒS సహకార అధికారి కె.పద్మ, రాష్ట్ర సహకార యూనియ¯ŒS విద్యాధికారి ఆది మూలం వెంకటేశ్వరరావు, జిల్లా అడిట్ అధికారి వి.ఫణికుమార్, జిల్లా అసిస్టెంట్ రిజిస్టర్ ఎ¯ŒSఎస్ఎ¯ŒSబీకే దుర్గాప్రసాద్, సీఈఓ బి.రాజుబాబు, పెద్దాడ సాగునీటి డీసీ చైర్మ¯ŒS మార్ని రాంబాబు, స్థానిక సీఈఓ వాసంశెట్టి గోవిందరాజులు, డీసీసీబీ బ్రాంచి మేనేజర్ ఎం.శ్రీనివాస్, పెదపూడి సా గునీటి సంఘం అ««దl్యక్షుడు కోరా రామన్న చౌదరి పాల్గొన్నారు.