
సీఈవో మీనాకు ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌కళ్యాణ్, నందమూరి బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేశారు. సోమవారం సచివాలయంలో సీఈవో ముఖేష్ కుమార్‌మీనాను కలిసి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఆధారాలతో ఫిర్యాదు అందజేశారు.
ఈ నెల 13న కదిరి బహిరంగ సభలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఈ నెల 14న తెనాలి నియోజకవర్గంలో జనసేన సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఎన్నిక కోడ్‌కు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనాడు దినపత్రిక ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కథనాలు రాస్తోందని, దీనిపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహరరెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment