కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు జన్మభూమి సభలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
కృష్ణా: రెవెన్యూ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు జన్మభూమి సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన్మభూమి సభలో పట్టాదారు పాస్ పుస్తకాలపై అక్కడి రైతులు నిరసనకు దిగారు. దాంతో రెవెన్యూ అధికారులు ఎమ్మార్వో, వీఆర్వోలపై చంద్రబాబు మండిపడ్డారు.
ఆన్‌లైన్‌లో భూముల వివరాలు నమోదు చేయాలని వారిని ఆదేశించారు. అంతేకాక పనితీరు మార్చుకోవాలంటూ రెవెన్యూ అధికారులను చంద్రబాబు హెచ్చరించారు.