Affected farmers
-
రైతన్నకు అండగా సీఎం జగన్
-
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
మంచాల: పంటలు ఎండి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదగోని జంగయ్యగౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆరుట్ల గ్రామంలో ఎండిన మొక్కజొన్న పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రైతాంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని కేవలం హామీలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. ఐదుసార్లు ప్రకృతి వైపరిత్యాల వల్లన పంటలు దెబ్బతిన్న రైతులకు నయా పైసా కూడా పరిహారం ఇవ్వలేదన్నారు. కేంద్రం కరువు నిధులు ఇచ్చామని చెబుతుందని.. రాష్ర్ట ప్రభుత్వం మాత్రం వాటిని రైతులకు ఇవ్వడం లేదన్నారు. పంట రుణమాఫీ విషయంలో కూడా నష్టపూరితంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులు పంటలు ఎండి నష్టాల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొందన్నారు. ప్రధానంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పంటలు పూర్తిగా చేతికి రాకుండా పోయాయన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దాసరమోని సురేష్, లోంగారి యాదగిరి, ఎన్నుదుల మహేష్, సుంకరి దానయ్యగౌడ్, తాళ్ల ప్రభాకర్‌గౌడ్, జోగు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘రాత్రికి రాత్రి పంటచేలు పాడుచేశారు..’
జేసీ ఆమ్రపాలికి ఫిర్యాదు చేసిన బాధిత రైతులు పరిగి : రాత్రికి రాత్రే రెవెన్యూ అధికారులు తమ పంట పొ లాలను దున్ని పాడు చేశారని మండలంలోని రూప్‌ఖాన్ పేట్‌కు చెందిన రైతులు తెలిపారు. వారు బుధవారం పరిగికి వచ్చిన జారుుంట్ కటెక్టర్ ఆమ్రపాలికి ఫిర్యాదు చేశారు. మండలంలోని తుంకలగడ్డ శివారులో 70 సంవత్సరాల క్రితం తమకు ప్రభుత్వం భూమిని పంపిణీ చేసిందన్నారు. ఆ భూమిలో మొక్కజొన్న పంట సాగుచేస్తున్నామని తెలిపారు. తమకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా గత సోమవారం రాత్రి రెవెన్యూ అధికారులు ట్రాక్టర్‌తో మొక్కజొన్న పంటను దున్నేశారని బాధిత రైతులు వివరించారు. ఆ పొలం ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తే మరో చోటనైనా తమకు భూములు ఇవ్వాలని ఆమెను కోరారు. పరిశీలిస్తామని ఆమె తెలిపారు. -
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
పులివెందుల/తొండూరు : తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్న అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. రబీలో సాగు చేసి ఎండిపోయిన బుడ్డశనగ, పొద్దుతిరుగుడు, ధనియాల పంటలను సోమవారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. పూర్తిస్థాయిలో రైతులకు పంట నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. ముద్దనూరు వ్యవసాయ శాఖ ఏడీ వినయ్‌రెడ్డి, వ్యవసాయాధికారులు కిశోర్ నాయక్, మధుసూదన్‌రెడ్డి, తహశీల్దార్ ఎల్.వి.ప్రసాద్, ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డిలతో పంట నష్టంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అధికారులతో మాట్లాడుతూ పంటలను చూస్తే చాలా బాధాకరంగా ఉందని.. 10 ఎకరాల్లో సాగు చేస్తే కనీసం తినడానికి కూడా దిగుబడి రాలేదని విచారం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఇన్సూరెన్స్ అందేవిధంగా చూస్తానని రైతులకు అవినాష్‌రెడ్డి భరోసా ఇచ్చారు. దీనిపై లోక్‌సభలో కూడా చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి కరువు చూడలేదు : వందేళ్ల నుండి ఇలాంటి కరువు చూడలేదని రైతులు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి విన్నవించారు. పంటలు ఎండిపోయాయి. బోరుబావుల్లో భూగర్భజలాలు ఎండిపోయి వందల అడుగుల లోతులో వేసిన బోర్లల్లో చుక్కనీరు పడలేదని.. వ్యవసాయానికి కాదు కదా తాగడానికి నీరు కూడా దొరుకుతుందో.. లేదో సార్ అంటూ రైతులు తమ గోడు విన్నవించారు. బోడివారిపల్లెకు చెందిన రైతు మల్లేల వెంకట్రామిరెడ్డి తన గోడు విన్నవించారు. 10 ఎకరాల్లో బుడ్డశనగ పంటను ఎకరానికి రూ.15వేలు ఖర్చు చేసి సాగు చేస్తే కనీసం బస్తా కూడా దిగుబడి లేదని రైతులు వాపోయారు. దీంతో రైతులు అధైర్యపడొద్దని.. ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం చేసి అండగా ఉంటామని వైఎస్ అవినాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఖరీఫ్‌లో రైతులు సాగు చేసిన వేరుసెనగ, పత్తి పంటలకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కోసం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు 7వేల హెక్టార్లు అంటూ నివేదిక ఇవ్వడంపట్ల రైతులకు అన్యాయం చేశారని ఎంపీ పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు కచ్చితమైన విస్తీర్ణం చూపి ఉంటే రైతులకు న్యాయం జరిగి ఉండేదన్నారు. ప్రభుత్వం అనంతపురం జిల్లాకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద *1300 కోట్లు మంజూరు చేస్తే.. వైఎస్ఆర్ జిల్లాకు కేవలం *600కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. జిల్లాపై ప్రభుత్వం ఎంత వివక్షత చూపుతుందో దీన్నిబట్టి అర్థమవుతోందని వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2010-11 సంవత్సరానికి ఉల్లి, బుడ్డశనగకు రావాల్సిన ఇన్సూరెన్స్ పెండింగ్‌లో ఉందని.. వెంటనే పరిష్కరించాలన్నారు. అలాగే 2011-12కు రబీలో రైతులు పంటల బీమాకు సంబంధించి ఏ పంటకు ఇన్సూరెన్స్ వర్థిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇన్సూరెన్స్ చీఫ్ రీజినల్ అధికారి ఎం.రాజేశ్వరి సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. వెంటనే ఆమె స్పందించి పెండింగ్‌లో ఉన్న రైతులు ఇన్సూరెన్స్ డబ్బులు త్వరలో అందజేస్తామని.. జనవరి చివరికి 2012కు సంబంధించిన ఇన్సూరెన్స్ దరఖాస్తులు పరిశీలించి వివరిస్తామని ఆమె తెలిపారు. అంతకుముందు వైఎస్ అవినాష్‌రెడ్డి తొండూరుకు రాగానే పాటిమీద ఆంజనేయస్వామి ఆలయం వద్ద వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. తొండూరు ఎస్ఐ శ్రీనివాసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ మండల పరిశీలకుడు బండి రామమునిరెడ్డి, ఎంపీపీ భర్త భూమిరెడ్డి రవీంద్రనాథరెడ్డి, సీనియర్ నాయకులు ఎర్ర గంగిరెడ్డి, తాలుకా ప్రధాన కార్యదర్శి దశరథరామిరెడ్డి, ఎంపీటీసీలు పాలూరు వేణుగోపాల్‌రెడ్డి, అగడూరు శివశంకర్‌రెడ్డి, సర్పంచ్‌లు వెంకట చలమారెడ్డి, ప్రకాష్‌రావు, తుమ్మల గంగిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు సురేష్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఈశ్వరరెడ్డి, రత్నమయ్య, గంగులయ్య, మాజీ కో.ఆప్సన్ సఫి, వాటర్ షెడ్ చెర్మైన్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బాధిత రైతులకు.. అండగా..
గుంటూరు సిటీ: బాధిత రైతుల్లో మనో ధైర్యం నింపేందుకు మరోమారు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ వెల్లడించారు. బుధవారం గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతులు, కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ గురువారం పలు గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా నిలవనున్నట్టు ఆయన తెలిపారు. ఉదయం పది గంటలకు ఉండవల్లి నుంచి ప్రారంభించి పెనుమాక, నిడమర్రు, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో పర్యటన జరగనున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా రైతులకు తమ అండ ఉంటుందని తెలియజేయడంతోపాటు ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ చేస్తామన్నారు. అనంతరం జిల్లా ఎస్పీని కలసి వాస్తవ పరిస్థితులపై వినతిపత్రం సమర్పిస్తామన్నారు. రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో ఎమర్జెన్సీ వాతావరణం రాజ్యమేలుతోందని మర్రి రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానికి భూములివ్వని వారిని భయభ్రాంతులకు గురిచేసే విధంగా అక్కడ పచ్చచొక్కాల దమనకాండ అమలవుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భూములను దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇవ్వనంటే అర్ధరాత్రి దాడి చేసి పోలీసులతో అక్రమంగా నిర్బంధిస్తారా? ఇదెక్కడి న్యాయం? అంటూ పాలకులను నిలదీశారు. దహనకాండ వ్యవహారంలో శ్రీనాథ్‌చౌదరి అనే వ్యక్తిపై అక్రమ కేసు మోపారన్నారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా అక్రమాలను ప్రతిఘటిస్తూ రైతులకు అండగా నిలుస్తున్న వైఎస్సార్ సీపీ పైనే ఆరోపణలు చేస్తూ తమతోపాటు రైతుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయితే వారి తాటాకు చప్పుళ్లకు బెరిరే వారు ఇక్కడ ఎవరూ లేరనే విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. తాము ఇక్కడ రాజధాని నిర్మించవద్దని కానీ, ఎవరూ భూములు ఇవ్వవద్దని కానీ ఎన్నడూ వ్యాఖ్యానించలేదని ఆయన స్పష్టం చేశారు. -
రూ.29.3 కోట్ల కాఫీ పరిహారం
పాడేరు : హుద్‌హుద్ తుఫాన్‌తో ఏజెన్సీలో ధ్వంసమైన కాఫీ, మిరియాల తోటలకు సంబంధించి బాధిత రైతులకు రూ.29.3 కోట్ల నష్టపరిహారం విడుదల చేశామని ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్ తెలిపారు. తుఫాను నష్టపరిహారం చెల్లింపులపై మంగళవారం తన కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఏపీడీలు, 11 మండలాల ఉద్యానవన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ తుఫాన్‌తో 31,050 మంది గిరిజన రైతులకు చెందిన 37,665 ఎకరాల్లో కాఫీ, సిల్వర్‌ఓక్ తోటలు ధ్వంసమయ్యాయని పీఓ చెప్పారు. వీరిలో 27,157మంది రైతులకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఈ ఖాతాల్లో నష్టపరిహారం సొమ్మును వెంటనే జమ చేస్తామన్నారు. ఇంకా 3,893 మంది రైతులు బ్యాంకు ఖాతాలను ప్రారంభించాల్సి ఉందని, వారంతా వచ్చే నెల 3వ తేదిలోగా బ్యాంకు ఖాతాలు తెరిచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నష్టపరిహారం బుధవారం నుంచి ఆయా రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. నష్టం నమోదుకు ఫొటోలు లేనిపక్షంలో గ్రామాలకు కెమెరాలతో వెళ్లి ఫొటోలు తీయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నేలకొరిగిన చెట్టును తొలగించిన వెంటనే ఆ చెట్టుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలని, జాబ్‌కార్డులు లేని రైతులకు వెంటనే జాబ్‌కార్డులు మంజూరు చేయాలని ఆదేవించారు. చింతపల్లి, కొయ్యూరు, జీకేవీధి మండలాల్లో తుఫాను నష్టాన్ని ఆన్లైన్ చేయడంలో వెనుకబడి ఉండటాన్ని పీఓ తప్పుపట్టారు. 3వ తేదిలోగా ఆన్లైన్ పనులను పూర్తి చేసి బాధిత రైతులకు పరిహారం అందించాలన్నారు. సమావేశంలో పీహెచ్ఓ చిట్టిబాబు, ఉపాధి హామీ పథకం ఏపీడీలు ప్రసాద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ భవన నిర్మాణాలకు సర్పంచ్‌లు ముందుకురావాలి ఏజెన్సీలో మంజూరైన పంచాయతీ భవన నిర్మాణాలు చేపట్టేందుకు సంబంధిత పంచాయతీల సర్పంచ్‌లంతా ముందుకు రావాలని పీఓ వినయ్‌చంద్ కోరారు. కితలంగి, బాకూరు, సీకుమద్దిల, మఠంభీమవరం, గత్తుం, పైనంపాడు, కొరవంగి, గోమంగి, బొంగరం, సుంకరమెట్ట, పట్టాం, రంగశీల పంచాయతీల సర్పంచ్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి నెలలోగా పంచాయతీ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఇప్పటికే 68 చెక్‌డ్యాం పనులు పూర్తి చేశామని, మరిన్ని చెక్‌డ్యాంల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
పెనుగొండ, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను, అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. శనివారం ఉదయం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో సహకార సంఘాలు దీర్ఘకాలిక రుణాలపై అందించిన ట్రాక్టర్లను, ద్విచక్రవాహానాలను రైతులకు సీఎం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయనను కలిసి తమ కష్టాలను మొరపెట్టుకున్నారు. ప్రకృతి విలయాల కారణంగా ఏటా నష్టపోతున్నామని తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పై-లీన్ తుపాన్ కారణంగా వరి చేలు నేలనంటాయని, ఈనిక సమయంలో వర్షాలు కురిసినందున వెన్నులోని గింజలు పొల్లుగా మారాయని ములపర్రు సొసైటీ అధ్యక్షుడు టీవీసీహెచ్ నాగేశ్వరరావు సీఎంకు విజ్ఞప్తి చేశారు. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. సహకార సంఘాల్లో రుణాలు పొందిన రైతులకు రెండేళ్లుగా పావలా వడ్డీ రాయితీ రావాల్సి ఉందని, ఈ బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఇలపర్రు సొసైటీ అధ్యక్షుడు చేకూరి సుబ్బరాజు కిరణ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సహకార సంఘాల ద్వారా రుణాలు తీసుకుంటున్న రైతులకు ఈసీలు మీ సేవ ద్వారా తీసుకోవడం వల్ల అదనపు ఆర్థిక భారమవుతోందని విన్నవించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం ఎన్నో పథకాలను అమలు చేసి అండగా నిలుస్తున్నామని చెప్పారు. రైతులకు లక్ష రూపాయల వరకూ వడ్డీలేని రుణాలను అందిస్తున్నామని, ఉచిత విద్యుత్, ఇతర రాయితీలు అందిస్తన్నామన్నారు. ఈ సందర్భంగా రూ. 6.30 లక్షల విలువైన 16 ట్రాక్టర్లను, 16 ద్విచక్రవాహనాలను అందజేశారు. అనంతరం సీఎం కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, బంగారు ఉషారాణి, ఈలి నాని, కారుమూరి నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, కలెక్టర్ సిద్ధార్థజైన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి వినతుల వెల్లువ ఈ సందర్భంగా పలువురు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వినతులు అందజేశారు. అనేక గ్రామాలకు ప్రధాన కూడలిగా ఉన్న మార్టేరును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామానికి చెందిన వెలగల నాగేశ్వరరెడ్డి, నల్లిమిల్లి వివేకానందరెడ్డి, తేతలి రాజారెడ్డి, కర్రి జగధీశ్వరరెడ్డి విన్నవించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధతకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి మోషేమాదిగ, లీగల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాపాక ప్రభాకర్ మాదిగ సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధికారులను ప్రశంసించిన సీఎం ఏలూరు : జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎంతో కష్టపడ్డారని కలెక్టర్ సిద్ధార్థ జైన్, జేసీ టి. బాబూరావునాయుడు, ఎస్పీ హరికృష్ణలను ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి ప్రశంసించారు. కృష్ణా జిల్లా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం మధ్యాహ్నం పెనుగొండ ఏఎంసీ గ్రౌండ్స్‌లో హెలికాప్టర్లో బయలుదేరే సమయంలో ముఖ్యమంత్రి జిల్లా అధికారులను ప్రశంసించారు. జేసీ బాబూరావునాయుడిని ప్రత్యేకం ము ఖ్యమంత్రి పిలిచి కరచాలనం చేసి ఇదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి మరింత కష్టపడాలని సూచించారు.