సిరియాపై కొనసాగుతున్న అమెరికా దాడులు!
Published Thu, Sep 25 2014 7:28 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
బీరట్: సిరియా దేశంపై అమెరికా యుద్ధ దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గురువారం సిరియాపై అమెరికా మరోమారు దాడులకు పాల్పడింది. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ పొజిషన్లపై యూఎస్ వైమానికి దాడులు మూడు రోజులుగా కొనసాగుతునే ఉన్నాయి. ఈ దాడుల్లో 19 మంది మృతి చెందినట్టు సమాచారం. దెయిర్ అల్ జోర్ లో గురువారం పెద్ద ఎత్తున దాడుల చేసింది.
దాడుల కొనసాగుతుండటంతో ఐఎస్ సైనికలుఉ అల్ రఖా వైపుకు పారిపోతున్నట్టు సిరియా మీడియా ఓ కథనంలో వెల్లడించింది. అమెరికా దాడుల కారణంగా సిరియాకు చెందిన 300 మంది శరణార్ధులు సముద్రంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సిరియా శరణార్ధులను రక్షించేందుకు సైప్రస్ దేశ అధికారులు రంగంలోకి దిగారు.
Advertisement
Advertisement