బాల్య వివాహాలపై ర్యాలీలో అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు
సత్తెనపల్లి: బాల్య వివాహాల నివారణపై సోమవారం పట్టణంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ మాణిక్యరావు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించాలని, అలా కాకుండా పెళ్లంటే 100కు ఫోన్ చేయాలన్నారు. తహసీల్దార్ జి.సుజాత మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్నారు.
పది తర్వాత పెళ్లి కాదని, ఇంటర్‌లో చేరాలని యువతకు సూచించారు. ఎంఈవో ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. చిన్నతనంలో వివాహాలు చేయడం వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని, దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ స్వర్ణకుమారి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment