అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసు వద్ద మాజీ సైనికులు సోమవారం ఆందోళనకు దిగారు. మదనపల్లె ప్రాంతంలోని 150 మంది మాజీ సైనికులకు స్థలాలు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన రెవెన్యూ అధికారులు అందుకు సంబంధించి పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని సంఘం నాయకుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు తెలిపారు. ఎన్ని విజ్ఞాపనలు అందజేసినా, ఎన్నిసార్లు ఆందోళనలకు దిగినా స్పందించలేదని ఆరోపించారు. ఇందుకు నిరసనగా సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు వివరించారు. సమస్య పరిష్కారమయ్యేదాకా దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు.
మదనపల్లెలో మాజీ సైనికుని నిరాహార దీక్ష
Published Mon, May 30 2016 12:15 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM
Advertisement
Advertisement