గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌లీకై ఓ ఇంట్లో చెలరేగిన మంటలకు మొత్తం ఆరు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని ప్రమాదం కారణంగా వాటిల్లిన నష్టం గురించి వివరాలు సేకరించారు.