
అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన కొత్త సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరం తొలిరోజు జన్మించిన శిశువుల సంఖ్యలో ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. 2018 జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3,86,000 మంది పిల్లలు జన్మించినట్లు యూనైటెడ్ నేషన్స్ చిల్డన్స్ ఫండ్(యూనిసెఫ్) తన నివేదికలో వెల్లడించింది. ఇండియాలో జనవరి 1న దాదాపుగా 69,070 మంది పిల్లలు జన్మించారని యూనిసెఫ్ తెలిపింది. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న జననాలలో సగానికిపైగా తొమ్మిది దేశాల్లోనే ఉన్నట్లు యూనిసెఫ్ నివేదిక స్పష్టం చేసింది.
ఇండియా తర్వాత చైనా(44,760), నైజీరియా(20,280), పాకిస్తాన్(14,910), ఇండోనేషియా(13,370), అమెరికా(11,280), కాంగో(9,400), ఇతియోపియా(9,020), బంగ్లాదేశ్(8,370)లు వరుసగా ఉన్నాయి.
అంతేకాక 90% జననాలు వెనుకబడిన ప్రాంతాల్లో జరిగినట్లు ఓ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. జనవరి 1వ తేదీన జన్మించిన బిడ్డకు బెంగళూరు నగర్ మేయర్ సంపత్ కుమార్ రూ. 5 లక్షలు ఇస్తామని చేసిన ప్రకటన తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment