సాక్షి, అమరావతి: చిత్తశుద్ధితో పని చేస్తే ఏదైనా సాధ్యమేనని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిరూపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టడం. బాల్య వివాహాలను అరికట్టి, బాలలను మంచి చదువులు చదివించాలన్న సీఎం వైఎస్ జగన్ సంకల్పానికి తగ్గట్టుగా పలు చర్యలు చేపట్టారు. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. బాల్య వివాహాలు చేస్తే ప్రభుత్వ పథకాలకు దూరమవుతారని తల్లిదండ్రుల్లో ప్రభుత్వం ఒక పక్క అవగాహన కల్సిస్తూనే, మరో పక్క బాల్య వివాహాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 160 బాల్య వివాహాలపై వివిధ మార్గాలు, 1098 హెల్ప్ లైన్‌కు ఫిర్యాదులు రాగా ఇందులో 159 వివాహాలను ప్రభుత్వం నివారించింది.
కేవలం కృష్ణా జిల్లాలో ఒక్క వివాహం మాత్రమే జరిగింది. ఈ బాల్య వివాహంపై ప్రభుత్వ యంత్రాంగం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసింది. బాల్య వివాహాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా పలు చర్యలు చేపట్టింది. సచివాలయాల స్థాయిలో సర్పంచ్ లేదా వార్డు కౌన్సిలర్ అధ్యక్షతన బాల్య వివాహాల నియంత్రణ, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో గ్రామ, వార్డు కార్యదర్శులు, రెవెన్యూ అధికారి, ఏఎన్‌ఎం, మహిళా పోలీస్, స్వయం సహాయక సంఘం సభ్యురాలిని సభ్యులుగా నియమించింది. ఈ కమిటీలు బాల్య వివాహాలు జరగకుండా చర్యలు చేపడుతున్నాయి.
ఏ గ్రామంలోనైనా బాల్య వివాహం జరిగితే సంబంధిత గ్రామ, వార్డు కార్యదర్శులను బాధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ తరచూ సమావేశమై బాల్య వివాహాల నియంత్రణ చట్టం అమలు, అందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలని ప్రభు త్వం ఆదేశించింది. వివాహ రిజి్రస్టేషన్లను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో పాటు బాలికలకు 18 ఏళ్లు నిండిన తర్వాత 21 ఏళ్ల అబ్బాయితో పెళ్లి చేస్తేనే వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద లబ్ధి చేకూరుతుందని వివరిస్తున్నారు.
ఈ పథకాలకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను ప్ర భుత్వం విధించింది. మధ్యలో బడి మానేసిన 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల బాలికలను ప్రభుత్వం తిరిగి పాఠశాలలు, కళాశాలల్లో చేరి్పస్తోంది. అలాగే ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలను సందర్శించినప్పుడు బాల్య వివాహాలు చేయకుండా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment