Leaders Ruling party
-
పరువు సర్వే
► అవినీతి అంశం నుంచి జనం దృష్టి మళ్లించేందుకు ► అక్రమ కట్టడాల సర్వే ► తొలిరోజే 110 భవనాలు గుర్తించినట్లు ప్రకటన ► నెల్లూరులో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ బృందాల హడావుడి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి పెరిగిపోయిందని అధికార పార్టీ నేతలే బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో టీడీపీకి వచ్చిన చెడ్డపేరు నుంచి జనం దృష్టి మరల్చడానికి మంత్రి నారాయణ అక్రమ నిర్మాణాల కూల్చి వేత మంత్రం వేశారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ రఘు నేతృత్వంలో సోమవారం ఆరు బృందాలు నగరంలో హడావుడి చేశాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరును ఆదర్శ (మోడల్) కార్పొరేషన్‌గా తయారు చేస్తానని మున్సిపల్ శాఖమంత్రి నారాయణ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకటిస్తున్నారు. కార్పొరేషన్లో అవినీతి రహిత పాలన అందిస్తామని, అవినీతిని సహించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటనకు వచ్చిన ప్రతి సందర్భంలో చెబుతున్నారు. వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తామని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక భవన నిర్మాణ అనుమతి కోసం అసిస్టెంట్ సిటీ ప్లానర్ మునిరత్నం రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ లంచం సొమ్ము తనకు కాదనీ, కమిషనర్‌కు ఇవ్వడానికి తీసుకున్నానని ఏసీపీ ఇచ్చిన వాంగ్మూలం రాజకీయ మలుపు తీసుకుంది. మేయర్ అజీజ్‌కు పాలన చేతకాదనీ, ఆయన అవినీతిలో మునిగిపోయారని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి బహిరంగ ఆరోపణలు చేశారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఆనమే అనీ, ఆయన హయాంలోనే కార్పొరేషన్‌ను నిలువునా దోచేశారని మేయర్ అజీజ్ ఎదురు దాడి చేయడంతో రాజకీయం వేడెక్కింది. కార్పొరేషన్లో అవినీతి పెరిగిపోయిందని అధికార పార్టీ నాయకులే ఆరోపించడంతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత తీసుకొచ్చింది. నెల్లూరులో టీడీపీని బలంగా తయారు చేయాలని ఏ పార్టీ నుంచైనా, ఏ స్థాయి నాయకుడినైనా వల విసిరి చేర్చుకుంటున్న తరుణంలో ఈ రకమైన పరిస్థితి ఏర్పడటం అధికార పార్టీకి చెప్పలేనంత చెడ్డపేరు తెచ్చింది. నిఘా వర్గాలు ఇదే విషయం సీఎంకు నివేదించాయి. దీంతో మంత్రి నారాయణమీద సీఎం అసహనం వ్యక్తం చేశారు. సొంత కార్పొరేషన్నే గాడిలో పెట్టలేని వ్యక్తివి రాష్ర్టమంతా ఎలా పర్యవేక్షిస్తావని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. దీంతో మంత్రి నారాయణ రంగంలోకి దిగి కార్పొరేషన్లో జరిగే ప్రతి చిన్న వ్యవహారం తనకు తెలియాలనీ, మేయర్, కమిషనర్ సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక మీదట ఏ నాయకుడు బహిరంగంగా ఆరోపణలు చేయొద్దని గట్టిగా మందలించారు. జనం దృష్టి మళ్లించడానికే.. ప్రభుత్వానికి, పార్టీకి వచ్చిన చెడ్డపేరు నుంచి జనం దృష్టి మళ్లించడానికి నెల్లూరులో ఏదో చేయబోతున్నట్లు మంత్రి నారాయణ అక్రమ భవనాల కూల్చివేత అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఇందుకోసం ఆరు బృందాలను పంపి అక్రమ భవనాల సర్వేకు శ్రీకారం చుట్టించారు. 2014 డిసెంబరులోపు అనుమతి లేకుండా నిర్మించి ఆ లోపు బీపీఎస్ పథకంలో దరఖాస్తు చేసుకుని ఉన్నవి మాత్రమే ఇప్పుడు సక్రమమైనవిగా గుర్తిస్తారు. ఆ తర్వాత అనుమతి లేకుండా నిర్మించినవీ, కార్పొరేషన్ అనుమతించిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన భవనాలన్నీ అక్రమ కట్టడాల జాబితాలోకే వస్తాయి. తొలిరోజే నగరంలో ఇలాంటివి 110 ఉన్నట్లు గుర్తించారు. వీరికి నోటీసులు జారీ చేసి అక్రమ కట్టడాలను కూల్చి వేయిస్తామనీ, ఇప్పటికే నోటీసులు ఇచ్చిన వాటిని కూడా నేలమట్టం చేస్తామని అధికారులు ప్రకటించారు. సర్వే పేరుతో మరో రెండు మూడు రోజులు హడావుడి చేయనున్నారు. అయితే వీరు గుర్తించిన అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయడం సాధ్యమయ్యే పనేనా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నగరం నడిబొడ్డున కాలువను ఆక్రమించి ఖరీదైన హోటల్ ఏర్పాటు చేశారు. ఇక్కడే ఖరీదైన లాడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది అక్రమమా? సక్రమమా? అనే విషయం అధికారులు, అధికార పార్టీ నాయకులందరికీ తెలుసు. ఇలాంటి నిర్మాణాలు నగరంలో లెక్కకు మించి ఉన్నాయి. ఇలాంటి వాటిని కూలదోసే ధైర్యం చేయగలుగుతారా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాలువ గట్ల మీద ఉండే పేదల గుడిసెలు తొలగించి కార్పొరేషన్‌ను క్లీన్ చేశామని చెప్పుకుని ప్రజల్లో పార్టీకి పోయిన పరపతి మళ్లీ సంపాదించుకోవడం కోసం నడుపుతున్న వ్యవహారంగా టీడీపీ నాయకులే చెబుతున్నారు. -
పరిహారం దోపిడీకి కుట్ర
► రామదాసుకండ్రిగలో రూ.16 కోట్ల భూమికి ఎసరు ► దళారులే సూత్రధారులు అధికారపార్టీ నాయకుల అండ అవి కృష్ణపట్నం పోర్టు రహదారి పక్కన రూ. కోట్లు విలువ చేసే భూములు. సాగుకు యోగ్యంగా లేక పోవడంతో ఏళ్ల తరబడి నుంచి బీళ్లుగానే ఉన్నాయి. ఆ భూములను ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కు కేటాయించను న్నారని ముందే పసిగట్టారు కొందరు పెద్దలు. దళారులను రంగంలోకి దించి అధికారపార్టీ నాయకుల అండతో పేదల పేరుతో ఉన్న ఆ భూములను తక్కువ ధరకు అగ్రిమెంట్లు చేయించుకున్నారు. ఒప్పుకోని రైతులను బెదిరించి మరీ సంతకాలు చేయించుకున్నారు. సుమారు రూ.16 కోట్లు పేదలకు దక్కాల్సిన పరిహారాన్ని దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ఇందులో అధికారులూ వాటాదారులనే ఆరోపణలున్నాయి. వెంకటాచలం: వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 2194, 2195, 2196, 2200, 2201లోని 122ఎకరాల సీలింగ్ భూములను ఆ గ్రామంలోని పేదలను గుర్తించి 1976లో ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ భూముల్లో కొందరు అప్పట్లో మెట్ట పంటలు పండించారు. 15 ఏళ్ల నుంచి ఆ భూముల్లో మొక్కలు మొలచి బీళ్లుగా మారాయి. కృష్ణపట్నం పోర్టు రహదారి నిర్మాణానంతరం ఆ భూములపై కబ్జాదారుల కన్ను పడింది. పలువురు పారిశ్రామికవేత్తలు ఆ భూములను చేజిక్కించుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. జిల్లా అధికారులు ఎన్జీవోలకు ఆ భూములను ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారమే అండగా కొన్ని నెలల క్రితం నుంచి ఈ భూములపై అధికారపార్టీ ప్రముఖులతో సంబంధాలుండే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. ఈ భూములు ఏపీఐఐసీకు కేటాయించనున్నారనే విషయాన్ని పసిగట్టి ఎలాగైనా పేదల నుంచి తక్కువ ధరకు భూములను కొనుగోలు చేయాలనుకున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులను దళారులుగా మార్చారు. రామదాసుకండ్రిగ సీలింగ్ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని దళారులు కొన్ని నెలల క్రితం గ్రామంలో విస్తృత ప్రచారం చేశారు. ప్రభుత్వం భూములు తీసుకుంటే ఏమీ రాదని, కొందరు ఎకరా రూ.6 లక్షల లెక్కన కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారని అమ్ముకుంటే మంచిదని రైతులను మాయ చేశారు. దళారుల మాయమాటలు నమ్మిన రైతులు తమ పొలాలను ఎకరా రూ.6 లక్షల వంతున అమ్మేందుకు సమ్మతించారు. ఇందుకు ఒప్పుకోని కొందరిపై దౌర్జాన్యాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై వెంకటాచలం పోలీస్స్టేషన్లోనూ బాధితులు ఫిర్యాదుచేసి ఉన్నారు. ఆరు నెలల క్రితం ఒక్కో రైతుకు అడ్వాన్స్‌గా రూ.30 వేలు ఇచ్చి గూడూరులోని ఐడీబీఐ బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేయించారు. ఒక్కో రైతు నుంచి ఆ నగదులో దళారులు రూ.5వేలు వసూలు చేశారు. రైతుల ఆగ్రహం రెవెన్యూ అధికారులు ఇటీవల గ్రామసభ నిర్వహించి రైతులకు ఇచ్చిన సీలింగ్ భూములు ఏపీఐఐసీకు కేటాయిస్తామని తెలియజేశారు. భూములకు సంబంధించి మీ వద్ద ఉన్న ఆధారాలు చూపితే పరిహారం వస్తుందని అధికారులు తెలపడంతో దళారుల దోపిడీ బయట పడింది. ప్రస్తుతం సీలింగ్ భూముల్లో కృష్ణపట్నంపోర్టు రోడ్డు, నివాస స్థలాలు ఏర్పాటుకు పోను సుమారు 100ఎకరాలు మిగిలి ఉంది. పేదలకు చెందాల్సిన రూ.కోట్ల పరిహారాన్ని దళారులు మాయచేసి వ్యాపార వేత్తలకు దక్కేలా చేస్తున్నారు. ఇందులో కొందరు అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఎకరాకు ఏపీఐఐసీ ద్వారా రూ.14 లక్షల నుంచి రూ.16లక్షలు పరిహారం వస్తుందని ప్రచారం ఉంది. దీంతో దళారులు తమను మోసం చేసి అగ్రిమెంట్లు రాయించుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం లబ్ధిదారులకు చెందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘వక్ఫ్’ కమిటీకి రాజకీయ గ్రహణం
► కొత్త పాలకవర్గానికి ► ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్యపోరు ► ఆక్రమణకు గురవుతున్న వక్ఫ్ ఆస్తులు మహబూబ్‌నగర్ అర్బన్ : వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. వాటిని పరిరక్షించాల్సిన జిల్లా కమిటీకి రాజకీయ గ్రహణం పట్టుకుంది. అస్తిత్వం కోసం అధికార పార్టీ నాయకులు గత వక్ఫ్ కమిటీ పాలకవర్గాన్ని రద్దు చేయించి సుమారు ఏడాదిన్నర పూర్తవుతోంది. కాంగ్రెస్ హయాంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అధ్యక్షతన జిల్లా వక్ఫ్ కమిటీని వేయగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయనపై కొన్ని ఆరోపణలు చేస్తూ టీఆర్ఎస్ నాయకులు పాలకవర్గాన్ని రద్దు చేయించారు. అనంతరం జిల్లా వక్ప్ బోర్డు సీనియర్ ఇన్స్పెక్టర్ మహ్మద్ గౌస్‌ను స్పెషల్ ఆఫీర్‌గా నియమించారు. కానీ నూతన కమిటీ వేయడంలో జాప్యం చేశారు. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యే మధ్య ఆదిపత్య పోరు నడుస్తుండటంతో ప్రక్రియ ముందుకు సాగడంలేదని మైనార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో రెండు సార్లు చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తినే తిరిగి ఆ పదవి కట్టబెట్టాలని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ బడా నాయకుడు ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో కొంత మంది మైనార్టీ నాయకులు మంత్రులతో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలావుండగా ఇప్పటిదాకా వక్ఫ్ కమిటీ చెర్మైన్‌గా పని చేసిన వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా పోయిందని, ఎవరైనా ముందుకొస్తే తమకూ అదే పరిస్థితి ఉంటుందన్న భయంతో ఎవరూ ముందుకు రావడం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని సీఎం స్వయంగా కోరినా జిల్లా నాయకులు మిన్నకుండిపోవడం ఆశ్చర్యాన్ని కలిగి స్తోంది. పాలకవర్గం లేక జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వక్ఫ్ ఆస్తుల దురాక్రమణ పరంపర కొనసాగుతూనే ఉంది. 1954లో దేవాదాయ శాఖ నుంచి వక్ఫ్ బోర్డు విడిపోయినప్పుడు జిల్లాలో 11,800 ఎకరాలున్న భూములు ప్రస్తుతం నాలుగు వేల ఎకరాలకు చేరాయి. -
‘రియల్’దందా..!
జిల్లా కేంద్రం శ్రీకాకుళమైనా, మండల కేంద్రం పాతపట్నమైనా... మరే పట్టణంలోనైనా.. మూడు సెంట్లు స్థలం దొరికితే సొంత ఇల్లు కట్టుకోవాలని భావించేవారే ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ కూడబెట్టుకున్న సొమ్ముతో సొంత జిల్లాలో ప్లాట్ కొనుక్కోవాలని ఆశ పడేవారు ఎక్కువ మంది ఉంటున్నారు. ఈ పరిస్థితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారగా...కొంతమంది అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వారితో కుమ్మక్కయ్యే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకూ ముడుపులు బాగానే ముడుతున్నాయి. ఫలితంగా విలువైన ప్రభుత్వ భూములన్నీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. అందమైన బ్రోచర్లు చూసి, బ్రోకర్ల మాటలు విని వాటిని కొనుక్కున్నవారంతా నిలువునా మోసపోతున్నారు. ఇలాంటి వ్యవహారానికి పాతపట్నంలో వెలుగు చూసిన వ్యవహారం ప్రత్యక్ష నిదర్శనం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నం పరిసరాల్లో సుమారు 30 వరకూ రియల్ ఎస్టేట్ సంస్థలు వెలిశారుు. ఈ సంస్థలు వేసిన లేఅవుట్లలో ప్రభుత్వ భూములున్నాయి. ఇలా దాదాపు 27 ఎకరాల భూమి ఇటీవల కాలంలో కబ్జా అయిపోయింది. ఈ అక్రమాలను సక్రమంగా చేసుకోవడానికి రియల్ వ్యాపారులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలుపుతున్నారు. వారు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను నయానో, భయానో లొంగదీసుకొని వ్యవహారం చక్కబెడుతున్నారు. ఇలా సుమారు రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి లేఅవుట్ల కింద మారిపోయింది. ఇందులో చాలావరకూ గిరిజనులు సాగు చేసుకుంటున్న డీ పట్టా భూములు ఉన్నాయి. వాటిని విక్రయించే హక్కులేకున్నప్పటికీ రియల్ వ్యాపారులు అధికార పార్టీ నాయకుల అండతో లాక్కొంటున్నారు. వాటిని పక్క సర్వే నంబర్ల ఆధారంగా వారసత్వ భూములుగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేస్తున్నారు. పోరంబోకు భూమికి ఎసరు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన పాతపట్నం పరిసర గ్రామాలకు చెందినవారు, అలాగే పరిసర గిరిజన గ్రామాల్లో ఉద్యోగాలు చేస్తూ పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్యం తదితర అవసరాల కోసం పాతపట్నంలో నివాసం ఉంటున్నవారు రియల్ ఎస్టేట్లలో ప్లాట్ల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ డిమాండుకు తగ్గట్లుగా కొందరు అధికార పార్టీ నాయకులు, ముఖ్యనేతల అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారం ఎత్తారు. పాతపట్నం పరిసరాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న డీ పట్టా, ప్రభుత్వ భూములపై కన్నేశారు. వాటి పక్కనే జిరాయితీ భూములు కొనుగోలు చేసి, ఆ ముసుగులో ప్రభుత్వ భూములను కలిపేసుకున్నారు. ఉదాహరణకు ప్రహరాజుపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 32లో కొంతమంది రైతులకు జిరాయితీ భూమి ఉంది. దాన్ని కొనుగోలు చేసిన ఓ రియల్ఎస్టేట్ సంస్థ ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమికి సర్వే నంబరు 32/1/ఎగా సబ్‌డివిజన్ చేసి 1.83 ఎకరాలను కాజేశారు. దీన్ని వారసత్వ భూమిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయమై కొంతమంది గ్రామస్థులు ఎన్కంబరేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయగా... అసలు ఆ సర్వే నంబరు, సబ్‌డివిజన్ లేదని అధికారులు ధ్రువీకరించారు. అధికారులు గుర్తించినవి కొన్నే కోదూరు పంచాయతీ ప్రహరాజపాలెం రెవెన్యూ పరిధి సర్వే నంబరు 30లో 1.53 సెంట్లు, సర్వే నంబరు 31లో పోరంబోకు గయ్యాలు 60 సెంట్లు, సర్వే నంబరు 33లోని జగ్గయ్య కోనేరు 2.56 ఎకరాలు, అలాగే రంకిణి పంచాయతీ చిన్నపద్మాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 3లో 55 సెంట్లు ఆక్రమణలో ఉందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇందంతా కలిపి ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిలో ఐదో వంతు కూడా లేదు. సర్వే నంబరు 31లో 1.50 ఎకరాలు, 32లో 2.56 ఎకరాలు, 35లో 3.89 ఎకరాలు, 35/2లో 21 సెంట్లు, 35/3లో 24 సెంట్లు, 35/4లో 87 సెంట్లు, 35/5లో 1.04 ఎకరాలు, 36లో 6.78 ఎకరాలు, 36/1లో 5.18 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. ఆ భూములన్నీ రియల్ ఎస్టేట్ లేఅవుట్‌ల్లో కలిసిపోయాయి. సుమారు 22 ఎకరాలకు పైగా ఉన్న ఈ ప్రభుత్వ భూమి విలువ రూ.10 కోట్లు పైమాటే. ‘కమీషన్’ కక్కుర్తి డీ పట్టా ఆధారంగా ప్రభుత్వ భూములను గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. వారిని బుట్టలో వేసి భూమిని అప్పగించిన బ్రోకర్లకు ఎకరాకు రూ.లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకూ కమీషన్‌ను రియల్ వ్యాపారులు ముట్టజెప్పుతున్నారు. ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుండటంతో కొంతమంది బ్రోకర్లు రియల్ వ్యాపారులుగా మారిపోయారంటే పరిస్థితి ఊహించవచ్చు. పాతపట్నం పరిసరాల్లో వెలిసిన చాలా లేఅవుట్లకు పంచాయతీ అఫ్రూవల్స్ లేవు. ప్లానులు, అనుమతులూ లేవు. భూమార్పిడి రుసుం చెల్లించిన దాఖలాలు లేవు. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారుు. ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాం కోదూరు పంచాయతీ ప్రహరాజపాలెం రెవెన్యూ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి వేసిన వెంచర్లను గుర్తించాం. ఆయా లేఅవుట్‌ల్లో సర్వే చేయించాం. రాళ్లను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ స్థలాన్ని తొలగించాం. రియల్ ఎస్టేట్ సంస్థలు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. -ఎన్.దాలినాయుడు, తహసీల్దారు, పాతపట్నం -
జగన్‌ను విమర్శించడమే పనా!
