కంచిలి: జాతీయ బాల్య వివాహాల చట్టంలో వయస్సును సవరించడం కోసం ప్రవేశపెట్టనున్న బిల్లుపై భారత ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించనున్న చర్చకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 8 మందిని ఎంపిక చేశారు. అందులో కంచిలి మండలం తలతంపర పంచాయతీ సర్పంచ్ డాక్టర్ దొళాయి జగబంధును కూడా ఎంపిక చేస్తూ అమరావతి నుంచి పిలుపు వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఒక జెడ్పీ చైర్మన్, ఒక ఎంపీపీ, ఒక జెడ్పీటీసీ, ఐదుగురును సర్పంచ్‌లతో పీఎం మోదీ ఆన్‌లైన్‌లో ఈ విషయమై చర్చిస్తారని, ఎంపిక చేసిన 8 మంది ప్రజాప్రతినిధులకు సీఎంఓ కార్యాలయం నుంచి సమాచారం అందించినట్లు తలతంపర సర్పంచ్ డాక్టర్ జగబంధు శుక్రవారం సాయంత్రం స్థానిక విలేకరులకు తెలిపారు. అన్ని రాష్ట్రాల నుంచి ఈ విధమైన కమిటీలను నియమించి, అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఈ నెల 31వ తేదీన అమరావతిలో ఈ కార్యక్రమం ఉంటుందని, తప్పనిసరిగా హాజరు కావాలని సమాచారం వచ్చినట్లు తెలిపారు.
(చదవండి: దొంగ సొత్తు చెరువులో ఉందా..?)
Comments
Please login to add a commentAdd a comment