సనా: యెమన్లో వైమానిక దాడులు చోటుచేసుకుని 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పిల్లలు, మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులను అణిచివేసే క్రమంలో భాగంగా సౌదీకి చెందిన అరబ్ లీగ్ సంస్థ ఈ దాడులను జరిపించింది. దాడులు జరిగిన ప్రాంతాల్లో హౌతీ షియతే ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉంది.