గ్రూప్-1 అధికారులను జేసీలుగా నియమించాలి | Have to Appoint group-1 officers to JCs | Sakshi
Sakshi News home page

గ్రూప్-1 అధికారులను జేసీలుగా నియమించాలి

Published Mon, Sep 19 2016 4:18 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

గ్రూప్-1 అధికారులను జేసీలుగా నియమించాలి

గ్రూప్-1 అధికారులను జేసీలుగా నియమించాలి

ప్రభుత్వానికి తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం విజ్ఞప్తి
 
హైదరాబాద్: నూతనంగా ఏర్పడుతున్న జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లుగా గ్రూప్-1 ద్వారా ఎంపికైన అధికారులను నియమించాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గ్రూప్-1 సర్వీస్‌లో ఎనిమిదేళ్లు పూర్తిచేసిన అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్)ను ఏర్పాటు చేసి ఆ అధికారులనే జాయింట్ కలెక్టర్, శాఖాధిపతులుగా నియమిస్తే పరిపాలనలో సమతుల్యత ఏర్పడుతుందని వారు తెలిపారు.

ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్‌లుగా రెవెన్యూ అధికారులను నియమిస్తే అది యాయవిరుద్ధమే కాకుండా వివిధ శాఖల్లో ప్రతిభావంతులైన అధికారులకు అన్యాయం చేసినట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి హన్మంతు నాయక్, అధికారులు శశికిరణాచారి, అలోక్‌కుమార్, సర్వేశ్వర్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, పద్మజ, అనితాగ్రేస్, రఘుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement