ఆర్టీఏ అంటే అంతచులకనా? | What is so culakana ara? | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ అంటే అంతచులకనా?

Published Sat, Jul 25 2015 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

ఆర్టీఏ అంటే అంతచులకనా?

ఆర్టీఏ అంటే అంతచులకనా?

రెవెన్యూ అధికారులపై ఆర్టీఏ కమిషనర్  ఆగ్రహం
 
తిరుపతి మంగళం: సమాచార హక్కు చట్టం(రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్) అంటే రెవెన్యూ అధికారులకు అంత చులకనా?, ఆర్టీఏ అంటే ఏమిటో చూపి స్తా అంటూ సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియాకుమారి హెచ్చరించారు. తిరుపతి ఆర్డీవో కార్యాల యంలో శుక్రవారం రెవెన్యూ అధికారులు, ఫిర్యాదుదారులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూలో ఏ చిన్న సమాచారం అడిగినా చెప్పడం లేదని, చివరకు సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా రెవెన్యూ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పడం లేదని అర్జీదారులు ఆర్టీఏ కమిషనర్ తాంతియ కుమారి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆర్టీఏ కమిషనర్ తాంతి యాకుమారి మాట్లాడుతూ రెవె న్యూ అధికారులకు సమాచార హక్కు చట్టం గురించి ఇంకా పూర్తిగా తెలిసినట్లు లేదన్నారు. సామాన్య ప్రజలు సైతం ఆర్టీఏ కింద రెవెన్యూలో ఎలాంటి సమాచారాన్ని అడిగినా ఇవ్వాలన్నారు.

ఏర్పేడు తహశీల్దార్ ఎవరు ఎలాంటి సమాచారం అడిగినా ఇవ్వడంలేదని అనేక ఫిర్యాదులు అందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుసార్లు మందలించినా ప్రయోజనం కని పించడంలేదని, ఆర్టీఏ సత్తా ఏమిటో స వి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంటి పట్టా ఉన్నప్పటికీ అందులో కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, తమకు ఇంటి స్థలం చూపాలని అర్జీ పెట్టుకున్న సుభాషిణి అనే వికలాంగురాలికి న్యాయం చేయాలని పలుసార్లు అర్బన్ తహశీల్దార్‌ను ఆదేశించినా ఎందుకు పట్టించుకోవడం లేదని, ఆర్టీఏ కమిషనర్ అంటే లెక్కలేదా?, అంత నిర్లక్ష్యమా అని మండిపడ్డారు. తాను ఇక్కడికి తహశీల్దార్‌గా వచ్చి ఆరు నెలలు మాత్రమే అవుతోందని, వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏదో ఒక అదనపు బాధ్యతలను మోస్తున్నామని తెలిపారు. ఎన్ని బాధ్యతలు ఉన్నా ముందుగా సుభాషిణికి న్యాయం చేయాలని ఆదేశించారు. ఆ అధికారం తమ చేతుల్లో లేదని, కలెక్టర్ ఆదేశిస్తే వెంటనే అమలు చేస్తానని ఆమెకు వివరణ ఇచ్చారు. దీనిపై ఇదివరకు అర్బన్ తహశీల్దార్లుగా పనిచేసిన ముగ్గురు తహశీల్దార్లకు నోటీసులు జారీ చేయాలని ఆర్టీఏ కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్య, చిత్తూరు ఆర్డీవో పెంచల కిషోర్, తాహశీల్దార్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement