దేశంలో అత్యధికంగా బాల్య వివాహాలు జరిగే రాష్ట్రాల్లో రాజస్థాన్ రెండోస్థానం ఆక్రమించిందని శుక్రవారం యుఎన్ నిపుణులు తమ నివేదికలో వెల్లడించారు. రాజస్థాన్లో రెండు నుంచి ప్రతి ఐదుమందిలో పెళ్లైన వారు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారేనని పేర్కొంది. పిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేయడం కారణంగా తల్లి, శిశు మరణాల రేటు దుర్భరమైన స్థాయికి చేరిందని రాజస్థాన్లో ఏర్పాటు చేసిన వర్క్షాప్లో యుఎన్సీఈఎఫ్ చైల్డ్ ఆఫీసర్ సంజయ్ నిరాలా చెప్పారు.
బాల్యవివాహాల వల్ల రాజస్థాన్లో తల్లి మరణాల రేటు, శిశు మరణాల రేటు తీవ్ర స్థాయికి చేరిందని చెప్పారు. దేశంలో జార్ఖండ్ కూడా బాల్యవివాహాల రేటులో నమ్మదగిని స్థాయికి చేరిందన్నారు. నాణ్యత పరంగా విద్యను అందించడంలో కూడా రాజస్థాన్ మూడో స్థానానికి పడిపోయిందని సంజయ్ చెప్పారు.
బాల్యవివాహాల్లో రాజస్థాన్ది రెండో స్థానం
Published Fri, Oct 31 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM
Advertisement