► మోసగించిన ప్రజలకు ఏం సమాధానం చెబుతారు ► రెండేళ్లలో సాధించిందేమిటో ప్రజలకు చెప్పాలి ► ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల: రెండేళ్లుగా రాష్ట్రంలో చేసిందేమీ లేక అధికార పార్టీ నాయకులు, సీఎం చంద్రబాబు, మంత్రులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందని గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన సమయంలో ప్రభుత్వ మోసగింపు తీరు గురించి మాట్లాడుతూ హామీలను అమలుచేయకపోతే చెప్పులతో ప్రజలు కొడతారని ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడారన్నారు. నవనిర్మాణ దీక్ష పేరుతో కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసి సభలు, కార్యక్రమాలు నిర్వహించిన సీఎం చంద్రబాబు, మంత్రులు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకోలేక ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన సభల్లో జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఎవరైనా తాము చేసిన పనుల గురించి చెప్పుకునేందుకు సభలు నిర్వహిస్తారన్నారు. అందుకు విరుద్ధంగా ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేక జగన్.. జగన్ అంటూ ఆయన పై రోజూ విమర్శల దాడి చేసేందుకే మంత్రులు సమయాన్ని కేటాయిస్తున్నారన్నారు. సీఎం మొప్పు కోసం ఒకరిని మించి ఒకరు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారన్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి నీతిమాలిన రాజకీయాలు చేసిన పార్టీ ఏదీ లేదని, ఆ ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఎల్లకాలం మీడియాను అడ్డం పెట్టుకొని విమర్శలు చేసినంత మాత్రాన ప్రజల ఆదరణ లభించదనే విషయాన్ని టీడీపీ నాయకులు గమనించాలన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేయటం మినహా ప్రజల ఆశలను నెరవేర్చకుండా మరింత మోసపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై దశలవారీగా ఉద్యమాలు చేసి ప్రజల ద్వారా టీడీపీకి బుద్ధిచెప్పటానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే పీఆర్కే కోరారు. -
వైఎస్సార్ సీపీ నేతను కోర్టులో హాజరుపర్చాలి
► దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట పార్టీ నాయకుల ధర్నా ► నిరవధిక ఆందోళన .. పాల్గొన్న పార్టీ జిల్లా నేతలు ► పోలీసుల అదుపులో ఉన్న గురవాచారికి నేతల పరామర్శ దాచేపల్లి : పోలీసుల అదుపులో ఉన్న పిడుగురాళ్లకు చెందిన వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుందుర్తి గురవాచారిని కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు దాచేపల్లి స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఏకధాటిగా ధర్నా చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. స్టేషన్ ప్రధాన గేట్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. గురవాచారిని కోర్టులో హాజరుపరిచేంత వరకు కదిలేది లేదని భీష్మించారు. దీంతో ధర్నా చేస్తున్న నాయకుల వద్దకు గురువారం ఉదయం గురజాల సీఐ ఆళహరి శ్రీనివాసరావు, ఎస్సై కట్టా ఆనంద్ వచ్చి ఆందోళనను విరమించాలని కోరారు. గురవాచారిని కోర్టుకు తరలించేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని జంగా తేల్చి చెప్పారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఆందోళన విరమించాలని సీఐ సర్ధి చెప్పారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారని జంగా మండిపడ్డారు. స్టేషన్లు తిప్పుతూ గురవాచారిని చిత్రహింసలు పెట్ట్టే పరిస్థితి కనిపించటం వలనే తాము ఇక్కడే కుర్చుంటామన్నారు. తమ పార్టీ వారిపై తప్పుడు కేసులు పెట్టి మానసికంగా ఇబ్బందులు పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే మెప్పు కోసం... తొలుత పోలీసుల అదుపులో ఉన్న గురవాచారిని నాయకులు పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయనకు భరోసా ఇచ్చారు. అనంతరం స్టేషన్లో ఉన్న సీఐ శ్రీనివాసరావును కలిసి నాయకులు మాట్లాడారు. గురవాచారిని అన్యాయంగా ఎందుకు స్టేషన్లో ఉంచారని రాజశేఖర్ ప్రశ్నించారు. నారాయణపురానికి చెందిన సయ్యద్ రెహ్మాన్ అనే వ్యాపారి సంతకాన్ని ఫోర్టరీ చేశారనే ఫిర్యాదు మేరకు గురవాచారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ చెప్పారు. చట్టపరంగానే వ్యవహరిస్తున్నామన్నారు. దీంతో రాజశేఖర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని హైకోర్టులో పిల్ వేసి, లోకాయుక్తకు గురవాచారి ఫిర్యాదు చేయటం వల్లే కక్ష పెంచుకున్నారని, ఎమ్మెల్యే మెప్పు పొందటానికే గురవాచారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అలాగే, సయ్యద్ రెహ్మాన్ కూడా అతని క్వారీలో ఎమ్మెల్యే ప్రోత్సాహంతో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని లోకాయుక్త డెరైక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని, మరి అందులో వాస్తవాలు తెలుసుకునేందుకు పిటిషనర్‌ను పిలిచి ఎందుకు విచారించలేదని నిలదీశారు. అధికార పార్టీ నాయకుల సేవలో పోలీసులు తరించిపోతున్నారన్నారు. గురవాచారిని తక్షణమే కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని సీఐతో రాజశేఖర్ తేల్చి చెప్పారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. 144 సెక్షన్ విధింపు.. నాయకులు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు స్టేషన్ ఎదుట 144 సెక్షన్ ను విధించారు. తర్వాత నాయకుల వద్దకు వచ్చి ఆందోళన విరమించాలని కోరారు. అయినా నాయకులు, కార్యకర్తలు వినలేదు. అవసరమైతే అరెస్ట్ చేసుకోండి.. మేం మాత్రం కదలేది లేదని స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్లు షేక్ జాకీర్ హుస్సేన్, చల్లా పిచ్చిరెడ్డి, సిద్దాఢపు గాంధీ, జెడ్పీటీసీ సభ్యులు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, వీరభద్రుని రామిరెడ్డి, పట్టణ అధ్యక్షులు మునగా పున్నారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరుపొగు రాజశేఖర్, సర్పంచ్‌లు బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, పాలడుగు జానేసు, ఎంపీటీసీ సభ్యులు భాగం వెంకటేశ్వర్లు, తాడికొండ ఆంజనేయరెడ్డి, గూడూరి గోవర్ధన్‌రావు, ప్రగాఢ నాగమ్మ, మాజీ ఎంపీపీలు అంబటి శేషగిరిరావు, కొప్పుల సాం బయ్య, నాయకులు బత్తుల లింగారెడ్డి, జంగా సైదులు, షేక్ ఖాదర్‌బాషా, సైసావలి, రామిరెడ్డి, తుమ్మూరి గోవిందరెడ్డి, బోడ్డు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న పార్టీ జిల్లా నేతలు.. పోలీస్ స్టేషన్ ఎదుట జంగా ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మాచర్ల, నరసరావుపేట శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి,జెడ్పీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మల్లెబోయిన వెంకట్రామయ్య తదితరులు హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ ధర్నా పోలీసుల అదుపులో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకుడు కుందుర్తి గురవాచారిని కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం దాచేపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పీఆర్కే, గోపిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా, నగర అధ్యక్షుడు అప్పిరెడ్డి తదితరులు -
టీడీపీ నేతలకు తొత్తులుగా అధికారులు
► వారి ప్రోద్బలంతోనే ఫిర్యాదు ► 15 మంది ‘దేశం’ నాయకుల ఆక్రమణల్లో ప్రభుత్వ స్థలాలు ► సీఐకి వివరించిన వైఎస్ఆర్ సీపీ నేతలు పాయకరావుపేట: అధికారపార్టీ నేతలకు రెవెన్యూ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తూ, వారు చెప్పిన దానికల్లా తందాన తాన పాడుతున్నారని మండలంలోని కుమారపురం గ్రామస్తులు, వైఎస్ఆర్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో తుపాను రక్షిత భవనానికి వెళ్లే దారిలో ఉన్న ఇంటి పునాదిని తొలగించే విషయంమై తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం యలమంచిలి సీఐ కె.వెంకట్రావు విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీకి చెందిన గ్రామ ఉప సర్పంచ్ నీలాపు బాలకృష్ణా రెడ్డి , మండల యూత్ అధ్యక్షుడు నీలాపు చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి చెందిన కాలపురెడ్డి వరహాలు రెడ్డి 50 ఏళ్లక్రితం స్థలాన్ని కొనుగోలు చేసి, పునాదినిర్మించుకున్నారన్నారని చెప్పారు. అయితే తుపాను రక్షిత భవనం దారి కోసం బలవంతంగా పునాదిని తొలగించేందుకు అధికారపార్టీకి చెందిన కొందరు ప్రయత్నం చేస్తునారన్నారు. ఈ ప్రాంతంలో అధికారపార్టీకి చెందిన 15 మంది నేతల అక్రమణల్లో ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకోకుండా... వీఆర్వోచేత తప్పుడు ఫిర్యాదు ఇప్పించి, తహసీల్దార్‌తో పోలీసులకు ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. గ్రామానికి చెందిన నీలాపు వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఆంజనేయస్వామి ఆల యానికి, తుపాను రక్షిత భవనానికి, గ్రామ అభివృద్ధికి ఉచితంగా తన సొంత స్థలం ఇచ్చానని చెప్పారు. తాము స్వచ్ఛందంగా స్థలం ఇస్తే రెవెన్యూ అధికారులు గమనించకుండా అధికారు పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్రావు మాట్లాడుతూ తుపాను రక్షిత భవనానికి వెళ్లేందుకు ఏర్పాటు చేయాల్సిన రోడ్డుకు సంబంధించి ఎంత స్థలం సరిపోతుందో పంచాయతీరాజ్ ఇంజినీర్‌తో పరిశీలన చేయించి, చర్యలు చేపడటామన్నారు. ఎస్ఐవి.సత్యనారాయణతదితరులు పాల్గొన్నారు. -
ప్రొటోకాల్‌కు తిలోదకాలు
► నిబంధనలకు గవిరెడ్డి అతీతం! ► మాజీ ఎమ్మెల్యే అయినా నీరు-చెట్టు పనులు ► ప్రారంభించిన వైనం హాజరుకాని అధికార గణం ► పచ్చచొక్కాల తీరుపై ప్రజల ఆగ్రహం దేవరాపల్లి: అధికార పార్టీ నాయకులు ప్రొటోకాల్ నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు. అధికారిక కార్యక్రమాలను సైతం పార్టీ కార్యక్రమాలుగా మార్చేస్తున్నారు. పలుమార్లు నిబంధనలను అతిక్రమిస్తున్నా చర్యలు తీసుకుంటున్న దాఖలాలులేవు. చెరువు ల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు నీరు-చెట్టు కార్యక్ర మం పేరిట చెరువుల్లో పూడిక తీత పనులు చేపడుతున్నారు. అయితే అధికారిక కార్యక్రమమైన ఈ నీరు-చెట్టు కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నాయకు లు రాజ్యాం గానికి విరుద్ధంగా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు ఎటువంటి హోదా లేనప్పటికీ పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని ప్రొటోకాల్‌కు తూట్లు పొడుస్తూ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇటీవల ముషిడిపల్లి గ్రామంలో అధికారిక కార్యక్రమైన ఎన్టీఆర్ గృహ కల్ప పథకం ప్రారంభోత్సవంలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వేచలం గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా మహాపాత్రుని చెరువు పూడిక తీత పనులకు సుమారు రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులను బుధవారం స్థానిక సర్పంచ్ వంటాకు సింహాద్రప్పడుతో కలిసి మాజీ ఎమ్మెల్యే ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తూ ప్రారంభించడంపై పలువురు గ్రామస్తులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలుగు తమ్ముళ్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికార గణం చూసి చూడనట్టు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రుణం.. తప్పని రణం
► అర్హులను కనికరించని కార్పొరేషన్లు ► లబ్ధిదారుల సొమ్ము కాజేస్తున్న దళారులు ► పట్టించుకోని యంత్రాంగం వివిధ కార్పొరేషన్ల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఇది. అన్ని అర్హతలున్నప్పటికీ జన్మభూమి కమిటీ ఎంపిక చేస్తేనే అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ తతంగం ముగిశాక కూడా బ్యాంకర్లు మడతపేచీ పెడుతున్నారు. సెక్యూరిటీ ఇవ్వాలని కచ్చితంగా చెబుతున్నారు. నిబంధనల మేరకు సెక్యూరిటీ అవసరం లేదని గట్టిగా నిలదీస్తే.. సాకులు చెప్పి రోజుల తరబడి తిప్పించుకుంటున్నారు. దీంతో రుణాల మంజూరు కోసం అభ్యర్థులు పెద్ద రణమే చేయూల్సి వస్తోంది. ► నేను కాపు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణం కోసం దరఖాస్తుచేసుకున్నాను. జన్మభూమి కమిటీ అంగీకరించడంతో సబ్సిడీ కూడా మంజూరైంది. అయితే బ్యాంకర్లు లోన్ ఇవ్వమంటే అదిగో..ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. గట్టిగా అడిగితే ష్యూరిటీకావాలంటున్నారు. మాలాంటి వారికి ష్యూరిటీ ఎవరిస్తారు. - ధర్మవరంలోని చీరల వ్యాపారి సతీష్ రాయుడు ఆవేదన ఇది. ► వాల్మీకి ఫెడరేషన్ ద్వారారుణానికి దరఖాస్తు చేసుకున్నాం. అయితే జన్మభూమి కమిటీ ఒప్పుకోలేదని మాఅప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది. ఏం చేస్తాం.. అన్ని అర్హతలున్నా రుణం రాకుండా పోయింది.- కిరాణా దుకాణం నిర్వాహకుడు రామాంజనేయులు ఆక్రందన ఇది. ధర్మవరం: అధికారులు, అధికార పార్టీ నేతల వివక్ష పేదలకు శాపంలా మారుతోంది. సంక్షేమ పథకాలతో అర్హులందరికీ అందేలా చూడాల్సిన వారే.. ప్రజలకు పొట్టగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల రుణాలు మంజూరు పడకేసింది. అర్హులందరికీ పథకాలు అందేలా చూడాల్సినఅధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కొందరికే సిఫార్సు జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, క్రిస్టియన్ కార్పొరేషన్లు, దోభీ, నాయిబ్రాహ్మణ,వాల్మీకి, విశ్వబ్రాహ్మణ, కుమ్మర, మేదర, పూసల తదితర సొసైటీల ద్వారా మొత్తం 79,992 మంది ఆన్లైన్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏడుగురితో కూడిన జన్మభూమి కమిటీ దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇక్కడ కొంత మందికే కమిటీ సిఫార్సు చేయడంతో దాదాపు 80 శాతం మంది దరఖాస్తులు పరిశీలనలోనే వెనక్కి పడిపోయాయి. మిగిలిన 20 శాతం దరఖాస్తులు ఆపసోపాలు పడి, కార్పొరేషన్లుకు చేరాయి. ఆయా కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తుదారులకు జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. అయితే బ్యాంకర్లు పూచీకత్తు లేనిది రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. దళారుల దందా మరికొన్ని చోట్ల కార్పొరేషన్ అధికారులతో ఉన్న సంబంధాలు, బ్యాంకుల్లో ఉన్న కొందరు ఉద్యోగులతో పరిచయాలతో దళారులు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. అటు అధికారులు, ఇటు బ్యాంకర్ల పేర్లు చెప్పి సొమ్ము చేసుకుంటున్నారు. వచ్చిన రాయితీలో వీరు వాటాలు వేసుకుంటున్నారు. లబ్ధిదారునికి వచ్చిన సొమ్ములో సగం వీరి చేతుల్లోకి చేరుతోంది. బ్యాంకర్లు ఇంటర్వ్యూలు జరిపి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నా, రుణాలు మంజూరు చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు బ్యాంకు బ్యాంకర్లతో మాట్లాడి ఒప్పించి రుణాలు ఇప్పించి దరఖాస్తు దారులను ఆర్థికంగాఎదిగేందుకు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లు.. అధికారులు సెలవు బాట
కార్పొరేషన్లో అధికారపార్టీ నేతల బెదిరింపులు ఏం నేనవరునుకున్నావ్... నేను చెప్పిన పని చేయవా... నీ అంతు చూస్తా.. అంటూ నగర పాలక సంస్థ అధికారులపై తెలుగు తమ్ముళ్లు బెదిరింపులకు దిగుతున్నారు. నాయ కుల అక్రమాలకు సహకరించలేక, బెదిరింపులు తట్టుకోలేక టౌన్‌ప్లానిం గ్లోని ఇద్దరు అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. నెల్లూరు, సిటీ: నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, హెల్త్ విభాగాలు ఉన్నాయి. వీటిలో టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు కార్పొరేషన్ రెవెన్యూకు ప్రధానమైనవి. ఈ విభాగాల్లో కార్పొరేషన్ ఆదాయానికి గండికొట్టి, జోబులు నింపుకోవడానికి అధికారులు, అధికార పార్టీ నేతలు దారులు వెతుకుతుంటారు. అయితే ఇటీవల కాలంలో అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అంతు లేకుండా పోయింది. అందినకాడికి దోచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి తాము చెప్పినట్టు నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నాయకులు చెప్పిన పనులు చేస్తే తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొంత మంది అధికారులు ఒత్తిళ్లు తట్టుకోలేక ధీర్ఘకాలిక సెలవు పెట్టారు. సర్వేయర్ రెండు నెలల నుంచి సెలవు నగర పాలక సంస్థలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఇద్ద రు అధికారుల్లో ఒకరు సర్వేయర్ మూర్తి. మరొకరు టీపీఓ సుధాకర్. వీరిలో మూర్తి రెండు నెలల నుంచి, టౌన్‌ప్లానింగ్ అధికారి సుధాకర్ నెల నుంచి సెలవులో ఉన్నారు. మూర్తికి నగర పాలక సంస్థ పరిధిలో కాలువల ఆక్రమణలు గుర్తించాలని గతంలో పాలకులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలువల ఆక్రమణల్లో బడాబాబులు ఎక్కువగా ఉండడంతో సర్వే చేసే సమయంలో అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినట్లు తెలి సింది. మా భవనాలను సర్వేలో చూపిస్తే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని అధికారపార్టీ నేతలు హెచ్చరిం చినట్లు సమాచారం. దీంతో మూర్తి దీర్ఘకాలిక సెలవులో వెళ్లినట్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు అంటున్నారు. టీపీఓ నెల నుంచి.. టీపీఓ సుధాకర్‌కు టౌన్‌ప్లానింగ్ అధికారిగా కొన్ని నెలల క్రితం ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. ఈ క్రమంలో సుధాకర్ కొంతకాలం సజావుగా విధులు నిర్వహించారు. ఓ అధికార పార్టీ కార్పొరేటర్ తనకు ప్రతి నెలా లక్షల్లో మామూళ్లు ఇవ్వాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశా రు. అదేవిధంగా భారీ అక్రమాలకు సంబంధించిన ఫైల్స్‌పై సంతకాలు పెట్టాలని బెదిరించినట్లు తెలిసింది. దీంతో ఆయన నెల రోజుల నుంచి సెలవులో ఉన్నారు. ఈ క్రమంలో అధికారులిద్దరూ బదిలీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం టౌన్‌ప్లానింగ్‌లో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫైల్స్ కదలడం లేదని పలువురు అంటున్నారు. ఇంజనీరింగ్ విభాగంలోనూ.. ఇంజనీరింగ్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి ప్రస్తుతం అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గలేక సెలవు లేదా బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచా రం. ఇద్దరు డీఈలు, ముగ్గురు ఏఈలు ఇప్పటికే బదిలీ ప్రయత్నాలు చేశారు. నగర పాలక సంస్థ పరిధిలో అభివృ ద్ధి పనులు జరగనున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లతో అధికారులు సెలవులపై వెళుతుండడంతో ఆ పనులు ఆగిపోయే ప్రమాదం ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. -
మట్టినీ మింగేస్తున్నారు
అధికార పార్టీ నాయకులు కళ్లు మూసుకున్న అధికారులు కోట్లకు పడగలెత్తుతున్న అధికారపార్టీకి చెందిన మాఫియా మట్టిని కూడా వదలడం లేదు. మట్టిని అమ్ముకుని కోట్లకు పడగలెత్తుతోంది. అధికారపార్టీ నాయకుల ఒత్తిడితో విజిలెన్స్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నూజివీడు: నూజివీడు మండలం పల్లెర్లమూడి దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణాలో కుడి కాల్వ కలిసే వరకు పనులు జరుగుతున్నాయి. 80మీటర్ల వెడల్పు తవ్వాల్సిన కాలువను గతేడాది ఆగస్టులో 40మీటర్లు మాత్రమే తవ్వి నీటిని వదిలారు. మిగిలిన వెడల్పు తవ్వే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. తవ్విన మట్టిని కాల్వకట్టలపైనే పక్కగా పోయాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా అధికారపార్టీకి చెందిన మట్టి మాఫియా గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు, పామ ర్రు, పశ్చిమగోదావరి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మట్టిమాఫియా కొంతమంది రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించుకుంటున్నట్లు సమాచారం. పలు గ్రామాల పరిధిలో ఉన్న క్వారీ గోతులు పూడ్చటానికి మట్టిని తరలిస్తున్నారు. పల్లెర్లమూడి వద్ద నుంచి మర్రిబంధం వరకు పోలవరం కాలువను తవ్వగా 8.30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వచ్చింది. అందులో దాదాపు 5లక్షల క్యూబిక్‌మీటర్ల మట్టిని గతంలోనే అమ్మేసుకున్నారు. క్యూబిక్ మీటరు మట్టికి ప్రభుత్వం రూ.30 ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే తరలిపోయిన మట్టి విలువ రూ.1.50కోట్లు ఉంటుంది. నూజివీడు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీతారామపురం గ్రామస్తులు గతేడాది సెప్టెంబరులో ఫిర్యాదుచేశారు. మట్టితో వెళుతున్న గ్రావెల్ టిప్పర్లను పోలీసులకు పట్టిస్తే వాటిని ఆర్డీవో రూ.5వేలు జరిమానా విధించారు. అధికారులపై మంత్రి ఒత్తిళ్లు మట్టి తరలింపును పట్టించుకోవద్దని జిల్లాకు చెందిన మంత్రి విజిలెన్స్ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. నూజివీడు డివిజన్లోని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు విజిలెన్స్ అధికారులు వస్తే పశ్చిమగోదావరి జిల్లాలో అడ్డగోలుగా మట్టిని తరలించి అమ్ముకుంటుంటే అక్కడ ఎందుకు ఆపడంలేదని ప్రశ్నించడంతో వెనుదిరిగి వెళ్లినట్లు తెలిసింది. తహశీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నాం మట్టి బయటకు పోవడానికి వీల్లేదని, పనులు చేస్తున్న ఏజన్సీకి తెలియజేశాం. మట్టి తరలిపోతున్న విషయం మా దృష్టికి వచ్చినప్పుడల్లా తహశీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నాం. వారు చర్యలు తీసుకోవాల్సి ఉంది.-పద్మిని, పోలవరం కాలువ డీఈ మట్టిని దోచేస్తున్నారు పోలవరం కాలువ మట్టిని యథేచ్చగా దోచేస్తున్నారు. పగలు కంటే రాత్రిపూట మట్టిని ట్రాక్టర్లు, లారీల్లో తరలించేస్తున్నారు. పోలీసులు గాని, రెవెన్యూ అధికారులు గాని ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారపార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారు.-దేవరకొండ మధు, వైఎస్సార్సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు -
కాటేస్తున్న కనురెప్పలు
ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే అక్రమాలుతూతూ మంత్రంగా తనిఖీలు దొరికితే కిందిస్థారుు సిబ్బందిపై చర్యలుదొరక్కపోతే లక్షల్లో కమీషన్లుఅధికారుల అండ, రాజకీయ బలంతో దందా ఒంగోలు క్రైం: అడవి దొంగలు ఇక్కడా ఉన్నారు ... అడవిని కాపాడే కొంతమంది అధికారుల చల్లని నీడలో అటవీ సంపదను దాటించేస్తుంటారు. తనిఖీల్లో ఎక్కడైనా పొరపాటున లారీ దొరికిపోతే వీలైనంత వరకూ తప్పించే ప్రయత్నం చేస్తారు. అప్పటికే వారి చేరుు దాటిపోతే తనిఖీ అధికారులుగా వీరే హడావుడి చేసి తూతూ మంత్రంగా కేసులు రాసి అసలు సూత్రధారులను తప్పించేసి కిందిస్థారుు సిబ్బందిలో ఒకరిద్దరిని సస్పెండ్ చేసి చేతులు దులుపేసుకుంటారు. ఈ వ్యవహారం గత కొన్నేళ్లుగా గుట్టుగా సాగుతోంది. రెండు రోజుల కిందట కందుకూరు వద్ద భారీ కలప పట్టుపడడంతో మరోసారి తెరపైకి వచ్చింది. అటవీ సంపదను సంరక్షించేందుకు వేలకు వేలు జీతాలు ఇచ్చి సిబ్బందిని, అధికారులను నియమిస్తే కనుపాపే కాటేసిన చందంగా లంచావతారులుగా మారి లక్షలు ఆర్జిస్తున్నారు. అటవీ శాఖలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న సిహెచ్.నరసింహరావుతో కొంతమంది పై అధికారులు కుమ్మక్కై భారీ వృక్షాల కొట్టివేత ... తరలింపులకు ఉపక్రమిస్తున్నారు. వీరి అక్రమాలను పసిగట్టి నిఘా పెట్టిన గిద్దలూరు రేంజ్ ఉన్నతాధికారి తరలిపోతున్న జామాయిల్ భారీ లారీ లోడ్‌ను పట్టుకోవడంతో అసలు వ్యవహారం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే...గిద్దలూరు అటవీ శాఖ డివిజన్ పరిధిలో ఒంగోలు సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం పరిధిలో ఒంగోలు, కనిగిరి రేంజ్ కార్యాలయూలున్నాయి. ఒంగోలు రేంజ్ పరిధిలోని తెట్టు, చాకిచర్ల సెక్షన్ల పరిధిలో అడవిని అడ్డంగా అమ్ముకు తినే ఇంటి దొంగలూ ఉన్నారు. స్వయానా అటవీ శాఖలో కాంట్రాక్టర్‌గా అవతారమెత్తిన నరసింహరావు అనే అతనికి అధికార పార్టీ అండదండలుతోపాటు కొంతమంది అటవీ అధికారుల ఆశీర్వాదాలు మెండుగా ఉండడంతో దర్జాగా భారీ వృక్షాలను కొట్టించి అడవి సరిహద్దులను దాటించేస్తుంటారు. యంత్రాలతో కోరుుస్తున్నా.. మోచర్ల బీట్‌లో అటవీ శాఖ కాంట్రాక్టర్ సి.హెచ్.నరసింహరావు యంత్రాల సాయంతో జామాయిల్ చెట్లు కొట్టించి విజయవాడకుచెందిన తన స్నేహితుడి ట్రాలీ లారీలో ఎక్కించి తరలింపునకు ఉపక్రమించాడు. మోచర్లలో పనిచేస్తున్న అటవీ అధికారులకు ఇదంతా తెలియకుండానే జరిగిపోయిందనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇన్ని దుంగలు కొట్టించాలంటే కనీసం వారం రోజుల సమయం పడుతుంది. లారీలోకి ఎక్కించాలంటే మరో రెండు రోజులు. ఇంత జరిగినా అక్కడి సిబ్బంది ఎందుకు అడ్డుకోలేకపోయూరన్నదే ప్రశ్న. ఈ విషయం గిద్దలూరు అటవీశాఖ అధికారులకు ఉప్పందడంతో తమ టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో రహస్యంగా నిఘా వేరుుంచి గత నెల 16వ తేదీన పట్టుకున్నారు. సంబంధిత అటవీ అధికారుల ప్రోత్సాహం లేకుండా పొడవాటి భారీ దుంగల తరలింపు సాధ్యం కాదని స్వాధీనం చేసుకున్న ఓ అధికారి ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. దీనికి బాధ్యుడైన కాంట్రాక్టర్ పరారీలో ఉండగా లారీ డ్రైవర్‌ను, మరికొందరిని టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్బీఓ అన్వర్‌బాషా బలి...అక్రమంగా సరుకు దొరికింది ... నిందితుడు కూడా ఉండాలి కదా. అందుకే అసలు సూత్రధారులను వదిలేసి ఓ వ్యక్తిని బాధ్యుడిని చేసి సస్పెండ్ చేసినట్టుగా చూపించారు. ఈ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా మోచర్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్‌బిఓ)పి.అన్వర్ బాషాను సస్పెండ్ చేశారు. -
సీడీపీవోల్లో బదిలీల ఫీవర్
- ప్రస్తుతానికి ఇద్దరికి స్థానచలనం - త్వరలో మరో పందొమ్మిది మంది - తర్జనభర్జన పడుతున్న సీడీపీఓలు - అధికార పార్టీ నేతల ప్రసన్నానికి పాట్లు ఒంగోలు టౌన్: సీడీపీవోలకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. ప్రస్తుతం ఇద్దరు సీడీపీవోలకు స్థానచలనం కలిగింది. ఒంగోలు రూరల్ ప్రాజెక్టు సీడీపీవోగా విధులు నిర్వర్తిస్తున్న పి.విజయకుమారిని కొండపి ప్రాజెక్టుకు బదిలీ చేశారు. కొండపి సీడీపీవోగా విధులు నిర్వర్తిస్తున్న పి.విజయలక్ష్మిని ఒంగోలు రూరల్ ప్రాజెక్టుకు బదిలీ చేశారు. త్వరలో మరో పందొమ్మిది మందికి స్థానచలనం కలగనున్నట్లు సమాచారం అందుకున్న సీడీపీవోలు తర్జన భర్జనలు పడుతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతాలు తమకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మరోచోటకు బదిలీ చేస్తే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతల సిఫార్సుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి సీడీపీవోల బదిలీలు మహిళా శిశు సంక్షేమశాఖ డెరైక్టరేట్ పరిధిలో జరుగుతుంటాయి. అయినప్పటికీ పై స్థాయిలో మేనేజ్ చేసుకుంటే బదిలీ వేటు పడకుండా తప్పించుకోవచ్చని కొంతమంది, తమకు నచ్చిన ప్రాంతాలకు బదిలీ కావొచ్చని ఇంకొంతమంది ప్రయత్నిస్తున్నారు. వారితీరే సప‘రేట్’ జిల్లాలోని కొంతమంది సీడీపీవోల తీరు సప‘రేట్’గా ఉంది. సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం, తాము పనిచేసే ప్రాంతాల్లో నివాసం ఉండకపోవడం, తనిఖీల పేరుతో అంగన్వాడీలను బెదిరించి సొమ్ము చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటివారికి బదిలీల భయం పట్టుకొంది. తాము ఆడిందే ఆటగా ఉంటున్న తరుణంలో మరో చోటికి బదిలీ అయితే అక్కడ హవా కొనసాగించలేమని మదన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బదిలీలకు సంబంధించి సరైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ఎప్పుడు ఎవరిపై బదిలీ వేటు పడుతుందోనని అనేక మంది కలవరపడుతున్నారు.