రెవెన్యూ అధికారులు లంచం అడుగుతున్నారని.. ఓ బాధితుడు రాష్ట్ర గవర్నర్, తెలంగాణ ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్: రెవెన్యూ అధికారులు లంచం అడుగుతున్నారని.. ఓ బాధితుడు రాష్ట్ర గవర్నర్, తెలంగాణ ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, వీఆర్‌వోలు తనను రూ. 60 వేలు లంచం డిమాండ్ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో బాధితుడు ఆరోపించాడు. లంచం డిమాండ్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.