
వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రద్యుమ్న
చిత్తూరు కలెక్టరేట్: శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో బాల్య వివా హాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉం చాలని కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాళహస్తి ఆలయ అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా 13, 14వ తేదీల్లో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారని, బాల్య వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నందున ఆ రెండు రోజులు ఆలయ పరి«ధిలో నిఘాను మరింత పెంచాలని సూచించారు. ఇందుకోసం పోలీసులతోపాటు, అంగన్‌వాడీ కార్యకర్తులు, వెలుగు సిబ్బందిని వినియోగించుకోవా లని పేర్కొన్నారు. బాల్య వివాహాలను ముందుగానే గుర్తించి సంబందీకులకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు
శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లను చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించాలని, రాత్రుల్లో విద్యుత్ దీపకాంతులతో ఆలయం శోభాయమానంగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. తాగునీరు, ఆహారం, స్నానపు ఘట్టాలు, మరుగుదొడ్లు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వైద్య కేంద్రాలను ఏర్పాటుచేసి, భక్తులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. శ్రీకాళహస్తి పట్టణం పరిధిలోని రోడ్లను శుభ్రంగా ఉంచి, రాత్రింబవళ్లు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ అధికారులకు సూచించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అక్కడక్కడా సూచిక బోర్డులు, ప్రధాన కూడళ్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు.
అదనపు బస్సులు నడపండి
ముక్కంటీశుని బ్రహ్మోత్సవాలకు జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారని, అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అదనపు బస్సు సర్వీసులను కూడా నడపాలన్నారు. ఎక్కువగా వచ్చే ప్రైవేటు వాహనాల పార్కింగ్‌కు చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సూచించారు. స్వామివారి దర్శన క్యూలలో భక్తులకు అసౌకర్యం కలుగకుం డా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నపిల్లల తల్లులు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో శ్రీకాళహస్తి ఆలయ ఈఓ భ్రమరాంబ, పోలీసు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment