‘చిన్నారి పెళ్లికూతుళ్ల’ సమస్య పట్టదా? | Child rights activist Achutarao writes on child marriages | Sakshi
Sakshi News home page

‘చిన్నారి పెళ్లికూతుళ్ల’ సమస్య పట్టదా?

Published Thu, Mar 9 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

‘చిన్నారి పెళ్లికూతుళ్ల’ సమస్య పట్టదా?

‘చిన్నారి పెళ్లికూతుళ్ల’ సమస్య పట్టదా?

మహిళల్ని ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ ఆకాశానికి ఎత్తుతూ, పొగడ్త లతో ముంచేస్తూ, ఓ నాలుగు అవార్డులు, ఓ పది సభలు జరిపి సరిపెట్టుకుంటున్నారు.

మహిళల్ని ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ ఆకాశానికి ఎత్తుతూ, పొగడ్త లతో ముంచేస్తూ, ఓ నాలుగు అవార్డులు, ఓ పది సభలు జరిపి సరిపెట్టుకుంటున్నారు. కానీ చిన్నతనంలోనే పెళ్లిళ్ల బంధంతో పుస్తెలు మెడలో వేసుకుని జీవితం మొత్తాన్ని పురుష సమాజానికి బలి పెడుతున్న బాలికా వధువుల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల దృష్టికి వచ్చిన బాల్య వివాహాల సంఖ్య 2016లో 1350 ఉన్నా యంటే అవి ఎంత పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయో బోధపడుతుంది. ఇంత జరుగు తున్నా సంక్షేమ శాఖ అని పేరు పెట్టుకున్న స్త్రీ–శిశు సంక్షేమ శాఖకు నిధులు, నిర్వాహకులు ఉన్నప్పటికీ.. చిన్నారులు కోల్పోతున్న బాల్యం గురించిగానీ, వారి సంక్షేమం గురించిగానీ పట్టడం లేదు. కేవలం హైద రాబాద్‌లోనో, అమరావతిలోనో ఘనంగా స్త్రీల ఉత్స వాలను లక్షలు వెచ్చించి చేశామని అధికార, అధినాయక గణం ముందు డప్పు కొట్టుకుని సంతృప్తిపడుతూ మళ్లీ వచ్చే సంవత్సరమే కదా మాకు పని అని ఏసీ గదుల్లో సేద తీరుతున్నారు.

కేవలం హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతాల్లోనే ఈ 2017 జనవరి 14 నుంచి నేటి వరకూ బాలల హక్కుల సంఘం 11 బాల్య వివాహాలను నిరోధించిం దంటే, సమాజంలో బాల్య వివాహాల జోరును అంచనా వేయవచ్చు. ఈ మహిళా దినోత్సవం రోజున కూడా హైదరాబాద్‌లో 3 బాల్య వివాహాలు జరగడం శోచ నీయం. 11 నుంచి 16 ఏళ్ల అమ్మాయిలకు వారికంటే రెండింతల వయస్సు గల పుంగవులకు కట్టబెట్టి అమ్మాయి పెళ్లి చేశామని ఊరందరికీ భోజనాలు పెట్టి తల్లిదండ్రులు సరిపెట్టుకుంటున్నారు. కానీ వారి జీవి తాన్ని చేజేతులా నాశనం చేశామని గ్రహించడం లేదు. దారిద్య్రం, అవిద్యలో కొట్టుమిట్టాడుతున్న తల్లిదం డ్రులు ఒకవైపు.. తమ అమ్మాయిలు ప్రేమ అనే నూతిలో పడతారని, వివాహం అనే చదువులో తోసే తల్లిదం డ్రులు మరోవైపు. వీరందరికీ అవగాహన కల్పించి, బాలికలను బాల్య వివాహాల నుంచి రక్షించాల్సినవారు మొద్దునిద్ర పోతున్నారు.

బంగారు తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌లలో బాల్య వివాహాలు తీవ్రస్థాయిలో జరుగుతుంటే, స్వర్ణాంధ్రప్రదేశ్‌లో కర్నూలు, అనంత పురం, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు, విజ యనగరం జిల్లాల్లోని ప్రతి మండలంలో కనీసం ఎనిమిది గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతుంటే అమాత్యులకూ, అధికారులకూ చీమకుట్టినట్లయినా లేదు. బాల్య వివాహాలు ఆపకుండా, స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు, బాల్య వివాహ బాధితులకు అండగా నిలవకుండా స్త్రీ–శిశు సంక్షేమం మా ధ్యేయం.. వారిని ఉద్ధరిస్తామని ఉపన్యసించే అధికారులను, అధి నాయకులను, బాల్య వివాహాలు నిరోధిం చకుండా స్త్రీ జనోద్ధరణ ఎలా చేస్తారని నిలదీయాల్సి ఉంది.


- అచ్యుతరావు

గౌరవాధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం ‘ మొబైల్‌ : 93910 24242
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement