తగ్గిన బాల్య వివాహాలు | Child Marriages Drop in India: UNICEF | Sakshi
Sakshi News home page

తగ్గిన బాల్య వివాహాలు

Published Wed, Nov 20 2019 8:10 AM | Last Updated on Wed, Nov 20 2019 8:10 AM

Child Marriages Drop in India: UNICEF - Sakshi

బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ భారత్‌లో విద్యార్థుల ర్యాలీ (ఫైల్‌)

ఐక్యరాజ్యసమితి: పాతిక సంవత్సరాలుగా భారత్‌లో బాల్య వివాహాల సంఖ్య తగ్గిందని ఐక్య రాజ్యసమితి పేర్కొంది. భారత్‌లాంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో బాల్య వివాహాల సంఖ్య తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా బాల్యవివాహాల శాతం భారీగా తగ్గిందని తెలిపింది. ఈ మేరకు ఐరాస చిన్నారుల వేదిక ‘యూనిసెఫ్‌’ ఒక అధ్యయనాన్ని ప్రకటించింది. గత 3 దశాబ్దాలుగా చిన్నారుల జీవితాలు ఎంతో మెరుగైనా పేద చిన్నారులకు ఆ ప్రయోజనాలు అందేందుకు కృషి చేయాల్సి ఉందని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు.

బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టడానికి ఆర్థికాభివృద్ధి, మహిళల సాధికారత ప్రధాన కారణాలన్నారు. భారత్‌ను ఉదహరిస్తూ.. చట్టపర సంస్కరణలు, బాలికా సాధికారతా పథకాలు బాల్య వివాహాలు తగ్గడానికి కారణమవుతాయన్నారు. భారత్‌లో చట్టపరమైన వయస్సు వచ్చే వరకు బాలికలకు వివాహం చేయకుంటే ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేలా పథకాలున్నాయని అధ్యయనం గుర్తు చేసింది. గత పాతికేళ్లలో దక్షిణ ఆసియాలో బాల్య వివాహాలు 59 నుంచి 30 శాతానికి తగ్గినట్టు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement