బాగ్దాద్ : ఇస్లామిక్ తీవ్రవాదులే లక్ష్యంగా ఇరాక్ దేశవ్యాప్తంగా సైన్యం గురువారం నిర్వహించిన వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 35 మంది మరణించారు. మరో 44 మంది గాయపడ్డారని భద్రత ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల్లో తీవ్రవాదులు, పౌరులు ఉన్నారని... అలాగే క్షతగాత్రుల్లో కూడా తీవ్రవాదులు, పౌరులు ఉన్నారని తెలిపారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. బాగ్దాద్కు 330 కిలోమీటర్ల దూరంలోని అల్ క్వామి పట్టణం సమీపంలో జరిగిన దాడిలో 15 మంది తీవ్రవాదులు, ఏడుగురు పౌరులు మరణించారు. అనంతరం పట్టణంలో కర్య్ఫూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పలు ప్రాంతాలలో సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది.