former soldier
-
వీరుడి విరమణ
అతనొక మాజీ సైనికుడు. ఇప్పుడంటే మాజీ అయ్యాడు కానీ, అతని పేరు చెబితేనే శత్రువులకు హడల్. చిన్నప్పుడు బాగా బలహీనంగా ఉండేవాడు. కానీ, అతనికున్న సాహసగుణం వల్ల, ధైర్యమనే లక్షణం వల్ల సిపాయిగా చేరాలన్న తన కోరికను ఎంతో కష్టంమీద నెరవేర్చుకున్నాడు. ఆ సాహసం వల్ల సిపాయి స్థానం నుండి సైనికాధికారి స్థాయికి చేరుకోగలిగాడు. గెలుస్తామనే ఆశ ఏమాత్రం లేని అనేక పోరాటాల్లో ఆయన తన సైన్యాన్ని నేర్పుగా ముందుకు నడిపించి, ఘన విజయాలు సాధించాడు. శత్రువులు దొంగదెబ్బ తీయడం వల్ల ఒక యుద్ధంలో కుడిచేతిని, మరొక యుద్ధంలో ఎడమ కంటిని కోల్పోయాడు. అలాగే పోరాడి విజయాన్ని సాధించాడు. అతను చేసిన ఈ యుద్ధాన్ని అందరూ కథలు కథలుగా చెప్పుకునేవారు. అతను ఉద్యోగ విరమణ చేయవలసి వచ్చింది. ఉద్యోగ బాధ్యతల నుంచి అధికారికంగా అయితే తప్పుకున్నాడు కానీ, మానసికంగా మాత్రం ఎప్పటికీ తప్పుకోదలచుకోలేదు. ‘ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకుని హాయిగా విశ్రాంతి తీసుకోక ఎందుకు శ్రమపడతావు?’ అని ఎందరు ఎన్ని విధాలుగా చెప్పి చూసినా వినలేదతను. ‘కన్నుతోనూ, చేతితోనూ చేసేదే యుద్ధం కాదు. యుద్ధానికి అవసరమైనది మస్తిష్కం. అంతకుమించి, సాహసోపేతమైన దృఢచిత్తం కావాలి. నాలో పోరాట పటిమ ఎప్పటికీ చావదు. సాహసం చేయాలన్న నా మనసు ఊరకనే కూర్చోదు. అందువల్ల నేను ఉద్యోగం నుంచి విరమిస్తేనేం, ధైర్య సాహసాలు గల యువకులకు ప్రేరణ, ప్రోత్సాహం కలిగించే కథలు చెబుతాను, వారికి యుద్ధ తంత్రం నేర్పుతాను. నాలాంటి మరికొంత మంది సైనికులను తయారు చేస్తాను. నా ఊపిరి ఉన్నంత కాలమూ నాలోని సైనికుడు చావడు. పరిస్థితులతో యుద్ధం చేస్తూనే ఉంటాడు’ అని చెప్పటమే కాదు, అలాగే జీవించాడు కూడా. నీతి ఏమిటంటే.. వయసుకు మాత్రమే విరమణ ఉంటుంది. మనసుకు కాదు. – డి.వి.ఆర్. -
నెత్తురోడిన అమెరికా
థౌజండ్ ఓక్స్: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని థౌజండ్ ఓక్స్ నగరంలో ఉన్న బార్లోకి బుధవారం ప్రవేశించిన ఓ మాజీ సైనికుడు సెమీఆటోమేటిక్ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమాయకుల్ని పొట్టనపెట్టుకున్న అనంతరం సదరు దుండగుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై వెంచుర కౌంటీ షెరిఫ్ జియోఫ్ డీన్ మాట్లాడుతూ.. ‘బోర్డర్‌లైన్ బార్ అండ్ గ్రిల్లో ప్రతి బుధవారం కాలేజ్ కౌంటీ నైట్ పేరుతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు వందలాది మంది కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. ఇంతలో ఓ వ్యక్తి రాత్రి 11.30(స్థానిక కాలమానం) గంటలకు బార్లోకి ప్రవేశించాడు. వస్తూనే నాలుగువైపులా స్మోక్ బాంబులను విసిరాడు. విద్యార్థులు, ఇతర కస్టమర్లు పొగకు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా తన సెమీఆటోమేటిక్ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు. ఇలా 30 రౌండ్ల పాటు కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీస్ అధికారి రాన్ హెలుస్.. లోపల చిక్కుకున్న ప్రజలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపారు. ఈ ఊచకోతకు పాల్పడిన వ్యక్తిని మాజీ మెరైన్ ఇయాన్ డేవిడ్ లాంగ్(28)గా గుర్తించామని జియోఫ్ డీన్ వెల్లడించారు. 12 మందిని పొట్టనపెట్టుకున్న అనంతరం ఇయాన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఇయాన్‌పై తీవ్రమైన నేరాభియోగాలు ఏవీ లేవనీ, చిన్నచిన్న కేసులు ఉన్నాయన్నారు. యూఎస్ మెరైన్ కోర్లో 2008–13 మధ్యకాలంలో ఇయాన్ పనిచేశాడన్నారు. ఇందులో భాగంగా 2010 నవంబర్ నుంచి 2011 జూన్ వరకూ అఫ్గానిస్తాన్‌లో విధులు నిర్వర్తించాడని పేర్కొన్నారు. అయితే ఈ దాడి ఎందుకు చేశారన్న విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. యుద్ధవాతావరణంలో ఉండే వ్యక్తులు ఎదుర్కొనే పోస్ట్ ట్రుమాటిక్ స్ట్రెస్ డిజార్డర్(పీటీఎస్డీ)తో ఇయాన్ ఇబ్బంది పడుతున్నాడన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అతడిని అదుపు చేయడానికి కుటుంబ సభ్యులు ఏకంగా పోలీసులను పిలవాల్సి వచ్చిందన్నారు. కాగా, ఈ దాడి సందర్భంగా పలువురు యువతీయువకులు కిటికీలు అద్దాలు పగులగొట్టి, బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారని డీన్ పేర్కొన్నారు. మరికొందరు బాత్రూముల్లో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామన్నారు. రెండువారాల్లో రెండోసారి అమెరికాలో రెండు వారాల వ్యవధిలో ఇలాంటి దాడి జరగడం ఇది రెండోసారి. పిట్స్‌బర్గ్‌లోని యూదు ప్రార్థనామందిరంపై జరిగిన విద్వేషదాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. కాగా, థౌజండ్ ఓక్స్ కాల్పుల ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కార్ల్ ఎడ్గర్(24) మీడియాతో మాట్లాడుతూ..‘20 మంది స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి ఇక్కడి బోర్డర్‌లైన్ బార్‌కు వచ్చాను. అనంతరం కొద్దిసేపటికే కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రాణాలు రక్షించుకోవడానికి మేమంతా తలోదిక్కు పరిగెత్తాం. ఇప్పుడు నా స్నేహితులను ఫోన్ చేస్తే కలవడం లేదు. ఈ ఘటన అనంతరం వాళ్లంతా తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకుని ఉండొచ్చు. గతేడాది లాస్‌ఏంజెలిస్‌లో ‘రూట్ 91’ సంగీత విభావరిపై జరిగిన కాల్పుల నుంచి నేను, నా స్నేహితులు తప్పించుకోగలిగాం. దాన్నుంచే తప్పించుకోగలిగినప్పడు ఈ కాల్పుల నుంచి వాళ్లు సురక్షితంగా బయటపడి ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. లాస్‌ఏంజెలిస్‌లోని సంగీత విభావరిపై ఓ ఉన్మాది దాడిలో 57 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. -
మాజీ సైనికుడిపై దాడి
వేపగుంట(గోపాలపట్నం) : ఉత్సవంలో తన సోదరుడి కుమారుడిపై దాడి చేస్తున్నారేంటని అడిగిన మాజీ సైనికుడిపై ఓ వ్యక్తి ఇనుప రాడ్డులో మోదాడు. ఈ ఘటనలో ఆయన తీవ్రగాయాలపాలయ్యాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాలివి. నరవ గ్రామంలో ఈ నెల 12న పైడితల్లమ్మ ఉత్సవంలో ఊరేగింపు జరుగుతుండగా, భాస్కర్ అనే యువకుడిపై కొందరు వివాదా నికి దిగి దాడి చేశారు. ఇదేంటని భాస్కర్ పెదనాన్న చింతల రామారావు(ఆర్మీ మాజీ ఉద్యోగి) ప్రశ్నించడంతో ఆయనపైనా దాడికి దిగారు. వరహాలరావు అనే వ్యక్తి రాడ్డుతో ఆయన తలపై మోదడంతో తీవ్ర గాయాలయ్యాయి. వివాదానికి కారణమైన వారిలో వరహాలరావుతో పాటు కోటేశ్వరరావు, శ్రీను, శివ అనే వ్యక్తులు ఉన్నట్లు రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి జరిగిన రోజు తనను తీవ్ర భయాందోళనకు గురి చేశారని ఆందోళన వెలిబుచ్చారు. -
మంత్రాలయ వచ్చి నేను ఆత్మహత్య చేసుకోవాలా?
సాక్షి, సతారా : 'న్యాయం కోసం ప్రతి ఒక్క వృద్ధుడు మంత్రాలయ వచ్చి ఆత్మహత్యకు పాల్పడాల్సిందేనా?' ఈ ప్రశ్న వేసింది చంద్రశేఖర్ జంగం అనే వ్యక్తి. ఆయన వయసు ఇప్పుడు 98 ఏళ్లు. అయితే, ఆయన సామాన్యుడేం కాదు. గొప్ప పోరాటయోధుడు.. యుద్ధ వీరుడు. భారత ఆర్మీలో సైనికుడిగా విశిష్ట సేవలు అందించాడు. 1962లో చైనాతో, 1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాల్లో ఆయన పాల్గొన్నారు. 1971 సుబేదార్ హోదాలో పదవీ విరమణ పొందారు. అయితే, ఒకప్పుడు ఈ దేశం కోసం పోరాడి చివరి మజిలీకి చేరిన సమయంలో ఆయన నోటి నుంచి ఆత్మహత్య మాట ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? సమస్య షరా మాములే. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు టోకరా పెట్టింది. సైనికులకు కేటాయించే భూమిని ఆయనకు కేటాయించలేదు. రెండు సార్లు ఆయన యుద్ధం నిలిచి గెలిచాడుగానీ, తన హక్కుల కోసం మాత్రం సొంత దేశంలోనే 54 ఏళ్లుగా ఓడిపోతూనే ఉన్నారు. చివరకు తనకు న్యాయం జరగడం కోసం మంత్రాలయ వచ్చి ఆత్మహత్యకు పాల్పడమంటారా అని ఆవేదనతో ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. చంద్రశేఖర్ జంగం తొలిసారిగా 1943లో భారత ఆర్మీలో చేరారు. ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్ కింద యుద్ధ ట్యాంకుల విభాగంలో పనిచేశారు. 1962లో ఇండో-చైనా, 1965 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. రక్ష మెడల్ కూడా స్వీకరించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సైనికులు స్థలం కొనుక్కునే అవకాశం ఉండటంతో 1964లో 15.5 గుంటల భూమిని సతారాలో కొనుగోలుచేశారు. అందుకు రూ.3,547లు చెల్లించారు. ఇప్పటికీ ఆ రశీదు కూడా ఉంది. అయితే, ఆ భూమిని మాత్రం చంద్రశేకర్‌కు బదిలీ చేయలేదు. ఆ ప్రొసీజర్ కూడా ముందుకు తీసుకెళ్లలేదు. దీంతో ఆయన 1968 నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 1971లో ఆయన పదవీ విరమణ పొందాక కూడా ప్రతివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగారు. ఇక ఆ పనిపూర్తికాకపోవడంతో కనీసం తన డబ్బు తనకైనా తిరిగి ఇవ్వాలని 1977 నుంచి అడగడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ఆ పని కూడా జరగలేదు. 1983వరకు పోరాడిన వాళ్లు తిరిగి ఆశ వదులుకున్నారు. మళ్లీ చిగురించిన ఆశ సతారాలోని రహీమత్‌పూర్‌లో ఉంటున్న చంద్రశేఖర్‌కు ముగ్గురు కూతుర్లు.. ఇద్దరు కుమారులు. కుమారుల్లో ఒకరు తమకు ప్రభుత్వం చేసిన అన్యాయంపై గట్టిగా పోరాటం చేయాలనుకున్నారు. ఒక ఎన్జీవో, అఖిల్ భారతీయ వీర్షవ్య లింగాయత్ మహాసంఘ(ఏబీవీఎల్‌ఎం) సహాయంతో ఆర్టీఐ ద్వారా కొనుగోలు చేసిన భూమి వివరాలు రాబట్టాడు. అయితే, కొన్ని రికార్డులు లభించగా కొన్ని మాత్రం మాయమయ్యాయి. 15.5గుంటల భూమిని వారు కొనుగోలు చేయగా అందులో రోడ్డు విస్తరణకోసం దాదాపు సగానికిపైగా భూమి పోయి ఇప్పుడు 5.5గుంటలు మాత్రం మిగిలినట్లు తెలిసింది. దీంతో తమకు ఇక భూమి దక్కదని నిర్ణయించుకొని వేరే చోట అయినా కనీసం భూమి కేటాయించాలని కోరారు. గత వారం కుటుంబ సభ్యులు ఏబీవీఎల్‌ఎం చీఫ్ డాక్టర్ విజయ్ జంగమ్‌తో కలిసి మహారాష్ట్ర విధాన భవన్‌కు వెళ్లగా అక్కడి రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్‌కు ఫైల్ పంపించాలని ఆదేశించారు. అయితే, ఈ విషయంపై ఓ సీనియర్ కలెక్టర్ స్పందించి ప్రభుత్వం తలుచుకుంటే అది పెద్ద విషయం కాకపోయినా ఎందుకో ప్రతిసారి రివ్యూల పేరిట వాయిదాలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. -
సకుటుంబ సభూమేత!
అర్ధవీడు: భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా భూపంపిణీ చేస్తుంది.వారి అర్హతల ఆధారంగా రెండు నుంచి రెండున్నర ఎకరాల భూమి పంపిణీ చేస్తారు.మండలంలోని పాపినేనిపల్లెకు చెందిన ఓ మాజీ సైనికోద్యోగి తన పేరు, తల్లి, భార్య,అక్క, కర్నూలు జిల్లాలో ఉన్న బంధువులకు 48 ఎకరాల ఆసైన్డ్ భూమి గుట్టుచప్పుడు కాకుండా దక్కించుకున్నారు. అదే గ్రామానికి చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి సహచట్టం ద్వారా సమాచారం సేకరించడంతో గుట్టురట్టయింది. అధికారుల అండదండలు పుష్కలం పాపినేనిపల్లె గ్రామానికి చెందిన మాజీ సైనికోద్యోగి కొత్తూరు వెంకటేశ్వరరెడ్డికి అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కోట్ల విలువైన భూమిని 2006, 2007 సంవత్సరాల్లో ఏకంగా 48 ఎకరాల అసైన్డ్ భూమికి పట్టాలు పొందాడు. పాపినేనిపల్లె ఇలాఖాలోని 96/3, 797/5, 827/2, 797/3, 798/4, 827/1, 45/1సి, 45/1డి, 45/1ఎ, 45/1బి, 26/3, 861/2, 114/1, 796/1, 796/2 సర్వే నంబర్లలో ఆయన అక్రమ సామ్రాజ్యం విస్తరించి ఉంది. వెంకటేశ్వరరెడ్డి తన భార్య సిరివెళ్ల లక్ష్మీదేవిపై రెండు పట్టాలు, కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన తన బంధువులు గౌరెడ్డి పెద్ద రంగమ్మ పేరుతో రెండు పట్టాలు, గౌరెడ్డి తిమ్మారెడ్డి, గైరెడ్డి చిన్న రంగమ్మ, కర్నూలు జిల్లా సిరివెళ్లకు చెందిన వల్లెల వెంకటమ్మ, కోవెలకుంట్లకు చెందిన గౌరెడ్డి మహాదేవి పేర్లపై ఐదేసి ఎకరాలకు పట్టాలు తెచ్చాడు. చివరకు ప్రభుత్వం నిషేధించిన 841, 842, 862 సర్వే నంబర్లలోని భూమిని ఆక్రమించాడు. తల్లిదండ్రుల ఇంటి పేర్లు సైతం మార్చి పట్టాలు కైవసం చేసుకున్నాడు. ఇదంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరిగిందని ప్రజలు విమర్శిస్తున్నారు. నిబంధనలకు నీళ్లు అసైన్డ్ భూములకు సంబంధించి అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలారు. వెంకటేశ్వరరెడ్డి ఇచ్చిన కాసులకు కక్కుర్తి పడి ఏకంగా 48 ఎకరాలకు అక్రమంగా పట్టాలు తెచ్చుకున్నాడు. వెంకటేశ్వరరెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్, ఎస్ఐకు మాజీ సైనికోద్యోగి ఎన్.రంగారెడ్డి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బినామీ పేర్లతో పట్టాలు పొందిన వెంకటేశ్వరరెడ్డిపై చర్యలు తీసుకొని అర్హులైన నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. విచారించి చర్యలు తీసుకుంటాం: జీఎస్ఎం ప్రసాద్ వెంకటేశ్వరరెడ్డి అనే మాజీ సైనికోద్యోగి అసైన్డ్ భూములకు అక్రమంగా పట్టాలు పుట్టించుకున్నట్లు నాకు ఇటీవల ఫిర్యాదు అందింది. గత అధికారుల హయాంలో అతడికి పట్టాలు వచ్చాయి. భూములు పరిశీలించి విచారించి చర్యలు తీసుకుంటాం.ఆయన మాజీ సైనికోద్యోగి. తన కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో సుమారు 50 ఎకరాల ఎసైన్డ్ భూములకు పట్టాలు తెచ్చుకున్నాడు. ఇందుకు రెవెన్యూ అధికారులు ఆయనకు సహకారం అందించారు. కాసులకు కక్కుర్తి పడి పెట్టమన్న చోట కళ్లు మూసుకుని సంతకం పెట్టేశారు. చివరకు పొరుగు జిల్లాలో ఉన్న తన బంధువుల పేర్లతో కూడా పట్టాలు తెచ్చుకున్నాడంటే అతడి పైరవీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరో సైనికోద్యోగి సహచట్టం ద్వారా అతడి అక్రమల చిట్టాను విప్పడంతో విషయం గుప్పుమంది. -
విమానాశ్రయంలో కాల్పులు
• అమెరికాలోని ఫ్లోరిడాలో మాజీ సైనికుడి దుశ్చర్య • ఐదుగురి మృతి..8 మందికి గాయాలు ఫ్లోరిడా: అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్–హాలీవుడ్ విమానాశ్రయంలో మాజీ సైనికుడు శుక్రవారం కాల్పులకు తెగబడ్డాడు. బ్యాగుల తనిఖీ ప్రాంతంలో విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 26 ఏళ్ల ఆ మాజీ సైనికుడిని ఎస్టెబన్ శాంటియాగోగా గుర్తించారు. విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన శాంటియాగో తనిఖీల తర్వాత తన బ్యాగులోనుంచి అన్లోడ్ తుపాకీని బయటకు తీసి బాత్రూములోకెళ్లి లోడ్ చేసుకుని తిరిగివచ్చి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఉలిక్కిపడిన ప్రయాణికులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. రంగంలోకి దిగిన పోలీసులు మాజీ సైనికుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతను కాల్పులకు తెగబడడం వెనకున్న ఉద్దేశమేంటో వెంటనే వెల్లడవలేదు. ఘటన నేపథ్యంలో విమానాశ్రయంలోని అన్ని సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాస్కా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో పనిచేసిన శాంటియాగో పనితీరు సరిగా లేనందున ఏడాదిక్రితం తొలగించారు. శాంటియాగో తొమ్మిదేళ్లపాటు సేవలందించాడని, ఇందులో పదినెలలపాటు ఇరాక్‌లో పనిచేసినట్టు సైన్యం తెలిపింది. శాంటియాగో మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇటీవల చికిత్స తీసుకున్నట్టు అతని సోదరుడు తెలిపినట్టు సమాచారం. ఐఎస్ఐఎస్పై పోరు చేయాలంటూ తనను అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ ఒత్తిడి చేస్తోందని అతను ఎఫ్బీఐతో చెప్పినట్టు తెలుస్తోంది. -
మదనపల్లెలో మాజీ సైనికుని నిరాహార దీక్ష
అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసు వద్ద మాజీ సైనికులు సోమవారం ఆందోళనకు దిగారు. మదనపల్లె ప్రాంతంలోని 150 మంది మాజీ సైనికులకు స్థలాలు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన రెవెన్యూ అధికారులు అందుకు సంబంధించి పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని సంఘం నాయకుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు తెలిపారు. ఎన్ని విజ్ఞాపనలు అందజేసినా, ఎన్నిసార్లు ఆందోళనలకు దిగినా స్పందించలేదని ఆరోపించారు. ఇందుకు నిరసనగా సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు వివరించారు. సమస్య పరిష్కారమయ్యేదాకా దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. -
మాజీ సైనికుడి ఇంట్లో చోరీ
♦ 7 తులాల బంగారు ఆభరణాలు, రూ.90 వేలు అపహరణ ♦ పక్క ఇంటి తాళాలు పగులగొట్టి ఏమీ దొరక్క వెళ్లిపోయిన వైనం నల్లబండ బజారు (గిద్దలూరు రూరల్) : పట్టణంలోని నల్లబండ బజారు సెయింట్‌పాల్స్ పాఠశాల వీధిలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. మాజీ సైనికుడు ఏరువా లింగారెడ్డి ఇంట్లో 7 తులాల బంగారు ఆభరణాలు, రూ.90 వేల నగదును అపహరించుకెళ్లారు. పక్కనే ఉన్న తాపీమేస్త్రీ షేక్ ఖాదర్‌వలి ఇంటి తాళాలు పగుల గొట్టిన దొంగలు బీరువా, కబోర్డ్స్ తెరచి వస్తువులను చెల్లాచెదురు చేశారు. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో వెళ్లిపోయారు. అందిన వివరాల మేరకు.. ఏరువా లింగారెడ్డి తన ఇంటికి తాళాలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి పైఅంతస్థులో నిద్రిస్తున్నారు. అది గమనించిన దొంగలు రాత్రి సమయంలో కింద గృహంలోని త లుపు తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువా తెరచి అందులోని రెండు ఉంగరాలు, రెండు జతల కమ్మలు, తాళిబొట్టు, బంగారు గొలుసు, బంగారు ఆభరణాలు అపహరించారు. పక్క ఇంటి యజమాని ఖాదర్‌వలి తన కుటుంబ సభ్యులతో ఊరికెళ్లగా దొంగలు తాళాలు పగులగొట్టి బీరువా, కబోర్డ్స్ వెతికారు. అక్కడ వారికి ఎటువంటి విలువైన వస్తువులు లభించకపోవడంతో వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న సీఐ ఎండీ ఫిరోజ్ బుధవారం ఉదయం సంఘటన స్థలాలకు వెళ్లి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బాధితుల వద్ద నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీఐ వెంట ఏఎస్సై రఫీ, సీఐ రైటర్ ఉదయ్, సిబ్బంది ఉన్నారు. -
కూతురిని హత్యచేసిన తండ్రికి డబుల్ యావజ్జీవం
చెన్నై: కన్నకూతురిపైనే లైంగిక దాడికి పాల్పడి ఆమె గర్భవతి కావడంతో హత్య చేసిన మాజీ సైనికుడికి రెండు యావజ్జీవ శిక్షలతో పాటు మరో 27 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా అరుమలై అంబలకడైకి చెందిన బ్రూస్‌వెల్ట్ (48) మాజీ సైనికుడు. మొదటి భార్య చనిపోవడంతో ఐడా సెల్వకుమారిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తె, పదో తరగతి విద్యార్థిని షెర్లీ జాస్మిన్ (16) వీరితోనే కలసి ఉండేది. అయితే 2010 మే 29న జాస్మిన్ ఇంట్లోనే నీటితొట్టెలో శవమై కనిపించింది. పోస్టుమార్టంలో ఆమె ఐదు నెలల గర్భవతి అని తేలడంతో.. అనుమానంతో బ్రూస్వెల్ట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. కుమార్తెపైనే బ్రూస్‌వెల్ట్ లైంగికదాడికి పాల్పడటంతో ఆమె నెలతిప్పింది. విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని బ్రూస్‌వెల్ట్ కుమార్తెను హత్య చేసి నీటితొట్టిలో పడేశాడు. నాగర్‌కోవిల్ మహిళా కోర్టు న్యాయమూర్తి ముత్తు శారద 33 మంది సాక్షులను విచారించి.. బ్రూస్వెల్ట్కు రెండు యావజ్జీవ శిక్షలు, మరో 27 ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. బలాత్కారం చేసిన నేరానికి ఒక యావజ్జీవం, హత్యానేరానికి మరో యావజ్జీవ శిక్ష, కుమార్తెపై లైంగికదాడికి పాల్పడిన నేరానికి పదేళ్ల జైలు, సాక్ష్యాలను రూపుమాపిన నేరానికి 7 ఏళ్ల జైలు శిక్ష, కుమార్తె గర్భంలోని శిశువును హత్యచేసిన నేరానికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు. -
నా భూమిని కాజేశారు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘భారత సైన్యంలో పనిచేసినందుకు ప్రభుత్వం నాకు భూమి ఇచ్చింది. సాగు చేసుకునేందుకు ఆ భూమిలోకి వెళ్తే ప్రభుత్వ మాజీ ఉద్యోగి ఒకరు తనదంటున్నాడు. అదేంటని అడిగితే రెవెన్యూ అధికారులు ఇచ్చారంటూ నకిలీ ఆధారాలు చూపిస్తున్నాడు. నాకు ఇచ్చిన భూమి వివరాలు తీసుకుని రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే వారినుంచి సమాధానం లేదు. నా భూమిని నాకు ఇప్పించండి’ అంటూ త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు కొమ్ముల ప్రకాశరావు కలెక్టర్ విజయకుమార్‌ను వేడుకున్నారు. స్థానిక ప్రకాశం భవన్ ఆవరణలోని ఓపెన్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో కలెక్టర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. 1986లో వెల్లంపల్లిలో ప్రభుత్వం తనకు 2.52 ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. ఆ భూమిని ఓ మాజీ ఉద్యోగికి రెవెన్యూ అధికారులు కట్టబెట్టారన్నారు. న్యాయం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు. రచ్చబండలో రేషన్‌కార్డులు రాలేదు... రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నా రేషన్ కార్డులు రాలేదని సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోని క్రాంతినగర్‌కు చెందిన పలువురు మత్స్యకారులు వాపోయారు. రెండు విడతలు జరిగిన రచ్చబండలో అర్జీలిస్తే రేషన్‌కార్డులు ఇవ్వలేదన్నారు. దానివల్ల అనేక పథకాలకు దూరమవుతున్నామని, కార్డులు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమోషన్ ఇవ్వడం లేదు... ఇరవైనాలుగేళ్ల నుంచి పనిచేస్తున్న తనకు ప్రమోషన్ ఇవ్వడంలేదని చీరాల మండలం రామకృష్ణాపురం గ్రామ పంచాయతీ రికార్డు అసిస్టెంట్ జీవీఎస్ ప్రసాదరావు వాపోయారు. న్యాయం కోసం గత ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజాదర్బార్‌లో అర్జీ ఇస్తున్నట్లు చెప్పారు. మంచినీరు సరఫరా చేయాలి... ఒంగోలు సమీపంలోని పేర్నమిట్టలో సర్వే నంబర్ 80లో నివసిస్తున్న తమకు మంచినీరు సరఫరా చేయాలని సుమారు 250 కుటుంబాల వారు కలెక్టర్ విజయకుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన.. అక్కడుంటున్న వారందరికీ వెంటనే మంచినీటి సౌకర్యం కల్పించాలని కార్పొరేషన్ కమిషనర్ విజయలక్ష్మిని ఆదేశించారు. 1/బీ అడంగల్‌లో పేరు చేర్చడం లేదు... తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని 1/బీ అడంగల్‌లో చేర్చకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామానికి చెందిన పాటిబండ్ల చంద్రమౌలి వాపోయాడు. సర్వే నంబర్ 193లో 3.50 ఎకరాల భూమిలో తన వాటా భూమి పంపకం జరిగిందని, కానీ, తహసీల్దార్ కార్యాలయంలో 1/బీ అడంగల్‌లో పేర్చు మార్చడం లేదని ఫిర్యాదు చేశాడు. హమాలీ కూలి రేట్లు పెంచాలి... హమాలీ కూలి రేట్లు పెంచాలని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ హమాలీల యూనియన్ జిల్లా కార్యదర్శి సీహెచ్ మజుందార్ కోరారు. హమాలీ కూలి రేట్లు 6 నుంచి 16 రూపాయలకు పెంచాలని, ఎఫ్‌సీఐలో అమలవుతున్న విధంగా డీపీఎస్ పద్ధతి వర్తింపజేయాలని విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బ్యాంకు లింకేజీ మినహాయింపు ఇవ్వాలి బీసీ ఫెడరేషన్ సొసైటీలకు సంబంధించి లబ్ధిదారుల వయో పరిమితి, బ్యాంకు లింకేజీల్లో మినహాయింపు ఉత్తర్వులు అమలు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. 15 మంది సభ్యులు కలిగిన ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునే గడువు పెంచాలన్నారు. హెచ్చరిక బోర్డు తొలగించి సాగు చేస్తున్నారు.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించి మరీ సాగుచేస్తున్నారని ఐదుగురు వీఆర్వోలు కలెక్టర్ ఎదుట వాపోయారు. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో తమకు 5 సెంట్ల చొప్పున భూమి కేటాయించారన్నారు. నీటివసతి లేకపోవడంతో ఆ భూమిని రైతులకు లీజుకిస్తే కొంతమంది ఆక్రమించుకున్నారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ తొలగించి మరీ సాగు చేస్తున్నారని వివరించారు. తాతల పేరు చెప్పుకుని పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందారు.. టంగుటూరు మండలం వెలగపూడిలోని ప్రభుత్వ భూమికి తాతల పేర్లు చెప్పుకుని అక్రమంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందారని అనంతవరం సర్పంచ్ కే సుందరరావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 33/5లో 9.46 ఎకరాల ప్రభుత్వ భూమికి గ్రామానికి చెందిన కసుకుర్తి బాలకోటయ్య, విజయవాడకు చెందిన కాజా ఉమాదేవి పాస్ పుస్తకాలు పొందారన్నారు.1402 నుంచి 1421 పసలీల వరకు వారి ముత్తాతలు, తండ్రుల పేర్లు అడంగల్‌లో లేవన్నారు.