మీసేవ కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారారుు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆధార్‌కార్డులో మార్పులు చేర్పులపై ప్రజల్లో ఉన్న ఆందోళనను ఆసరాగా చేసుకుని కార్డు జారీకి డబ్బులు
వసూలు చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ సామాన్యులను కష్టాలకు గురిచేస్తోంది. సులభతరంగా అందాల్సిన కార్డు లు, మార్పులు-చేర్పుల వంటి సేవలు కష్టసాధ్యంగా మారాయి. వీటిని జయించాలంటే ఆధార్ సెంటర్‌లో చేస్తున్న సిబ్బంది చేయి తడపాల్సి వస్తోం ది. కాదంటే రోజుల తరబడి ఆధార్ కేంద్రాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఆ ధార్ సెంటర్‌కు వెళ్లింది మొదలు.. కార్డు దరఖాస్తు ఫారం ఇవ్వడానికి ఓ రేటు, దాన్ని నింపడానికి మరో ధర, క్యూలైన్‌లో త్వరగా వెళ్లడానికి ఓ రేటు లేదా టోకెన్ పద్ధతిలో సరిగ్గా సమయానికి వచ్చి ఐరిస్ మిషన్ ఎ దుట ఫొటో దిగడానికి ఓ రేటు నిర్ణయిం చారు. దాదాపుగా ప్రతీ ఆధార్‌సెం టర్‌లో, పని జరగడానికి రూ.100 చె ల్లించడం ఆనవాయితీగా మారింది.
ఉచిత సేవలకు.. పైసలు..
ఇటీవల కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు అమలు చేసే పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేశారుు. కార్డులు జారీ చేసేందుకు మండలానికి ఒకటి చొప్పున ప్రత్యేకంగా ఆధార్‌సెంటర్లు మంజూరు చేశారు. ఆధార్‌సెంటర్‌లో కార్డులు జారీ, మార్పులు చేర్పులు తదితర పనులకు ఒక్కోకార్డుకు రూ.25 నుంచి రూ.30 వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. కానీ ప్రజల అమాయకత్వం, అవగాహనలేమిని ఆసరాగా చేసుకుని సిబ్బంది వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి ప్రతీకార్డుకు సొమ్ము తీసుకుంటూనే మరోవైపు ప్రజల నుంచి అంతకు ఐదింతలు అక్రమంగా వసూలు చేస్తున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
ఆధార్ కేంద్రాల పనితీరును జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, మండల స్థాయిలో తహసీల్దార్లు చూడాలి. ఆధార్ పంపిణీ సక్రమంగా జరుగుతుందా? లేదా అనే అంశాలపై వీరు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కేంద్రాలపై ఆరోపణలు వచ్చినప్పుడే తప్పా మిగతా సమయంలో అధికారులు ఇటువైపు కన్నెతి చూడటం లేదు. ఫలితంగా ఆధార్ కేంద్రాల్లో అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఇటీవల కొన్ని ఆధార్ కేంద్రాల నిర్వాహకులు తప్పుడు పద్ధతిలో ఆసరా పథకానికి అనుగుణంగా వయస్సు పెంచి ఆధార్‌కార్డులు జారీ చేసిన తీరు ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇదే అంశంపై హన్మకొండ, ఆర్ట్స్‌కాలేజీ ఎదుట ఉన్న ఓ మీసేవా కేంద్రాన్ని ఇటీవల సీజ్ చేశారు. ఆధార్ సెంటర్ల పనితీరులో మార్పు వచ్చే వరకు జిల్లా, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
శివ.. శివా..
జిల్లా మారుమూల ప్రాంతాలతో పోల్చితే నగరంలో మీ సేవా కేంద్రాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. శివనగర్ మీసేవా కేంద్రంలో ఆధార్‌సెంటర్ కేంద్రంలో నిర్వాహకులు సామాన్యుల నుంచి డబ్బుల వసూలు చేస్తున్నారంటూ రెండు నెలల క్రితం అక్కడి ప్రజలు ఆందోళన చేశారు. అ యినా అధికారులు చర్యలు తీసుకోలేదు. సోమవారం ఇదే కేంద్రంలో ఆధార్‌కార్డుల జారీ ప్రక్రియను పరిశీలించగా మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో ఈ కేంద్రంలో 30 మంది ఆధార్‌కార్డు కోసం వేచి ఉన్నారు. వీరిలో పదిమందితో మాటలు కలపగా.. ఏడుగురు ఆధార్‌కార్డు కోసం రూ.100 చెల్లించినట్లుగా తెలిపారు. అంతకుముందు చార్‌బౌళిలో ఉన్న ఆ దార్‌సెంటర్‌కు వెళ్లగా అక్కడ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇలా రూ.100 యూజర్‌ఛార్జీల్లో భాగం అనుకుంటున్నట్లుగా తెలిపారు. రెవెన్యూ అధికారులు కొలువుండే జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాల్లో దందా మరింత జోరుగా సాగుతోంది.
అడ్రస్ మార్పు కోసం..
ఇంటి చిరునామా మార్చుకునేందుకు శివనగర్‌లో ఉన్న ఆధార్ కేంద్రానికి వచ్చాను. ఈ పని అయ్యేందుకు రూ.100 చెల్లించాలని ఇక్కడి సిబ్బంది తెలిపారు. దీనితో డబ్బులు చెల్లించి క్యూ లైన్‌లో నిల్చున్నాను. - పుష్ప, కరీమాబాద్
కొత్తగా పేరు చేర్చాలి..
గతంలో మా కుటుంబానికి ఆధార్‌కార్డు ఉంది. మా చిన్నబాబు పేరును ఆధార్‌కార్డులో చేర్చేందుకు వచ్చా ను. ఫారం నింపేప్పుడు రూ 100 ఇవ్వమంటే ఇచ్చా ను. రెండు, మూడు రోజుల్లో అవుతుందని చెప్పారు.
- దేవులపల్లి లత, ఎస్‌ఆర్‌ఆర్‌తోట
ఆధార్ దోపిడీ
Published Wed, Mar 4 2015 12:36 AM | Last Updated on Tue, Oct 16 2018 3:38 PM
Advertisement
Advertisement