‘బాల్యాన్ని చిదిమేయద్దు’
ఇళ్లలో పెద్దలు చదువు చాలని 18 లోపే పెళ్లిలు చేస్తూ బంగారం లాంటి జీవితాలను నాశనం చేయడం మంచి పద్ధతి కాదని అవగాహన కల్పించారు. ప్రస్తుత ఏడాది కూడా 2305 మంది కేజీబీవీ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, తమ పాఠశాల నుంచి 40 మంది పరీక్షల్లో పాల్గొన్నట్లు వివరించారు. వీరికి బాల్య వివాహాలపై అవగాహన కల్పించేందుకే సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హెచ్‌ఎం మాట్లాడుతూ చదువుకున్న ప్రతి అమ్మాయి బాల్య వివాహాలపై తిరుగుబాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌వీఎం అధికారులు బాలమురళి తో పాటు ఉపాద్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.