‘రాత్రికి రాత్రి పంటచేలు పాడుచేశారు..’ | effected formers complainted to jc amrapali | Sakshi
Sakshi News home page

‘రాత్రికి రాత్రి పంటచేలు పాడుచేశారు..’

Published Thu, Jul 14 2016 2:47 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

‘రాత్రికి రాత్రి పంటచేలు పాడుచేశారు..’ - Sakshi

‘రాత్రికి రాత్రి పంటచేలు పాడుచేశారు..’

జేసీ ఆమ్రపాలికి ఫిర్యాదు చేసిన బాధిత రైతులు
పరిగి : రాత్రికి రాత్రే రెవెన్యూ అధికారులు తమ పంట పొ లాలను దున్ని పాడు చేశారని మండలంలోని రూప్‌ఖాన్ పేట్‌కు చెందిన రైతులు తెలిపారు. వారు బుధవారం పరిగికి వచ్చిన జారుుంట్ కటెక్టర్ ఆమ్రపాలికి ఫిర్యాదు చేశారు. మండలంలోని తుంకలగడ్డ శివారులో 70 సంవత్సరాల క్రితం తమకు ప్రభుత్వం భూమిని పంపిణీ చేసిందన్నారు. ఆ భూమిలో మొక్కజొన్న పంట సాగుచేస్తున్నామని తెలిపారు. తమకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా గత సోమవారం రాత్రి రెవెన్యూ అధికారులు ట్రాక్టర్‌తో మొక్కజొన్న పంటను దున్నేశారని బాధిత రైతులు వివరించారు. ఆ పొలం ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తే మరో చోటనైనా తమకు భూములు ఇవ్వాలని ఆమెను కోరారు. పరిశీలిస్తామని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement