ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే అక్రమాలుతూతూ మంత్రంగా తనిఖీలు దొరికితే కిందిస్థారుు సిబ్బందిపై చర్యలుదొరక్కపోతే లక్షల్లో కమీషన్లుఅధికారుల అండ, రాజకీయ బలంతో దందా
ఒంగోలు క్రైం: అడవి దొంగలు ఇక్కడా ఉన్నారు ... అడవిని కాపాడే కొంతమంది అధికారుల చల్లని నీడలో అటవీ సంపదను దాటించేస్తుంటారు. తనిఖీల్లో ఎక్కడైనా పొరపాటున లారీ దొరికిపోతే వీలైనంత వరకూ తప్పించే ప్రయత్నం చేస్తారు. అప్పటికే వారి చేరుు దాటిపోతే తనిఖీ అధికారులుగా వీరే హడావుడి చేసి తూతూ మంత్రంగా కేసులు రాసి అసలు సూత్రధారులను తప్పించేసి కిందిస్థారుు సిబ్బందిలో ఒకరిద్దరిని సస్పెండ్ చేసి చేతులు దులుపేసుకుంటారు. ఈ వ్యవహారం గత కొన్నేళ్లుగా గుట్టుగా సాగుతోంది. రెండు రోజుల కిందట కందుకూరు వద్ద భారీ కలప పట్టుపడడంతో మరోసారి తెరపైకి వచ్చింది. అటవీ సంపదను సంరక్షించేందుకు వేలకు వేలు జీతాలు ఇచ్చి సిబ్బందిని, అధికారులను నియమిస్తే కనుపాపే కాటేసిన చందంగా లంచావతారులుగా మారి లక్షలు ఆర్జిస్తున్నారు. అటవీ శాఖలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న సిహెచ్.నరసింహరావుతో కొంతమంది పై అధికారులు కుమ్మక్కై భారీ వృక్షాల కొట్టివేత ... తరలింపులకు ఉపక్రమిస్తున్నారు. వీరి అక్రమాలను పసిగట్టి నిఘా పెట్టిన గిద్దలూరు రేంజ్ ఉన్నతాధికారి తరలిపోతున్న జామాయిల్ భారీ లారీ లోడ్‌ను పట్టుకోవడంతో అసలు వ్యవహారం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే...గిద్దలూరు అటవీ శాఖ డివిజన్ పరిధిలో ఒంగోలు సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం పరిధిలో ఒంగోలు, కనిగిరి రేంజ్ కార్యాలయూలున్నాయి.
ఒంగోలు రేంజ్ పరిధిలోని తెట్టు, చాకిచర్ల సెక్షన్ల పరిధిలో అడవిని అడ్డంగా అమ్ముకు తినే ఇంటి దొంగలూ ఉన్నారు. స్వయానా అటవీ శాఖలో కాంట్రాక్టర్‌గా అవతారమెత్తిన నరసింహరావు అనే అతనికి అధికార పార్టీ అండదండలుతోపాటు కొంతమంది అటవీ అధికారుల ఆశీర్వాదాలు మెండుగా ఉండడంతో దర్జాగా భారీ వృక్షాలను కొట్టించి అడవి సరిహద్దులను దాటించేస్తుంటారు. యంత్రాలతో కోరుుస్తున్నా.. మోచర్ల బీట్‌లో అటవీ శాఖ కాంట్రాక్టర్ సి.హెచ్.నరసింహరావు యంత్రాల సాయంతో జామాయిల్ చెట్లు కొట్టించి విజయవాడకుచెందిన తన స్నేహితుడి ట్రాలీ లారీలో ఎక్కించి తరలింపునకు ఉపక్రమించాడు. మోచర్లలో పనిచేస్తున్న అటవీ అధికారులకు ఇదంతా తెలియకుండానే జరిగిపోయిందనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇన్ని దుంగలు కొట్టించాలంటే కనీసం వారం రోజుల సమయం పడుతుంది.
లారీలోకి ఎక్కించాలంటే మరో రెండు రోజులు. ఇంత జరిగినా అక్కడి సిబ్బంది ఎందుకు అడ్డుకోలేకపోయూరన్నదే ప్రశ్న. ఈ విషయం గిద్దలూరు అటవీశాఖ అధికారులకు ఉప్పందడంతో తమ టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో రహస్యంగా నిఘా వేరుుంచి గత నెల 16వ తేదీన పట్టుకున్నారు. సంబంధిత అటవీ అధికారుల ప్రోత్సాహం లేకుండా పొడవాటి భారీ దుంగల తరలింపు సాధ్యం కాదని స్వాధీనం చేసుకున్న ఓ అధికారి ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. దీనికి బాధ్యుడైన కాంట్రాక్టర్ పరారీలో ఉండగా లారీ డ్రైవర్‌ను, మరికొందరిని టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్‌బీఓ అన్వర్‌బాషా బలి...అక్రమంగా సరుకు దొరికింది ... నిందితుడు కూడా ఉండాలి కదా. అందుకే అసలు సూత్రధారులను వదిలేసి ఓ వ్యక్తిని బాధ్యుడిని చేసి సస్పెండ్ చేసినట్టుగా చూపించారు. ఈ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా మోచర్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్‌బిఓ)పి.అన్వర్ బాషాను సస్పెండ్ చేశారు.
కాటేస్తున్న కనురెప్పలు
Published Sun, Feb 7 2016 6:08 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM
Advertisement