టీడీపీ నేతలకు తొత్తులుగా అధికారులు
► వారి ప్రోద్బలంతోనే ఫిర్యాదు
► 15 మంది ‘దేశం’ నాయకుల ఆక్రమణల్లో ప్రభుత్వ స్థలాలు
► సీఐకి వివరించిన వైఎస్‌ఆర్ సీపీ నేతలు
పాయకరావుపేట: అధికారపార్టీ నేతలకు రెవెన్యూ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తూ, వారు చెప్పిన దానికల్లా తందాన తాన పాడుతున్నారని మండలంలోని కుమారపురం గ్రామస్తులు, వైఎస్‌ఆర్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో తుపాను రక్షిత భవనానికి వెళ్లే దారిలో ఉన్న ఇంటి పునాదిని తొలగించే విషయంమై తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం యలమంచిలి సీఐ కె.వెంకట్రావు విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీకి చెందిన గ్రామ ఉప సర్పంచ్ నీలాపు బాలకృష్ణా రెడ్డి , మండల యూత్ అధ్యక్షుడు నీలాపు చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి చెందిన కాలపురెడ్డి వరహాలు రెడ్డి 50 ఏళ్లక్రితం స్థలాన్ని కొనుగోలు చేసి, పునాదినిర్మించుకున్నారన్నారని చెప్పారు.
అయితే తుపాను రక్షిత భవనం దారి కోసం బలవంతంగా పునాదిని తొలగించేందుకు అధికారపార్టీకి చెందిన కొందరు ప్రయత్నం చేస్తునారన్నారు. ఈ ప్రాంతంలో అధికారపార్టీకి చెందిన 15 మంది నేతల అక్రమణల్లో ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకోకుండా... వీఆర్వోచేత తప్పుడు ఫిర్యాదు ఇప్పించి, తహసీల్దార్‌తో పోలీసులకు ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. గ్రామానికి చెందిన నీలాపు వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఆంజనేయస్వామి ఆల యానికి, తుపాను రక్షిత భవనానికి, గ్రామ అభివృద్ధికి ఉచితంగా తన సొంత స్థలం ఇచ్చానని చెప్పారు. తాము స్వచ్ఛందంగా స్థలం ఇస్తే రెవెన్యూ అధికారులు గమనించకుండా అధికారు పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా సీఐ వెంకట్రావు మాట్లాడుతూ తుపాను రక్షిత భవనానికి వెళ్లేందుకు ఏర్పాటు చేయాల్సిన రోడ్డుకు సంబంధించి ఎంత స్థలం సరిపోతుందో పంచాయతీరాజ్ ఇంజినీర్‌తో పరిశీలన చేయించి, చర్యలు చేపడటామన్నారు. ఎస్‌ఐవి.సత్యనారాయణతదితరులు పాల్గొన్నారు.