పరిశ్రమల పేరుతో దోచుకుంటారా?
ప్రభుత్వంపై నమ్మకం పోయింది
రెవెన్యూ అధికారులపై ఆగ్రహించిన అన్నదాతలు
తొట్టంబేడు: ‘తహశీల్దార్‌గారు చావనైనా చస్తాంగానీ సెంటు భూమి ఇవ్వం. ఒకవేళ లాక్కున్నా ఊరుకోం’ అంటూ అన్నదాతలు మండిపడ్డారు. పరిశ్రమల కోసం భూములు సేకరించడానిక వెళ్లిన రెవెన్యూ అధికారులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పరిశ్రమలతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పిన అధికారులకు రైతులు తిరగబడటంతో అధికారులు చేసేదేమి లేక వెనుదిరిగారు. ఈ సంఘటన ఆదివారం తొట్టంబేడు మండలంలో చోటు చేసుకుంది. తహశీల్దార్ చంద్రమోహన్‌తో పాటు పలువురు ఆర్‌ఐలు, వీఆర్వోలు రైతుల వద్ద ఉన్న డీకేటీ భూవుులు సేకరిం చడం కోసం తొట్టంబేడు వుండలంలోని చొడవరం, చేవుూరు, చియ్యువరం, కాసరం, సిద్దిగుంట గ్రావూల్లో పర్యటించారు. తహశీల్దార్ మాట్లాడుతూ పరిశ్రవుల కోసం రైతుల వద్ద ఉన్న డీకేటీ భూవుులను ఇవ్వాలన్నారు.
భూవుులిచ్చిన రైతులకు అంతో ఇంతో నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. దీంతో ఆగ్రహం చెందిన చేవుూరు గ్రావుస్తులు ‘పరిశ్రవుల పేరుతో రైతులను దోచుకోవాలని చూస్తున్నారా? ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పిన ఏ ఒక్కహామీనైనా నిలబెట్టుకుందా? చావనైనా చస్తాంగానీ మా భూవుుల జోలికి వస్తే ఊరుకోవుని హెచ్చరించారు. దాంతో ఖంగుతిన్న రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. తర్వాత చోడవరం గ్రావూనికి వెళ్లారు. అక్కడ కూడా అధికారులకు ఇదే పరిస్థితి ఎదురైంది. ‘సార్ ప్రభుత్వం ఎలాగూ మమ్మల్ని పట్టించుకోదు, మేవుు వూ కష్టంతో ప్రశాంతంగా జీవిస్తున్నాం, ఇలా కూడా బతకనీయురా’ అంటూ రైతులు వుండిపడ్డారు. చియ్యువరం, కాసరం గ్రామాల్లోనూ రైతులు తిరగబడటంతో అధికారులు చేసేదేమి లేక వెనుదిరిగారు. సోవువారం నుంచి వుండలంలో రోజుకు ఐదు గ్రావూల్లో భూసేకరణ చేపట్టాలని ప్రణాళిక వేసుకున్న అధికారులు ప్రస్తుతం వాటికి జోలికి పోతే కొట్టేలా రైతులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు తాత్కాలికంగా భూసేకరణ కార్యక్రవూన్ని విరమించుకోవాలని రెవెన్యూ అధికారులు అనుకున్నట్లు సమాచారం.