యెమెన్ దక్షిణ ప్రాంతం టైజ్ ప్రావిన్స్లో సౌదీ సంకీర్ణ దళాలు గురువారం వైమానిక దాడులు జరిపింది.
సనా : యెమెన్ దక్షిణ ప్రాంతం టైజ్ ప్రావిన్స్లో సౌదీ సంకీర్ణ దళాలు గురువారం వైమానిక దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పౌరులు మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సంకీర్ణ దళాలు విడిచిన ఆయుధాలు రహదారిపై వెళ్తున్న బస్సుపై పడింది. కాగా బస్సులో 24 మంది కార్మికులు ఉన్నారని చెప్పారు. సదరు బస్సు కార్మికులను కంపెనీకి తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఉన్నతాధికారులు వివరించారు.