అక్రమంగా సాగు చేశారని.. | Forest officials to destroy of tribal crops | Sakshi
Sakshi News home page

అక్రమంగా సాగు చేశారని..

Published Tue, Aug 11 2015 3:45 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

అక్రమంగా సాగు చేశారని..

అక్రమంగా సాగు చేశారని..

సిరికొండ(నిజామాబాద్ జిల్లా): గిరిజనులు అక్రమంగా అటవీ భూముల్లో సాగు చేశారని అటవీ అధికారులు, పోలీసుల సహాయంతో పంటలను తొలగించారు. ఈ సంఘటన మంగళవారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామంలోని 50-60 ఎకరాల భూమిని గతంలో రెవిన్యూ అధికారులు గిరిజనుల పేరున పట్టా చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలను కూడా ఇచ్చారు. అయితే, ఈ భూమి అటవీ భూమి అని, మీరు ఏ అధికారంతో గిరిజనుల పేరున పట్టా చేస్తారని అటవీ అధికారులు.. రెవిన్యూ అధికారులను నిలదీశారు.

దీంతో కళ్లు తెరిచిన రెవిన్యూ అధికారులు భూమిని వెనక్కి లాక్కున్నారు. అయితే, ఎన్నో ఏళ్లుగా ఆ భూమిని సాగు చేస్తున్న రైతులు ఈ ఏడాది కూడా సాగు చేశారు. దీంతో అటవీ అధికారులు పోలీసుల సహాయంతో పంటను నాశనం చేశారు. కళ్ల ముందే సాగు చేసిన పంటను నాశనం చేస్తుండటంతో గిరిజనులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement