ఇటుక బట్టీలకు పూడిక మట్టి
► రెవెన్యూ అధికారుల అండతో మాఫియా దందా
► నిర్మాణ పనులకు ఇదే మట్టి శనివారం 120 లారీలతో
► మట్టి తరలింపు పరిశీలన అంటూ
► రెవెన్యూ అధికారుల హడావుడి
► ప్రజాప్రతినిధి నుంచి బెదిరింపులతో వెనుదిరిగిన వైనం
సాక్షి, హన్మకొండ : పొలాల్లోకి చేరాల్సిన చెరువు పూడిక మట్టి ఇటుక బట్టీలకు చేరుతోంది. పంట పొలాలకు సారాన్ని అందించేందుకు ఉపయోగపడే ఈ మట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపుతోంది. మామూనూరు కేంద్రంగా సాగుతున్న మట్టి, మొరం మాఫియా మిషన్ కాకతీయ చెరువులపై కన్నేసింది. రైతుల పొలాలకు చేరాల్సిన మట్టితో నిత్యం వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తుతోం ది. రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెం ట్ అధికారుల అండతో ఈ దందా కొనసాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. మితిమీరిన ఈ దందాపై శనివారం ప్రభుత్వాధికారులు కర్రపెత్తనం చేయబోతే వారిపై ఓ ప్రజాప్రతినిధి కన్నె ర చే శాడు. దీంతో పూడిక మట్టి వ్యాపారం ఆరు లారీలు మూడు బట్టీలు అన్నట్లు సాగుతోంది.
సారవంతమైన మట్టి
మిషన్ కాకతీయ రెండో దశలో భాగంగా గీసుగొండ మండలం ఊకల్లు చెరువు, వంచనగిరి శాయంపేట చెరువు, చెన్నారం చెరువుల్లో పూడి క నిరంతరంగా తీస్తున్నారు. ఈ చెరువుల్లో పూ డికగా పేరుకుపోయిన నల్లరేగడి ఎంతో సారవంతమైందని వ్యవసాయ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ మేరకు నల్లరేగడి మట్టిని రైతుల పొలాల్లోకి ఉచితంగా చేర్చాల్సి ఉండ గా.. మొరం, మట్టి మాఫియా ఇందుకు అడ్డం పడుతోంది. అడ్డదారిలో మామునూరు, నక్కల పల్లి, బొల్లికుంట, తిమ్మాపురం శివారు వద్ద ఉ న్న ఇటుక బట్టీలకు ఈ మట్టిని చేరవేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా బట్టీల యజమానుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు.
అటు అధికారులు, ఇటు మాఫియా సహకారం ఉండడంతో ఇటుక బట్టీ వ్యాపారులు అధిక వడ్డీలకు అప్పు చేసి మరీ మట్టి కొనుగోలు చేస్తున్నారు. బట్టీల వద్ద టన్నుల కొద్ది మిషన్ కాకతీయ పూ డిక మట్టి నిల్వ చేస్తున్నారు. ఊకల్లు వద్ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మూ డు గోదాముల నిర్మాణం జరుగుతోంది. ఈ గో దాముల బేస్‌మెంట్లలో నింపేందుకు కూడా పెద్దపెద్ద గుట్టలుగా మిషన్ కాకతీయ మట్టి ని ల్వ చేశారు. ఈ మట్టి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. రెవె న్యూ, మైనింగ్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల అండతో మిషన్ కాకతీయ మట్టి వ్యాపా రం కొంత కాలంగా జోరుగా సాగుతోంది.
టిప్పర్ల జాతర
మిషన్ కాకతీయ మట్టి అక్రమంగా తరలిస్తున్న పట్టించుకునే వారు కరువైపోవడంతో శనివారం అక్రమ మట్టి వ్యాపారులు మరింతగా రెచ్చిపోయారు. పట్టపగలు 120 లారీలు, టిప్పర్లను ఏ ర్పాటుచేసి మిషన్ కాకతీయ మట్టిని మామునూరు, నక్కలపెల్లి, తిమ్మాపురం పరిధిలోని ఇటుక బట్టీల వద్దకు తరలించిండం ప్రారంభిం చారు. జాతర తరహాలో మిషన్ కాకతీయ మట్టి ని బట్టీల వద్దకు లారీల్లో తరలి వెళ్తుండడంతో శనివారం ఈ విషయం చర్చనీయాంశంగా మా రింది. దీంతో అధికారుల్లో గుబులు మొదలైం ది. వెంటనే హన్మకొండ తహసీల్ధార్ రాజ్‌కుమా ర్, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ సదానందం, వీఆర్వో దీపక్‌తో కలిసి నక్కలపల్లికి వచ్చారు. మిషన్ కాకతీయ మట్టిని తీసుకెళ్తున్న టిప్పర్లు, లారీల ను రోడ్డుపై నిలపగా స్థానికులంతా గుమిగూడారు.
నేత నుంచి ఫోన్
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై నాయు డు పెట్రోల్ బంక్ సమీపంలో మొరం వ్యాపా రం చేసే ఓ వ్యాపారి ఈ మట్టి మాఫియాకు నేతృత్వం వహిస్తున్నాడు. అధికారులు తమ లారీలను ఆపి అనుమతి పత్రాలను పరిశీలిస్తు న్న విషయం తెలిసిన సదరు మట్టి వ్యాపారి అక్కడకు చేరుకున్నాడు. తనకు అండగా నిలిచి న ఓ ప్రజాప్రతినిధికి ఫోన్‌లో సమాచారం ఇవ్వ గా... ఆయన నుంచి కాసేపట్లో అధికారులకు మరో ఫోన్ వచ్చింది. దీంతో అనుమతి పత్రాలను పరిశీలించకుండా అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ తతంగం చూస్తూ విస్తుపోవడం స్థానికుల వంతైంది.
మిషన్ మట్టి బట్టీలకు పోతోంది
మిషన్ కాకతీయ మట్టి తరలింపుకు సంబంధించి లారీలను పరిశీలిస్తున్న రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ సదానందం వివరణ కోరగా.... ‘ఊకల్లు చెరువు, శాయింపేట చెరువుల నుంచి మిషన్ కాకతీయ ద్వారా తీసిన పూడిక మట్టిని పంట పొలాలకు తరలించాల్సి ఉండగా బట్టీలకు తరలిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందచేస్తాం. మట్టి తరలిస్తున లారీలకు మైనింగ్ పర్మిషన్ ఉండడం వల్ల వెనుతిరిగి వెళ్తున్నాం’ అంటూ సమాధానం ఇచ్చారు.