170 మంది ఐఎస్ తీవ్రవాదులు హతం | 170 IS members killed in Syria | Sakshi
Sakshi News home page

170 మంది ఐఎస్ తీవ్రవాదులు హతం

Published Wed, May 20 2015 8:55 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

170 IS members killed in Syria

బీరూట్ : సిరియాలో ఐఎస్ తీవ్రవాదుల ఆగడాలకు అడ్డకట్టవేసేందుకు అక్కడి ఆర్మీ అధికారులు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా జరిపిన వైమానికి దాడుల్లో దాదాపు 170 మంది ఐఎస్ తీవ్రవాదులు హతమయ్యారని కుర్దీష్ స్వయం ప్రతిపత్తి ప్రాంత రక్షణ శాఖ ఉన్నతాధికారి నాజర్ హజ్ మన్సూర్ వెల్లడించారు. గత ఆదివారం నుంచి ఐఎస్ తీవ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు తెలిపారు. మృతులంతా జీహదీలే అని సిరియాలోని మానవహక్కుల సంఘం పరిశీలకులు చెప్పారు. మృతుల సంఖ్య 200 మంది ఉండవచ్చని వారు పేర్కొన్నారు. అయితే ఈ దాడుల్లో గాయపడిన వారి వివరాలు మాత్రం అందలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement