జడ్జి ఎదుటే ఆత్మహత్యాయత్నం | Man attempts suicide in the court room | Sakshi
Sakshi News home page

జడ్జి ఎదుటే ఆత్మహత్యాయత్నం

Published Tue, Jul 11 2017 6:30 PM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

Man attempts suicide in the court room

హైదరాబాద్‌ : కోర్టులో జడ్జి ముందు విచారణ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నగర శివారు రాజేంద్రనగర్లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...బహదూర్ పురా కిషన్ బాగ్కు చెందిన షేక్ అమీర్ దొంగతనం , దోపిడీ కేసులలో జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. అయినా తీరు మారకుండా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ ఖైదీగా ఉన్న షేక్ అమీర్ ఉప్పరిపల్లిలోని 8వ మెట్రో పాలిటన్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు.

అయితే విచారిస్తున్న సమయంలో జడ్జి ముందు అమీర్ వెంట తెచ్చుకున్న బ్లేడుతో ముఖం , ఛాతిపై తీవ్రంగా గాయపరుచుకున్నాడు. రక్తస్రావం కావడంతో అమీర్ను ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స నిర్వహించి తిరిగి కోర్టులో హాజరు పరిచారు. మెరుగైన వైద్యం కల్పించాలని జడ్జి ఆదేశించడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అమీర్పై రెండు దొంగతనం, నాలుగు దోపిడీ కేసులతో పాటు పీడీ యాక్టు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న అమీర్ పై మరలా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement