పాడేరు : హుద్‌హుద్ తుఫాన్‌తో ఏజెన్సీలో ధ్వంసమైన కాఫీ, మిరియాల తోటలకు సంబంధించి బాధిత రైతులకు రూ.29.3 కోట్ల నష్టపరిహారం విడుదల చేశామని ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్ తెలిపారు. తుఫాను నష్టపరిహారం చెల్లింపులపై మంగళవారం తన కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఏపీడీలు, 11 మండలాల ఉద్యానవన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ తుఫాన్‌తో 31,050 మంది గిరిజన రైతులకు చెందిన 37,665 ఎకరాల్లో కాఫీ, సిల్వర్‌ఓక్ తోటలు ధ్వంసమయ్యాయని పీఓ చెప్పారు.
వీరిలో 27,157మంది రైతులకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఈ ఖాతాల్లో నష్టపరిహారం సొమ్మును వెంటనే జమ చేస్తామన్నారు. ఇంకా 3,893 మంది రైతులు బ్యాంకు ఖాతాలను ప్రారంభించాల్సి ఉందని, వారంతా వచ్చే నెల 3వ తేదిలోగా బ్యాంకు ఖాతాలు తెరిచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నష్టపరిహారం బుధవారం నుంచి ఆయా రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు.
నష్టం నమోదుకు ఫొటోలు లేనిపక్షంలో గ్రామాలకు కెమెరాలతో వెళ్లి ఫొటోలు తీయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నేలకొరిగిన చెట్టును తొలగించిన వెంటనే ఆ చెట్టుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలని, జాబ్‌కార్డులు లేని రైతులకు వెంటనే జాబ్‌కార్డులు మంజూరు చేయాలని ఆదేవించారు. చింతపల్లి, కొయ్యూరు, జీకేవీధి మండలాల్లో తుఫాను నష్టాన్ని ఆన్‌లైన్ చేయడంలో వెనుకబడి ఉండటాన్ని పీఓ తప్పుపట్టారు. 3వ తేదిలోగా ఆన్‌లైన్ పనులను పూర్తి చేసి బాధిత రైతులకు పరిహారం అందించాలన్నారు. సమావేశంలో పీహెచ్‌ఓ చిట్టిబాబు, ఉపాధి హామీ పథకం ఏపీడీలు ప్రసాద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ భవన నిర్మాణాలకు సర్పంచ్‌లు ముందుకురావాలి
ఏజెన్సీలో మంజూరైన పంచాయతీ భవన నిర్మాణాలు చేపట్టేందుకు సంబంధిత పంచాయతీల సర్పంచ్‌లంతా ముందుకు రావాలని పీఓ వినయ్‌చంద్ కోరారు. కితలంగి, బాకూరు, సీకుమద్దిల, మఠంభీమవరం, గత్తుం, పైనంపాడు, కొరవంగి, గోమంగి, బొంగరం, సుంకరమెట్ట, పట్టాం, రంగశీల పంచాయతీల సర్పంచ్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి నెలలోగా పంచాయతీ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఇప్పటికే 68 చెక్‌డ్యాం పనులు పూర్తి చేశామని, మరిన్ని చెక్‌డ్యాంల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.
రూ.29.3 కోట్ల కాఫీ పరిహారం
Published Wed, Dec 31 2014 5:23 AM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM
Advertisement
Advertisement