బాల్యవివాహాలు చేయాలని చూస్తే చట్టపరంగా తల్లిదండ్రులకు శిక్ష తప్పనిసరి అని తహశీల్దార్ రామకష్ణారెడ్డి,ఎంపీడీఓ భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు.
కే.బ్రాహ్మణపల్లి (కదిరి అర్బన్) : బాల్యవివాహాలు చేయాలని చూస్తే చట్టపరంగా తల్లిదండ్రులకు శిక్ష తప్పనిసరి అని తహశీల్దార్ రామకష్ణారెడ్డి,ఎంపీడీఓ భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కే. బ్రాహ్మణపల్లిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రజాసేవాసమాజ్ సహాకారంతో మంగళవారం బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
పలువురు వక్తలు మాట్లాడుతూ మండల పరిధిలోని దిగువపల్లి, మల్లయ్యగారిపల్లితండా, రెడ్డిపల్లితండా, ఎగుపల్లిగ్రామాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని కలెక్టర్‌కు ఫిర్యాదు అందిందన్నారు. అందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతుంటే 1098 నంబరుకు ఫోన్‌చేసి తెలపాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ చెన్నకష్ణ, ఐసీడీఎస్ పడమర సీడీపీఓ విజయకుమారి, పాఠశాల హెచ్‌ఎం నారాయణరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.